For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు కోరుకున్న బడ్జెట్లోనే అత్యంత విలాసవంతమైన పూజగది నిర్మాణం

|

గతంలో ఇంటికి అందమైన రూమ్ లింగ్ రూమ్ గా ఎంపిక చేసుకొని, వారి అభిరుచులకు తగినట్లుగా కట్టించుకొనేవారు. ట్రెండ్ మారే కొంది ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ఇంటి నిర్మాణంలో కూడా వారి అభిరుచికి తగినట్లుగా గదులను మోడ్రన్ గా తీర్చిదిద్దుకుంటున్నారు. లివింగ్ రూమ్, బెడ్ రూమ్ మరియు కిచ్ ను చాలా మోడ్రన్ గా ఇటాలియన్ స్టైల్ లో మోడ్రన్ గా నిర్మించుకొనే ఈ రోజుల్లో పూజగదికి కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తున్నారు. పూజగదిలో విశ్రాంతిగా...మనశాంతిగా పూజచేసుకోవడానికి సనాతన ధర్మాలను, సాంప్రదాయలను అనుసరించే విధంగా అనుగుణంగా నిర్మాణం చేయించుకుంటున్నారు.

ఇంట్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పుజగదిలో సానుకూల శక్తులుండే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పూజగదిలో దేవతల విగ్రహాహాలతో మరియు సువాసభరిమతైన పువ్వులతో, ఆయిల్ ల్యాంప్స్ తో, మరియు గంటలతో అలంకరించబడి ఉంటుంది. పూజగదిలో ఎలాంటి శబ్దాలు లేకుండా చాలా నిశ్శబ్దవాతావరనంలో పూజలు చేయడం, చేతులు జోడించి ప్రార్థలను చేయడం, మంత్రాలు వల్లించడం, ప్రార్థనా శ్లోకాలను చెప్పండం జరుగుతుంది.

ఇలా ఎవరికి తగిన రీతిలో వారు పూజగది నిర్మాణంను కట్టించుకోవడానికి ఇష్టపడుతుంటారు. చిన్న ఇల్లలో ఒక విధంగా పెద్దఇల్లలో ఒక విధంగా విశాలంటా వివిధ రకాల డిజైన్లతో రూపొందించుకుంటుంటారు. మీరు కూడా అలా పూజగదిని నిర్మించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని కోరుకుంటున్నట్లైతే మీకు తగిన బడ్జెట్లోనే మీ పరిమితికి బట్టి, స్థల విస్తీర్ణం బట్టి ఏవిధంగా పూజగదిని నిర్మించుకోవాలి అన్న విషాయాలు ఈ క్రింది స్లైడ్ ద్వారా..

కాంటెంపరెరీ పూజ రూమ్ డిజైన్ :

కాంటెంపరెరీ పూజ రూమ్ డిజైన్ :

ఈ కాంటెంపరెరీ పూజ రూమ్ డిజైన్ చాలా సింపుల్ గా క్లీన్ గా స్ట్రెయిట్ లైన్స్ తో చక్కగా డిజైన్ చేయబడినది. సువిశాలంగా ఉన్న పూజగదిలో పూజకు తగ్గవిధంగా కావల్సినంత స్పేస్ తో నిర్మించబడినది. ఇది ఒక్క సైడ్ కు దేవుని విగ్రాలు, లైట్స్, మరియు ఫ్లవర్ వాజెస్ అమర్చబడినవి. దేవుని విగ్రహాల కోసం ప్రత్యేకంగా చేయించి ఉడెన్ సెట్ అద్భుతంగా ఉంది.స్పేస్ ఎక్కువగా ఉన్నవారు ఇలాంటి డిజైన్స్ ను ఎంపిక చేసుకోవచ్చు.

ఆర్టిస్టిక్ పూజ రూమ్:

ఆర్టిస్టిక్ పూజ రూమ్:

దేవువుని విగ్రహాలతో పాటు, దేవుని ప్రతిరూపాలను ఆర్ట్ రూపంలో చిత్రీకరించి డిజైన్ చేయడం వల్ల ఆ గది యొక్క ఆకర్షణ మరింత పెరిగింది. ముఖ్యంగా ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ పూజగదికి మరింత బ్రైట్ నెస్ ను తీసుకొచ్చి అందమైన కళను సొంతం చేసుకుంది. ఇలాంటి పూజగదుల్లో వినాయక, శ్రీక్రిష్ణ, సాయిబాబా వంటి విగ్రహాలను అద్భుతంగా అమర్చుకొని ప్రశాంతమైన సమయాన్ని ఇక్కడ గడింపవచ్చు.

పడకగది కార్నర్లో పూజరూమ్:

పడకగది కార్నర్లో పూజరూమ్:

ఇంట్లో స్థలం తక్కువగా ఉన్నవారు ఇలాంటి డిజైన్స్ ఎంపిక చేసుకోవచ్చు. పడకగదిలో ఫోటోలో చూపించిన విధంగా ఒక కార్నర్ లో చిన్న క్యాబినెట్ ను ఏర్పాటు చేసుకోవచ్చు రెండు ఫ్లోటింగ్ డ్రాలను పూజవిగ్రహాలకు మరియు పటములకు సపోర్టివ్ గా కట్టించుకోవచ్చు . అలాగే గ్లాస్ సెల్ఫ్ లు మరింత స్థలంను చేకూర్చతుంది.

పూజనిర్వహించడానికి సరిపడినతంత స్థలంతో పూజగది:

పూజనిర్వహించడానికి సరిపడినతంత స్థలంతో పూజగది:

విశాలమైన స్థలం ఉన్నప్పుడు పూజగదిని ఇలా ఓపెన్ గా విశాలంగా విస్తరించి సిట్టింగ్ ప్లాట్ ఫార్మ్ అరేంజ్ చేసుకొని నిర్మించుకోవచ్చు. ఇలాంటి డిజైన్లు ఇంటికి కళతో పాటు, విశ్రాంతిని కలిగిస్తాయి. సానుకూల శక్తులను ఆకర్షిస్తాయి.

 వైట్ మార్బల్స్ మద్య పూజగది:

వైట్ మార్బల్స్ మద్య పూజగది:

వైట్ మార్బల్స్ మద్య పూజగది చాలా డిఫరెంట్ స్టైల్ లో గోడలోపలికే అమర్చడం జరిగింది . ఇలాంటి పూజగదులు చూడటానికి సింపుల్ గా అందంగా, క్లీన్ గా కనబడుతాయి.

 ఉడెన్ పూజా రూమ్ డిజైన్:

ఉడెన్ పూజా రూమ్ డిజైన్:

మార్బల్ స్టోన్ చూడటానికి లక్సరీగా కనబడుతాయి. వైట్ మార్బల్స్ తో మెరిస్తూ బ్యూటిఫుల్ గా కనిపిస్తున్న వైట్ వాల్ పేపర్ చాలా అద్భుతంగా నిర్మిచండం జరిగింది. పెద్ద పెద్ద ఫోటోలను లేదా విగ్రహాలను ఎంపిక చేసుకొన్నప్పుడు ఇలాంటి డిజైన్ చాల అద్భుతంగా ఉంటుంది.

 గ్రేస్ ఫుల్ పూజా రూమ్ డిజైన్:

గ్రేస్ ఫుల్ పూజా రూమ్ డిజైన్:

త్రిముఖ షేపులో ఆల్టర్ చేసి, డిజైన్ చేసిన పూజగది చాలా అద్భతుంగా గ్లోయింగ్ ఉంది. పూజగది చిన్నదైనప్పుడు ఇలాంటి డిజైన్స్ ఎంపిక చేసుకోవడం మంచిది.

English summary

7 Awesome Pooja Room Designs

Pooja rooms or prayer rooms are as essential as a kitchen or a bedroom in an Indian home. The pooja room is a sacred space of worship and prayer; it is a place where we conduct rituals to show honour and reverence to our gods.
Story first published: Monday, November 16, 2015, 17:35 [IST]
Desktop Bottom Promotion