For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా..కళగా..కర్టెన్స్ డెకరేషన్ ఎలా ??

|

ఇంటి అందం మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే.. కర్టెన్స్ ని డిఫరెంట్ గా హ్యాంగ్ చేయాలి. ఆకట్టుకునే డిజైన్‌, ఆహ్లాదాన్నిచ్చే రంగులతో హ్యాంగ్ చేసిన కర్టెన్లు ఇంటీరియర్‌ డెకరేషన్‌లో కీలకం. చూడగానే వావ్ అనిపించాలి అంటే.. కలర్ ఫుల్ గానే కాదు.. విభిన్నంగానూ హ్యాంగ్ చేయాలి. కొత్త స్టైల్లో కర్టెన్ ని ఎలా డెకరేట్ చేయాలో చూద్దాం.

Curtain

తలుపు దగ్గర ఒక రాడ్ కి రెండు కర్టెన్స్ ని వేలాడదీయడం ఓల్డ్ ఫ్యాషన్. విభిన్నంగా కర్టెన్స్ ని హ్యాంగ్ చేయడానికి కొత్త ఐడియాలతో పాటు.. ట్రెండీ రాడ్స్ కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. డోర్ దగ్గర నుంచి వేలాడదీస్తే కొత్తేముంది. సీలింగ్ నుంచి కిందకి వేలాడదీస్తే ఆ లుక్కే వేరు.

curtain
ట్రెండీ కర్టెన్స్ ప్రస్తుతం మార్కెట్ లో అందరినీ ఆకర్షిస్తున్నాయి. డియెర్స్ డిజైనర్స్ ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ రకరకాల కర్టెన్స్ ను డిజైన్ చేస్తున్నారు. కర్టెన్స్ ని తలుపు లేదా కిటికీ పై భాగం నుంచి కాకుండా.. సీలింగ్ నుంచి వేలాడదీస్తే అందంగా కనిపిస్తుందన్న ఆలోచన వారిదే. ఇలా సీలింగ్ నుంచి కర్టెన్స్ ని హ్యాంగ్ చేయడం వల్ల అందంగానే కాదు.. గది కూడా పెద్దదిగా.. విశాలంగా కనిపిస్తుంది.
curtain

డబుల్ లేయర్ కర్టెన్స్ ఇప్పుడు ఫ్యాషన్. కాబట్టి.. రెండు డిఫరెంట్ షేడ్స్ లో కర్టెన్స్ తీసుకుని.. సెపరేట్ రాడ్స్ కి హ్యాంగ్ చేస్తే.. ఎట్రాక్టివ్ గా ఉంటుంది. ఇలా డెకరేట్ చేస్తే.. ఎలాంటి క్లైమెట్ లో అయినా ఆకట్టుకుంటాయి. వీటిలో ఒక కర్టెన్ ని అలా వదిలేసినా.. మరో కర్టెన్ ని.. అక్కడక్కడ ఫోల్డ్ చేస్తూ అలంకరిస్తే మరింత అందంగా కనిపిస్తుంది.

ఈసారి పొడవు కర్టెన్స్ ను కొనుక్కురండి. మీ గదికి న్యూ లుక్ ఇవ్వండి. లేదంటే.. కొంచెం కలర్ ఫుల్ గా ఉన్న మీ అమ్మ పాత చీర గానీ.. మీ దుప్పట్టా కూడా వేలాడదీయొచ్చు.

English summary

Creative Ways to Hang Curtains

There are so many options and choices of fabrics, tracks, rods, styles and headings for drapery, that we often don’t know where to start looking to work out which curtain type will best suit the windows in our home and this can become confusing often causing us to give up before we even get started.
Story first published: Tuesday, September 22, 2015, 15:15 [IST]
Desktop Bottom Promotion