For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షకాలంలో సోఫాలకు చెమ్మతగలనీయకు

|

సాధారణంగా మన ఇంటి అలంకరణ అంతా ఇంటి ప్రధాన భాగం అయిన లివింగ్ రూమ్ లేదా హలు అలంకరణలోనే ప్రతిబింబిస్తూ వుంటుంది. సాంప్రదాయక సోఫాలు భారతీయ సంస్కృతిని చాటుతాయి. రంగురంగులుగా వుండే ఈ సోఫాలు చూసేవారిని ఇట్టే ఆకర్షిస్తాయి. సోఫాలు మనకుగల ధనికత్వ స్ధాయిని, అనుభవించే సౌకర్యాలను చాటుతాయి. ఇక వీటి డిజైను ఇంటి యజమానికుండే అభిరుచి, సృజనాత్మకత, బడ్జెట్ బట్టి వుంటాయి.

సోఫాలను ఎంపిక చేసుకొని ఇంటికి తీసుకురావడం ఒక ఎత్తైతే, రెండవది వాటిని చక్కగా మన్నికగా మెయింటైన్ చేయడం మరో ఎత్తు. వేసవి కాలంలో ఎటువంటి సమస్య లేకున్నా, వర్షాకాలంలో వర్షాలు పడుతుండటంతో ఇంట్లో, బయటా ఎక్కడ చూసినా తడితడిగా ఉంటుంది. తడికాళ్లతో ఫర్నీచర్‌ మీద కూర్చోడం, గోడలకు చెమ్మపట్టి వాటిని ఆనుకున్న ఫర్నీచర్స్‌కి చెమ్మపట్టడం జరుగుతుంది. ఈ విధంగా దుర్వాసన పట్టిన కప్‌ బోర్డులు, చెమ్మగిల్లిన సోఫాలు, తుప్పు పట్టిన ఫర్నీచర్‌తో ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ జాగ్రత్తలను పాటించటం తప్పనిసరి.

Clean Leather Furniture To Last Long

1. సోఫాలను కవర్లతో సరిపెట్టకుండా వాటి కింద ఓ ప్లాస్టిక్‌ షీట్‌ను కూడా వేయాలి. ఇలా చేయటం వల్ల కుషన్లు పాడవకుండా కాపాడుకోవచ్చు. అలాగే మంచంపై వాడే పరుపుపై కూడా ప్లాస్టిక్‌ కవర్‌ వేయటం మర్చిపోకూడదు.

2. మంచి చెక్కతో తయారైన ఫర్నీచర్‌ను కిటికీల పక్కగా పెట్టుకోకూడదు. ఒకవేళ అలా పెట్టినట్లయితే వర్షం పడే సమయాలలో చినుకులు పడటం వల్ల అవి తడిసి పాడవటమే కాకుండా ఉబ్బుతాయి.

3. తేమ ఎక్కువగా ఉన్న ఇళ్లలో సోఫాలు చెమ్మగిల్లే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు సోఫాలు, కుర్చీలను ఓ మెత్తని పొడిబట్టతో తుడవటం చాలా అవసరం.

4. సోఫాల వెనుక వైపున గాలి తగలని చోట ఫంగస్‌ పెరుగుతున్నట్లుగా అనిపిస్తే గోరువెచ్చని నీటిలో డెట్టాల్‌ కలిపి, మెత్తని పొడిబట్టను అందులో ముంచి ఫంగస్‌ ఉన్నచోట రుద్దాలి.

5. వార్డ్‌ రోబ్‌లు, కప్‌బోర్డులు లాంటి వాటిని గోడలకు కనీసం ఆరు అంగుళాల దూరంలో ఉండేలా అమర్చుకోవాలి. లేకపోతే గోడలు చెమ్మగిల్లే ఇళ్లలో ఫర్నీచర్‌ కూడా చెమ్మగిల్లి త్వరగా పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Story first published: Monday, September 1, 2014, 17:43 [IST]
Desktop Bottom Promotion