For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాన్‌స్టిక్‌ పాత్రలు ఎలా వాడాలి?తీసుకోవల్సిన జాగ్రత్తలు..!

|

ఈరోజుల్లో ఇత్తడి, రాగి పాత్రలు వాడకం బాగా తగ్గిపోయింది.వాటిని వాడే సమయంలో శుభ్రపరచు కొనేందుకు కొంత కష్టపడాల్సి వచ్చేది. మారుతున్న కాలంతోపాటు స్త్రీలకు వంటింటి సదుపాయాలు పెరగడంతో కాస్త పని విషయంలో కూడా కొంత ఉపశమనం దొరికినట్టయింది. వంటింటి సామాగ్రిలో వంట పాత్రలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఈ పాత్ర లను శుభ్రపరిచే విధానం సులభతరం చేయడంకోసం క్లీనింగ్‌పౌడర్లు, సబ్బులు మార్కెట్లోకి వచ్చాయి.

కానీ అంతకంటె సులభ పద్ధతిలో పాత్రలను క్లీన్‌చెయ్యడం, సులభంగా వంటను చేసుకొవడంకోసం నాన్‌స్టిక్‌ పాత్రలను మార్కెట్లోకి విడుదల చేసారు. ఇవి వచ్చికూడా చాలాకాలం అయింది. కానీ వీటిని వాడే విధానం చాలా మందికి నేటికీ తెలియదు. పద్ధతి ప్రకారం వీటిని వాడకపోతే అవి త్వరగా పాడయి, ఉపయోగం లేకుండా పోతాయి. అందుకే వీటిని వాడే విధానాలను కొన్నింటిని తెలుసుకోవడం మంచిది....

Nonstick Cookware
1. మొదటిసారి నాన్‌స్టిక్‌ పాత్రలు వాడేందుకు ముందు వాటిపై అతికించిన స్టిక్కర్‌ పాత్రను కొద్దిగా వేడి చేస్తే సులభంగా ఊడివస్తుంది. ఆ తర్వాత కొద్దిగా వేడినీటితో శుభ్రంచేసి ఆరబెట్టాలి. చిన్న చెంచాడు నూనెను వేసి మెత్తని బట్టతో పాత్ర అన్నివైపులకూ రాయాలి.

2. నాన్‌స్టిక్‌ పాత్రలను ఎప్పుడూ సన్నని సెగపైనే ఉంచాలి. ఎక్కువ మంట పెట్టడం వల్ల వీటి పాలిష్‌ త్వరగా పోతుంది.

3. ఈ పాత్రల్లో వండే పదార్థాలను కలిపేందుకు ఎప్పుడూ ప్లాస్టిక్‌ లేదా చెక్క గరిటెలను మాత్రమే వాడాలి. ఇనుము, స్టీల్‌, ఇత్తడి, సిల్వర్‌ వంటి గరిటెలను, అట్లకాడలను వాడకూడదు.

4. వీటిని శుభ్రపరిచేందుకు ధృఢంగా ఉండే పీచును, స్టీల్‌, ప్లాస్టిక్‌ వంటి రేపర్‌లను వాడకూడదు. ఎక్కువ ఘాటుగా ఉండే క్లీనింగ్‌ పౌడర్‌లను కూడా ఉపయోగించకూడదు. అంతేకాదు బాగా మెరుపు రావడంకోసమని ఎక్కువసమయం రుద్దడం, తోమడం చేయకూడదు. వీటిని ఎప్పుడూ ఏదైనా మెత్తని పీచుతోగాని, బ్రష్‌తో వేడినీళ్ళు, లేదా లిక్విడ్‌ సోప్‌లతో శుభ్రం చేయాలి.

5. ఒక వేళ పాత్రకు ఏవైనా పదార్థాలు అతుక్కొని ఉంటే వాటిని చాకు, చెమ్చా వంటి వాటితో పెల్లగించడానికి చూడకూడదు. పాత్రలో నీటిని పోసి కొద్ది సమయం నాననివ్వాలి. తర్వాత మెల్లగా రుద్దికడిగితే అతుకున్న పదార్థం వదిలిపోతుంది.

6. నాన్‌స్టిక్‌ పాత్రలను వంటింటి గట్లపైన, అల్మారాల్లో భద్రపరచకుండా, ఎప్పుడూ సామాన్లు భద్రపరిచే స్టాండుల్లోనే పెట్టడం మంచిది. ఇలా చేయడంవల్ల వస్తువు పైభాగంలో ఉండే పెయింటింగ్‌ ఎక్కువకాలం పోకుండా ఉంటుంది.

7. నాన్‌స్టిక్‌ పాత్రలు ఎక్కువకాలం కొత్తవిగానే కనిపించేందుకు, వాటిని వాడిన తర్వాత శుభ్రంచేసి, మెత్తని పొడి బట్టతో తుడిచి, కొద్దిగా నూనెను రాసి భద్రపరుస్తుండాలి.

English summary

How to Use Non-stick Cookware | నాన్‌స్టిక్‌ పాత్రలు ఎలా వాడాలి?తీసుకోవల్సిన జాగ్రత్తలు..!


 Despite the popularity of easy-to-clean, Teflon-coated cookware, these pans have come under fire numerous times for their supposed link to cancer-causing gases and particles.
Story first published: Wednesday, May 8, 2013, 17:06 [IST]
Desktop Bottom Promotion