For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండోర్లో ఆకట్టుకునే అందంతో ఆఫ్రికన్ వైలెట్

|

కొన్ని పూలు ముచ్చటైన రంగుల్లో మది దోచేస్తాయి... అందరినీ ఆకట్టుకుంటుంటాయి...ఇంటి ముందు, నట్టింట్లో పెంచుకోవడం మాత్రమే కాదు, ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలన్నా ఇవి చక్కని ఎంపికవుతాయి. అలాంటి ప్రత్యేకతలన్నీ ఉన్నవే ఆఫ్రికన్ వైలెట్లు....

ప్రపంచ వ్యాప్తంగా ఇవి వందల వెరైటల్లో దొరుకుతున్నాయి. మన దేశంలో మాత్రం ఎరుపు, గులాబీ, తెలుపు , వంగపూవ్వు కలర్ వంటి ఐదారురంగుల్లోనే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. సుమారు రెండొందలు రూపాయల ఖరీదులో ఇవి అన్ని నర్సరీల్లో లభిస్తాయి.

1. ఇంట్లోనే అందంగా పెంచుకోవచ్చు:
మన వాతావరణంలో ఇది చాలా చక్కగా పెరుగుతుంది. పూలు త్వరగా పూస్తాయి. అయితే ఇతర పూల మొక్కలతో పోలిస్తే ఇది నేరుగా పడే సూర్యకాంతిని తట్టుకోలేదు. అందువల్ల పెరట్లో పెంచుకుంటున్నా, లేక కుండీల్లో నాటుకుని, ఇంట్లోనే పెంచుకుంటున్నా తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ముదురు రంగుల్లో గుబురుగా పూలు పూయడం ఈ మొక్క ప్రత్యేకత. బాల్కనీ, కిటికీలు, మాత్రమే కాదు...టీపాయ్, డైనింగ్ టేబుల్...ఇలా ఎక్కడైనా ఈ మొక్కను పెట్టుకోవచ్చు. వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. లేదంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాధం ఉంది.

2. ఆఫ్రికన్ వైలెట్ మొక్కను పెంచుకోవాలనుకున్నప్పుడు తేమ ఎక్కువగా పీల్చుకునే మట్టిని ఎంపిక చేసుకోవాలి. లేదంటే సమాన పరిమాణంలో కోకోపీట్ ఎరువుల మిశ్రమాన్ని కలిపి మొక్కను నాటాలి. లేదంటే మట్టిలో తేమ తగ్గి ఆకులు సహజ అందాన్ని కోల్పోతాయి. క్రమంగా ఎండి రాలిపోతాయి. అందుకే ఎప్పటికప్పుడు తేమ తగ్గకుండా చూసుకోవాలి. అది కుదరదనుకున్నప్పుడు సెల్ఫ్ వాటరింగ్ కంటైనర్ ని మొక్క దగ్గర ఏర్పాటు చేసినా మంచిదే. దీని వల్ల నెల వరకూ దానికి తేమను పరిశీలించాల్సిన అవసరం ఉండదు.

3. ఒక మొక్కను నాటుతూనే..దాన్నుంచి మరికొన్ని పెరిగేలా కూడా చేసుకోవచ్చు. అదెలాగంటే..ఈ మొక్క కాండం చాలా సున్నితంగా, దానిలోపల జెల్లీ తరహా ద్రవంతో నిండి ఉంటుంది. దీన్ని నాటేముందే కణుపుల దగ్గర పదునైన చాకుతో కత్తిరించి అంటుకట్టడం ద్వారా కొత్త మొక్కలను కూడా పాక్షికంగా ఎండ తగిలే చోట ఉంచితే సరిపోతుంది.

4. పోషకాలూ అందించాలి: ఈ మొక్క ఎంత సులువుగా పెరుగుతుందో అంత సున్నితమైంది కూడా. అందుకే నీళ్లు పెట్టడం నుంచి ఎరువులు వేసే వరకూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ నీళ్ళు పడితే అవి కాకుండా ఫిల్టర్ నీటిని ఎంపికచేసుకోవాలి. అలాగే 14:14:14నిష్పత్తిలో నీటిలో కరిగే ఎన్ ఫీకే, మైక్రోన్యూట్రీయంట్లను కలిపి నెలకోసారి చల్లాలి. ఎరువుల మోతాదు ఎక్కువైతే మొక్క మాడిపోయే ప్రమాధం ఉంటుంది. అందుకే నిష్పత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

How to Grow African Violets Indoors

5. ఇవన్నీ ఒకఎత్తైతే వీటికి చీడపీడల బెడద కూడా ఎక్కువే. కంటికి కనబడే ఆకులు, కాండంపై దాడిచేసే పురుగులతో పాటు, కనిపించకుండా వేళ్లను నాశనం చేసేవీ ఉంటాయి. కాబట్టి పదిహేను రోజులకోసారి వేపనూనె, వెల్లుల్లి రసం కలిపిన నీళ్లను ఆకులపై చల్లుతూ ఉండాలి. సర్ఫ్ నీళ్లతో ఆకులను తుడవాలి. ఈ జాగ్రత్తలతో పాటు యాంటీఫంగల్ గా పరిగణించే కార్భండైజమ్ ను నీళ్లలో కలిపి అప్పుడప్పుడూ చల్లుతుంటే, మొక్క ఆరోగ్యం పెరుగుతుంది.

English summary

How to Grow African Violets Indoors


 African Violets, also known as Saintpaulia, are great plants for indoor growing because of their beauty and easy care. Originating from Tanzania and Kenya, these flowering perennials will thrive outdoors in some climates, but do best as houseplants in most areas because they do not tolerate cold temperatures.
Story first published: Thursday, December 4, 2014, 15:53 [IST]
Desktop Bottom Promotion