For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి అందాన్ని..అలంకరణను పెంచే వాల్ క్లాక్స్

|

సాదా సీదాగా వుండే గోడలను ప్రతిరోజూ చూసి చూసి విసుగెత్తారా? మీ గోడలు అందాలను సంతరించుకొని ప్రత్యేకంగా వుండాలా? అది కూడా అతి తక్కువ వ్యయంతోనా? అందమైన డిజైన్లు కల గోడలు ఇంటి వాతావరణాన్నే మార్చేస్తాయి. సృజనాత్మక ఆలోచనలుండాలేగాని తక్కువ వ్యయంతో స్వర్గాన్ని తలదన్నేలా మీ ఇంటిని అలంకరించవచ్చు.

ఇల్లు పెద్దదిగా కట్టుకుంటే గోడలు కూడా విశాలంగా ఉంటాయి. ఈ గోడల మీద అలంకరణలు లేకపోతే చూడటానికి బోసిపోయినట్లు కనిపిస్తాయి. గోడలు ఖాళీగా కనిపించకుండా ఉండటానికి ఫొటోలు, పెయింటింగ్స్‌తో అందంగా అలంకరించవచ్చు. అయితే ఈ అలంకరణ గోడల అందాన్ని ఇనుమడింపజేసేదిగా ఉండాలి. సాధారణంగా గోడలకు కేలండర్లు వేలాడదీస్తుంటారు. తేదీలు తెలుసుకోవడానికి ఒక కేలండర్‌ సరిపోతుంది. అలాగే సమయం తెలుసుకోవడానికి ఒక గడియారం అమర్చుకోవచ్చు. మిగిలిన గోడ అంతా అందంగా కనిపించాలంటే మంచి పెయింటింగ్స్‌, ఫొటోలు అమర్చవచ్చు.

చేతికి వాచ్‌ లేకపోతే ఎంత వెలితిగా ఉంటుందో గోడలకు వాల్‌ క్లాక్‌ లేకపోతే అంతే బోసిగా ఉంటుంది. అయితే గోడలకు అమర్చే వాల్‌ క్లాక్‌ సమయాన్ని మాత్రమే చూపిస్తే సరిపోదు. అది ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో కూడా భాగమవ్వాలి. ఇందుకోసం వాల్‌ క్లాక్‌ సెలెక్షన్‌లో కొన్ని చిట్కాలు పాటించాలి.

డెకరేటివ్‌ క్లాక్‌

డెకరేటివ్‌ క్లాక్‌

ఇంటికొచ్చిన అతిథుల చూపులను కట్టిపడేయాలనుకుంటే వాకిలికి ఎదురుగా లేదా లివింగ్‌ రూమ్‌లో పెద్ద రస్టిక్‌ క్లాక్‌ను ఏర్పాటు చేయాలి. ఆకారంలో పెద్దదిగా ఉండి అంకెలు కూడా స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఫ్లోటింగ్‌ నంబర్స్‌, మోనోక్రొమాటిక్‌ కలర్‌ స్కీమ్‌ కలిగిఉండే క్లాక్‌లు లివింగ్‌ రూమ్‌లో చక్కగా ఇమిడిపోతాయి. అయితే ఇలాంటి డెకరేటివ్‌ క్లాక్‌ గదిలోని ఫర్నిచర్‌ను డామినేట్‌ చేసేలా ఉండకుండా చూసుకోవాలి. గదిలోని మిగతా వస్తువులతో మ్యాచ్‌ అయ్యేలా ఉండాలి. ఇతర ఆర్ట్‌ పీస్‌లు, ఫొటోగ్రా్‌ఫలు ఏవీ లేకుండా ఖాళీగా ఉండే గోడ మీద ఓవర్‌సైజ్‌ రెట్రో క్లాక్‌ను అమరిస్తే లివింగ్‌ రూమ్‌ మరింత ఎట్రాక్టివ్‌గా కనిపిస్తుంది.

టేబుల్‌ క్లాక్స్‌

టేబుల్‌ క్లాక్స్‌

గోడల మీదే కాదు క్లాక్‌లు ఎక్కడున్నా ప్రత్యేకమైన స్టయిల్‌ను సృష్టిస్తాయి. కాబట్టి లివింగ్‌ రూమ్‌లోని సెంటర్‌ టేబుల్‌ మీద, బెడ్‌రూమ్‌లోని సైడ్‌ టేబుల్‌ మీద టేబుల్‌ క్లాక్‌లకు చోటు కల్పించాలి. గ్లాస్‌ టేబుల్‌ మీద గుండ్రటి టేబుల్‌ క్లాక్‌ను ఉంచితే టేబుల్‌కే కొత్త ఆకర్షణ చేకూరుతుంది. టేబుల్‌ క్లాక్స్‌ను టేబుళ్లకే పరిమితం చేయాలనే రూలేం లేదు. వీటిని షెల్ఫ్‌ల్లో కూడా అమర్చవచ్చు. హాల్‌ వేలో, బాత్‌రూమ్‌ క్యాబినెట్‌లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గదికి పురాతన కాలపు లుక్‌ తెప్పించాలంటే రోమన్‌ అంకెలతో, పెండ్యలమ్‌ కూడా కలిగి ఉండే ఉడెన్‌ మ్యాంటిల్‌ క్లాక్‌ను ఏర్పాటు చేయాలి.

అటామిక్‌ క్లాక్స్‌

అటామిక్‌ క్లాక్స్‌

సమయం కచ్చితంగా తెలిసేలా ఉండాలనుకుంటే అటామిక్‌ క్లాక్స్‌నే ఎంచుకోవాలి. అత్యంత కచ్చితమైన సమయాన్ని తెలిపే అటామిక్‌ క్లాక్స్‌ను జీపీఎస్‌ నావిగేషన్‌, ఇంటర్‌నెట్‌ సింక్రనైజేషన్‌కి ఉపయోగిస్తారు. ఇలాంటి మోడర్న్‌ క్లాక్స్‌ను ఇంట్లో, బయటా ఉపయోగించుకోవచ్చు. ఆటామిక్‌ క్లాక్‌లు మిగతా గడియారాల్లా బ్యాటరీ అయిపోగానే నెమ్మదిస్తాయనే భయం లేదు. కాబట్టి వంట గదిలో ఎక్కువ రద్దీగా ఉండే గదుల్లో వీటిని ఏర్పాటు చేసుకుంటే ఇంటిల్లిపాదీ సమయానికి అన్ని పనులూ చేసుకోగలుగుతారు.

డిజిటల్‌ క్లాక్స్‌

డిజిటల్‌ క్లాక్స్‌

సమయాన్ని తేలికగా తెలుసుకునేందుకు డిజిటల్‌ క్లాక్స్‌ చక్కగా ఉపయోగపడతాయి. స్కూల్‌కి వెళ్లే పిల్లలు, ఉద్యోగస్తులు ఉండే ఇంట్లో ఇలాంటి డిజిటల్‌ క్లాక్‌ ఉండటం ఎంతో అవసరం. అయితే వీటిలోనే రేడియో అలారం కూడా ఉన్నది కొంటే ఉదయాన్నే నిద్ర లేవటానికి ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఎమ్‌పీ3 కలిగిఉండే డిటిజల్‌ అలారం క్లాక్‌ను కొంటే చక్కటి పాటలతో అలారం క్లాక్‌ నిద్ర లేపుతుంది. పొద్దునే చీకట్లో నిద్ర లేచేవారికి బ్రైట్‌ డిస్‌ప్లే కలిగి ఉండే డిజిటల్‌ అలారం క్లాక్స్‌ ఎంతో ఉపయోగంగా ఉంటాయి.

పెండ్యులమ్‌ వాల్‌ క్లాక్స్‌

పెండ్యులమ్‌ వాల్‌ క్లాక్స్‌

పెద్ద గడియారం దాని అడుగు నుంచి వేలాడుతూ రెండు వైపులకూ ఊగుతూ ఉండే పెండ్యులమ్‌. ఇలాంటి పాతకాలంనాటి గడియారాలే లేటెస్ట్‌ ఫ్యాషన్‌గా మారాయి. నిశ్శబ్దంగా పనిచేస్తూపోయే గోడ గడియారాలకంటే కదలికలతో చూపరులను ఆకర్షించే పెండ్యులమ్‌ వాల్‌క్లాక్స్‌ లివింగ్‌ రూమ్‌కు ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెడతాయి. అలాగే పెండ్యులమ్‌ కదలికలతో వెలువడే టిక్‌ టక్‌ శబ్దం ఈ క్లాక్‌లకు మాత్రమే ఉండే ప్రత్యేక లక్షణం.

లైటెడ్‌ వాల్‌ క్లాక్స్‌

లైటెడ్‌ వాల్‌ క్లాక్స్‌

ఈ రకం వాల్‌ క్లాక్స్‌లో ఎనలాగ్‌ లేదా డిజిటల్‌ రకానికి చెందినవి ఉంటాయి. నియాన్‌, ఫ్లోరెసెంట్‌ లేదా ఎల్‌ఈడీ వెలుగును వెదజల్లే ఎలాంటి వాల్‌ క్లాక్‌ అయినా ఉపయోగానికి ఎంతో అనువుగా ఉంటుంది. చీకట్లో వెతుక్కునే శ్రమను తగ్గిస్తుంది. కాబట్టి వెలుగు తక్కువగా ఉండే గదుల్లో ఈ క్లాక్‌లకు స్థానం కల్పించాలి.

English summary

How To Accessorize Home With Clocks?

Every home has clocks but we never really consider them a part of the decoration. We invest on all kinds of other accessories for our home like show pieces, fancy furniture and other tid bits but the most obvious things don't occur to us
Story first published: Friday, September 11, 2015, 17:37 [IST]
Desktop Bottom Promotion