For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పెరటి గార్డెన్ లో గుభాళించే లిల్లీలు పూయించండిలా...

|

పువ్వుల్లో ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అయినటువంటి పువ్వు లిల్లీపువ్వులు. లిల్లీ పువ్వు చూడటానికి అద్భుతంగా మరియు ఆకర్షణీయంగా కనిపించడం మాత్రమే కాదు, ఘుబాలించే సువాసనతో మెస్మరైజ్ చేసేస్తుంది. వికసించే లిల్లీపువ్వులను చూస్తుంటే ఎవరికైనా సరే మత్రముగ్దులు అయిపోతారు. అంత అందం, సువాసన కలిగినది లిల్లిపువ్వు. ఈ పువ్వు యొక్క వాసన తగిలితే చాలా మనలో ఉండే బావోద్రేకాలు మాయం అయిపోవాల్సిందే. అటువంటి లిల్లీ మొక్కలు మన గార్డెన్ లో ఉంటే మనకెంత హాయిగా ఉంటుంది, చెప్పండి.

పువ్వులు లేని ప్రకృతిని ఓ సారి కళ్లు మూసుకుని ఊహించుకోండి..... పసిపాపల బోసి నవ్వులు లేని ఇల్లంత భయకరంగా కనిపిస్తోందిగా... అదే మరి... ఆ పువ్వులలో స్వచ్ఛత, ప్రకృతికే కాదు సమస్త్త మానవాళి 'మనుగడ'కు దిక్సూచిలా నిలచే పుష్పాలలో లిల్లి కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. లిలియేసి వృక్ష జాతికి చెందిన ఈ లిల్లీ పుష్పాలు ప్రపంచ వ్యాప్తంగా 110 రకాలుగా లభ్యమవుతున్నట్లు వృక్ష శాస్త్రనిపుణులు చెప్తున్నారు. గుభాళింపులతో మనసుని మైమరిపించే ఈ లిల్లీ ఉత్తర అర్ధగోళంలో ఎక్కువగా దర్శనమిస్తుంది.

ముఖ్యంగా మన దేశంలో నీలగిరి పర్వత ప్రాంతంలో ఎక్కువగా సాగవుతోంది. శీతాకాలం చివర్లో పుష్పించడం ప్రారంభించి చల్లని గాలులకు తోడుగా మంచి సువాసనలు వెదజల్లుతూ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంటాయి. నేలల్లో లిల్లీ జాతులు అంటు కట్టడం ద్వారా కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి... చిన్న పాటి నీటి తుంపర్లకే తమని తాము అభివృద్ది పరచుకుంటూ విస్తారమవుతాయి. ఈ లిల్లీ మొక్కలును మీ గార్డెన్ లో పెంచుకోవడానికి దశల వారిగా సూచించడం జరిగింది.

Tips To Plant Lilies In Your Garden

1. మొదట, ఈ మొక్క పెరగడానికి ఎండ బాగా ఉండాలి, ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సమయాల్లో ఈ మొక్కకు సూర్యరశ్మి చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే సూర్యరశ్మివల్లే ఈ మొక్కకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ అందుతాయి. దాంతో మొక్క వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా లిల్లీ దుంపలను కనీసం 12 ఇంచీల లోతులో పూడ్చిపెట్టాలి . దాని వల్ల మొక్క పెరిగే కొద్ది, మొక్కకు గట్టి సపోర్ట్ గా నిలుస్తుంది.

2. లిల్లీ మొక్కకు పూర్తిగా నీరు అవసరం ఉంటుంది. ఈ మొక్క పెరుగుదలకు నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. మరియు మన్ను కూడా సారవంతంగా ఉండాలి. మన్ను లేదా ఎరువు ఎసిడిక్ లేదా న్యూట్రల్ గా ఉండాలి. ల్లిల్లీపువ్వులు వికసించడం మొదలు పెడితే, వెంటనే మొక్కను వేరే పాట్ లో మార్చాలని గుర్తుంచుకోవాలి.

3. లల్లీపువ్వుల మొక్కలు బాగా పెరగాలంటే కపోస్ట్(ఎరువు)కూడా పల్చటి లేయర్ గా వేయాల్సి ఉంటుంది. లిల్లీ మొక్కల పెంపకంలో ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలాగే మొక్కకు రక్షణ పూత కూడా ఉండటం వల్ల ఈ మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. లిల్లీ పువ్వులు వివిధ రంగుల(రెడ్, ఆరెంజ్, పింక్, ఎల్లో మరియు వైట్)లో పూస్తాయి. మరికెందుకు ఆలస్యం మీ పెరటి గార్డెన్ ను గుబాళించే లిల్లీ మొక్కలతో నింపేయండి.

English summary

Tips To Plant Lilies In Your Garden

Lilies are one of the most popular flowers in the world. The fact that their appearance is supremely striking and appealing cannot be denied, can it? Well, anybody would love to look at a lovely flower that is blooming.
Story first published: Tuesday, November 18, 2014, 17:21 [IST]
Desktop Bottom Promotion