For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దోమల నియంత్రణకు మన ఇంటి గార్డెన్ లో ఉండాల్సిన 10 మొక్కలు

By Super
|

వర్షాకాలంలో బయట శిధిలాలలో ఉండే దోమలు విసుగును కలిగిస్తాయి. దోమ కుట్టటం వలన దురద మరియు మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ప్రజలు దోమలు కుట్టకుండా ఉండటానికి దోమల కాయిల్స్,దోమ వికర్షక క్రీములు, విద్యుత్ దోమ నిరోధకాలు మరియు హెర్బల్ దోమల లోషన్లు ఉపయోగిస్తారు. కొంత మందికి ఇవి పడక నాసికాకుహరం,చర్మం మరియు గొంతు సమస్యలు వస్తాయి. ప్రజలు దోమలను నియంత్రించడానికి రసాయనాలను ఉపయోగిస్తే ఆరోగ్యం మరియు పర్యావరణం మీద చెడు ప్రభావం కలుగుతుంది. మీరు సహజ మార్గం ద్వారా దోమల నియంత్రణ చేయాలి. అప్పుడు మీ పెరటిలో కొన్ని దోమ వికర్షక మొక్కలను పెంచాలి. ఈ దోమల వికర్షక మొక్కలు దోమలను దూరంగా ఉంచడానికి మరియు మీ యార్డ్ ప్రశాంతంగా ఉండటానికి సహాయపడతాయి. ఇక్కడ దోమలను నియంత్రించడానికి ఇంటిలో ఉండవలసిన కొన్ని మొక్కలు ఉన్నాయి.

దోమ వికర్షక మొక్కలు

రోజ్మేరీ

రోజ్మేరీ

రోజ్మేరీ మూలిక యొక్క నూనె ఒక సహజమైన దోమల నివారిణిగా వ్యవహరిస్తుంది. రోజ్మేరీ మొక్క 4 నుంచి 5 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. అలాగే నీలం పువ్వులు కలిగి ఉంటుంది. రోజ్మేరీ మొక్క వెచ్చని వాతావరణంలో బాగా పెరుగుతుంది. శీతాకాలంలో,ఈ మొక్క తట్టుకోవటానికి వెచ్చని నివాసం ఏర్పాటు చేయాలి. కాబట్టి ఒక కుండ లో రోజ్మేరీని పెంచి,శీతాకాలంలో మాత్రం ఇంట్లో ఉంచాలి. రోజ్మేరీని వంటలలో మసాలా కోసం వాడతారు. వెచ్చని నెలల్లో దోమలను నియంత్రించటానికి పెరటిలో రోజ్మేరీ మొక్క ఉంటే చాలు. అరకప్పు ఆలివ్ ఆయిల్ లో నాలుగు చుక్కల రోజ్మేరీ సుగంధ తైలం కలిపి చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. దానిని అవసరమైనపుడు ఉపయోగించాలి.

తైలము గడ్డి

తైలము గడ్డి

తైలము గడ్డి దోమల నియంత్రణ కోసం అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం 2 m పొడవు పెరుగుతుంది. అలాగే లావెండర్ రంగు పువ్వులు పూస్తాయి. ఈ తైలము గడ్డి ఆయిల్ ను కొవ్వొత్తులు, పరిమళ ద్రవ్యాలు,లాంతర్లు మరియు ఇతర హెర్బల్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు.దోమల వలన వచ్చే డెంగ్యూ జ్వరం నివారణకు కూడా తైలము గడ్డి సహాయపడుతుంది. దోమల నియంత్రణ కొరకు కొవ్వొత్తులు మరియు లాంతర్లలో క్రిమిసంహారిక తైలము నూనెను పోయాలి. తైలము గడ్డిలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. తైలము ఆయిల్ చర్మం కోసం సురక్షితం మరియు మీరు ఏ కాలంలోనైనా రాసుకోవచ్చు. దీని వలన ఎటువంటి నష్టం కలగదు.

బంతి పువ్వు

బంతి పువ్వు

బంతి పువ్వు అనేక కీటకాలు,మానవులు మరియు జంతువులు ఇష్టపడని విచిత్రమైన వాసన కలిగి ఉంటుంది. బంతి పువ్వు మొక్క 3 అడుగుల 6 అంగుళాలు వరకు పెరుగుతుంది. బంతిలో ఆఫ్రికన్ & ఫ్రెంచ్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఇవిరెండు దోమల నివారిణిగా ఉన్నాయి. కూరగాయల మొక్కల సమీపంలో బంతి మొక్కలను వేస్తే అఫిడ్స్ మరియు ఇతర కీటకాలు దూరంగా పోతాయి. బంతి పువ్వు పసుపు, ముదురు నారింజ మరియు ఎరుపు మొదలైన రంగులలో పూస్తుంది. బంతి మొక్క పెరుగుదలకు ఎండ అవసరం ఉంటుంది. దోమల నియంత్రణకు పెరడు,వాకిలి కుండలు మరియు తోటలలో బంతి మొక్కలను పెంచాలి.

కాత్నిప్

కాత్నిప్

కాత్నిప్ అనేది పుదీనా కుటుంబానికి అనుసంధానించబడిన ఒక మూలిక. దీనిని ఇటీవలే దోమల నివారిణిగా ప్రకటించారు. తాజా అధ్యయనం ప్రకారం,ఇది DEET పోలిస్తే 10 రెట్లు ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ మొక్క ఎండ లేదా పాక్షిక నీడ ప్రాంతంలో నాటితే 3 అడుగుల ఎత్తు పెరిగే శాశ్వత వృక్షం. ఈ మొక్కకు తెలుపు లేదా లవెందర్ పుష్పాలు పూస్తాయి. దోమలు మరియు ఇతర కీటకాలను నియంత్రించడానికి,పెరడు లేదా డెక్ సమీపంలో వీటిని పెంచాలి. పిల్లులకు ఈ వాసన అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ మొక్క చుట్టూ కంచె వేయాలి. దీనిని దోమలను నియంత్రించడానికి అనేక రూపాల్లో ఉపయోగించవచ్చు. మీరు తాజా ఆకుల చూర్ణం లేదా చర్మంపై ద్రవ రూపంలో ఉపయోగించవచ్చు.

అగేరతుం

అగేరతుం

అగేరతుం మొక్క మరొక దోమల నివారిణి వృక్షం. ఈ మొక్కకు కౌమరిన్ సృష్టించే లేత నీలం మరియు తెలుపు పుష్పాలు పూస్తాయి. ఇవి దోమల నివారణకు భయంకరమైన వాసనను కలిగి ఉంటాయి. కౌమరిన్ ను సాధారణంగా కమర్షియల్స్ దోమ నిరోధకాలు మరియు పెర్ఫ్యూమ్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. దీనిని చర్మం మీద ఎప్పుడు రుద్దకూడదు. అగేరతుం వేసవి అంతా లేదా పాక్షిక సూర్యుడు ఉన్న ప్రదేశంలో పెరుగుతుంది.

హార్స్ మింట్

హార్స్ మింట్

హార్స్ మింట్ కూడా దోమలు నియంత్రణకు సహాయపడుతుంది. హార్స్ మింట్ ప్రత్యేక శ్రద్ధ అవసరం లేని శాశ్వత వృక్షం. దీని యొక్క వాసన క్రిమిసంహారిక తైలము వంటిది. ఇది వెచ్చని వాతావరణం మరియు ఇసుక నేలలో బాగా పెరుగుతుంది. ఈ మొక్కకు పింక్ పువ్వులు పూస్తాయి. హార్స్ మెంట్ లో సహజ శిలీంద్ర నిర్మూలన,బాక్టీరియా లక్షణాలు మరియు క్రియాశీల పదార్ధాలు ఉంటాయి. దీనిని ఫ్లూ చికిత్సకు కూడా ఉపయోగిస్తారు.

వేప

వేప

వేప మొక్క బలమైన దోమ నివారిణి మొక్క అని చెప్పవచ్చు. వేప మొక్క క్రిమి వికర్షణ లక్షణాలను కలిగి ఉంటుంది. మార్కెట్ లో అనేక వేప ఆధారిత దోమ నిరోధకాలు మరియు బామ్స్ అందుబాటులో ఉన్నాయి. దోమలను నియంత్రించడానికి,మీరు కేవలం మీ పెరటిలో వేప మొక్కను వేయవచ్చు. వేప ఆకులను మండించుట లేదా కిరోసిన్ దీపాలు లేదా క్రిమిసంహారిక తైలము మంటలకు వేప నూనెను జోడించవచ్చు. మీ చర్మం పై వేప నూనెను రాసుకుంటే దోమలు దూరంగా పోతాయి. వేప మొక్కలో సహజ దోమల నివారిణి లక్షణాలు మరియు మలేరియా మీద వ్యతిరేకంగా పోరాడటానికి చాలా ప్రభావవంతమైనది.

లావెండర్

లావెండర్

లావెండర్ దోమల నివారణకు ఒక అద్భుతమైన మొక్క. లావెండర్ మొక్కను అతి తక్కువ రక్షణతో సులభంగా పెంచవచ్చు. ఇది 4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అలాగే వేడి వాతావరణం అవసరం. ఉచిత దోమల ద్రావణం చేయడానికి,నీటిలో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ వేసి చర్మానికి రాసుకోవాలి. దోమలను నియంత్రించడానికి,సీటింగ్ ప్రాంతాల్లో లావెండర్ మొక్కల కుండలను ఉంచండి. దోమలు దగ్గరకు రాకుండా ఉండటానికి మెడ,మణికట్లు మరియు చీలమండల వంటి ప్రాంతాలలో లవెందర్ ఆయిల్ దరఖాస్తు చేసుకోవచ్చు.

తులసి

తులసి

తులసి మొక్క కూడా దోమల నివారిణి మొక్క. తులసిని నలపకుండానే మంచి వాసన వచ్చే మూలికలలోఒకటి. దోమలను నియంత్రించటానికి మీ పెరటిలో తులసి మొక్కను పెంచండి. దోమలు దగ్గరకు రాకుండా తులసి ఆకులను పేస్ట్ చేసి చర్మానికి రాయండి. తులసిని ఆహారంలో వాసన కోసం వాడతారు. మీరు దోమలను నియంత్రించటానికి సిన్నమోన్ తులసి,నిమ్మ తులసి మరియు పెరువియన్ తులసి వంటివి బలమైన వాసన కలిగి ఉత్తమంగా పనిచేస్తాయి.

నిమ్మ ఔషధతైలం

నిమ్మ ఔషధతైలం

నిమ్మ ఔషధతైలం కూడా దోమలను దగ్గరకు రాకుండా చేస్తుంది. నిమ్మ ఔషధతైలం మొక్క వేగంగా పెరుగుతుంది. ఇది గదిలో బాగా వ్యాప్తి చెందుతుంది. నిమ్మ ఔషధతైలం ఆకులలో సిత్రోనేల్లాల్ మిశ్రమాలు సమృద్దిగా ఉంటాయి. సిత్రోనేల్లాల్ మిశ్రమాన్ని కమర్షియల్స్ దోమల నివారిణిలో ఉపయోగిస్తారు. 38 శాతం సిత్రోనేల్లాల్ కలిగిన అనేక రకాల నిమ్మ ఔషధతైలం మొక్కలు ఉన్నాయి. దోమల నియంత్రణకు మీ పెరటిలో నిమ్మ ఔషధతైలం మొక్కను పెంచండి. దోమలు దగ్గరకు రాకుండా ఉండాలంటే నిమ్మ ఔషధతైలం మొక్క ఆకుల చూర్ణంను చర్మం పై రాసుకోవాలి.

English summary

10 Mosquitoes Controlling Plants for Home

Mosquitoes are among the biggest nuisance of monsoon that ruins the outdoor fun. Bites of mosquitoes are extremely itchy as well as spread diseases such as malaria. People use mosquito coils, mosquito repellent creams, electronic mosquito repellents and herbal mosquito lotions to keep mosquitoes at a bay.
Story first published: Thursday, October 30, 2014, 17:54 [IST]
Desktop Bottom Promotion