For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటికి వన్నెతెచ్చే లగ్జరీ క్యాండిల్స్ తో ఇల్లంతా ఆహ్లాదకరం...

|

సాధారణంగా రాత్రుళ్లో కరెంట్ పోయిందనుకోండి...ఏం చేస్తాం? క్యాండిల్ లేదా దీపం వెలిగిస్తాం..లేదంటే ఎమర్జెన్సీ లైట్ ఆన్ చేసేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ లైట్ ఉన్నా....దాని వెలుగు ఒక గదికే పరిమితమవుతుంది. ఒక వేళ అందులో చార్జింగ్ లేకపోతే ఇక అంతే సంగతులు. దీపం వల్ల ఇళ్లంతా పొగచూరే అవకాశం ుంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించకపోవడం మంచిది. ఇక మిగిలింది క్యాండిల్స్. దీనివల్ల ింటికి వెలుగే కాదు అందం కూడా వస్తుంది. కరెంట్ పోయినప్పుడే కాదు...పండుగల వంటి ప్రత్యేక సందర్భాల్లో క్యాండిల్స్ తో అలంకరిస్తే ఇల్లు ఎంతో అందంగా ఉంటుంది.

అలాగే మీ రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడానికి...శ్రీవారితో కలిసి కాసేపు అలా రొమాంటిక్ మూడ్ లో గడపడానికి కూడా క్యాండిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ క్రమంలోఇటీవల ఎన్నో రకాల డిజైన్లలో కొవ్వుత్తులు లభ్యమవుతున్నాయి. అలాగే అందమైన క్యాండిల్ హోల్డర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం క్యాండిల్స్ అమర్చుకోవడానికి మాత్రమే కాదు..ఇంటి అందాన్ని మరింత అందంగా పెంచడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. మరి అలాంటి అందమైన క్యాండిల్స్ హోల్డర్స్ గురించి తెలుసుకుందాం...మన ఇంటిని కూడా అందంగా అలంకరించుకుందాం...

ఒకే క్యాండిల్ తో:

ఒకే క్యాండిల్ తో:

ఎక్కువ వెలుగు లేకుండా ఒకే క్యాండిల్ అమర్చుకొనే క్యాండిల్ హోల్డర్స్ కూడా ప్రస్తుతం వివిధ రకాల డిజైన్లలో లభిస్తున్నాయి. దీనికి చేత్తో పట్టుకోవడానికి హోల్డర్, క్రింది భాగంలో పొందికైన ఆధారం కూడా ఉంటాయి. ఈ క్యాండిల్ హోల్డర్ ను ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లవచ్చు. క్యాండిల్స్ లైట్ డిన్నర్ చేయాలనుకున్నప్పుడు డిమ్ లైటింగ్ కోసం వీటిని అక్కడక్కడా ఉపయోగించుకోవచ్చు.

వెరైటీ క్యాండిల్ హోల్డర్లు:

వెరైటీ క్యాండిల్ హోల్డర్లు:

క్యాండిల్ హోల్డర్లు గురించి చెప్పుకునేటప్పుడు ‘క్యాండిలాబ్రా' హోల్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ హోల్డర్ చెట్టు ఆకారాన్ని పోలి ఉంటుంది. దీనిలో ఎక్కువ కొవ్వొత్తులు అమర్చుకోవచ్చు.

 కొత్తరం ల్యాంతర్లు:

కొత్తరం ల్యాంతర్లు:

ఇంట్లో అలంకరణ కోసం ఉపయోగించే మరో రకం క్యాండిల్ హోల్డర్లే క్యాండిల్ లాంతర్లు. మొన్నమొన్నటి వరకూ కొనసాగిన దీపపు చిమ్నీల స్థానంలోనే ప్రస్తుతం కొత్తగా క్యాండిల్ లాంతర్లు చేరాయి. మధ్యలో క్యాండిల్ ఉండి చుట్టూరా గాజుతో ఫిట్ చేసి ఉండడం వల్ల గాలి వీచినా కొవ్వొత్తి ఆరిపోయే అవకాశం ఉండదు. అలాగే వీటికి ఇంట్లో ఎక్కడంటే అక్కడ తగిలించుకోవడానికి వీలుగా హ్యాండిల్ అమర్చుకోవచ్చు.

హుందాతనం కోసం :

హుందాతనం కోసం :

ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దే క్యాండిల్ హోల్డర్స్ షాండ్లియార్లు కూడా ఒకటి. వీటిలో కూడా క్యాండిలాబ్రా హోల్డర్లు లాగానే ఎక్కువ కొవ్వుత్తులు అమర్చుకొనే విధంగా శాఖలుంటాయి. వీటిని ఇంట్లో హాల్లో అమర్చుకోవచ్చు.

లోహపు పాత్రలో:

లోహపు పాత్రలో:

ఇనుము, గాజు, ప్లాస్టిక్, చెక్కవంటి పదార్థాలతో చేసిన పాత్రల్లో అమర్చిన క్యాండిళ్ళను టీ లైట్ క్యాండిల్ హోల్డర్లు అంటారు. ఇవి ఎత్తు తక్కువగా ఉండే , విశాలంగా ఉంటాయి. పైగా వీటిలో అమర్చిన క్యాండిల్ కరిగి అందులోనే పడడం వల్ల కొవ్వొత్తి ఎక్కువ రోజులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవి చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు వీటిని అక్కడక్కడా అమర్చడం వల్ల ఇల్లంగా సరికొత్తగా తయారవుతుంది.

సంప్రదాయ కళ:

సంప్రదాయ కళ:

ప్రత్యేకించి పండగ సమయాల్లో ఇంటి అందాన్ని పెంచడంలో కోసం కూడా ఎన్నో రకాల క్యాండిల్ హోల్డర్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో బంగారం లేదా వెండితో తయారైనవి కూడా ఉండడం గమనార్హం. ఎక్కువ సంఖ్యలో కొవ్వొత్తులు వెలిగించడానికి వీలుగా ఉండే వీటిని గదిలో ఒక పక్కకు అమర్చిన టేబుల్ పై అలంకరించుకుంటే ఇంటికి సంప్రదాయబద్దమైన కళ వస్తుంది.

 క్యాండిల్ హోల్డర్స్

క్యాండిల్ హోల్డర్స్

ఇలాంటి అందాన్ని ద్విగుణీక్రుతం చేసే కొన్ని ముచ్చటైన క్యాండిల్ హోల్డర్స్ గురించి తెలుసుకున్నారు కదా. మరి మీరు కూడా ఇలాంటివి తెచ్చి మీ ఇంటిని అందంగా అలంకరించి ఉల్లాసభరితంగా గడపండి..

English summary

Tips To Select Candle Holders...

Tips To Select Living Room Candle Holders,Candle holders, which are heat proof containers, are considered as important decorative items. From age old days, these were used to decorate rooms. You can find many kinds of candle holders that comes in different shapes, size, material etc.
Story first published: Wednesday, January 6, 2016, 16:56 [IST]
Desktop Bottom Promotion