For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో దుస్తుల మీద మరకలను తొలగించే చిట్కాలు

|

వర్షాకాలంలో అడుగు బయటపెట్టాలంటే బయపడుతుంటారు. మంచి దుస్తులు వేసుకోవాలంటే బయపడుతుంటారు, ఎక్కడ వర్షంలో తడవాల్సి వస్తుందో, బురద నీరు ఎక్కడ దుస్తుల మీద ఎగురుతుందో అని టెన్షన్ చాలా మందిలో ఉంటుంది. వర్షాకాలంలో మంచి దుస్తులు లేదా తెల్లని దుస్తులను వేసుకోవాలంటే ఒక క్షణం ఆలోచిస్తారు. ఏవైనా మరకలు పడినప్పుడు వాటిని తొలగించడం కొంచెం కష్టం అవుతుంది. అలా భయపకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

సాధ్యమైనంత వరకూ సిరామరకలకు మరియు రోడ్ల మీద ఉన్న గుంతలకు దూరంగా ఉండాలి. అయితే, అన్నీ మనకు అనుకూలంగా ఉండవు. ఎక్కడో ఒకచోట మనమీద పడనే పడుతుంటాయి. అనుకోకుండా బట్టల మీద ఎగిరే బురదు నీరు, ఇతర మరకల వల్ల మన దుస్తులు అందవిహీనంగా మార్చవచ్చు.

కాబట్టి, వర్షాలకు మరియు ఇటువంటి మరకలకు భయపడకుండా ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఒక అడుగు ముందుకు వేసి, మొండిమరకలను వదిలించుకోవడానికి సిద్దంగా ఉండండి. మడ్ స్టెయిన్స్(మట్టి మరకలను)తొలగించడం అంత కష్టమైన పనేం కాదు. అందుకు మరకలను తొలగించడానికి మన దగ్గర కొన్ని ప్రాధమిక పదార్థాలను సిద్దంగా ఉంచుకోవాలి . మట్టి మరకలను సులభంగా తొలగించే ఈ పదార్థాలన్ని కూడా మన వంట గదిలో సులభంగా అందుబాటులో ఉంటాయి..మరి ఆ పదార్థాలేంటో వాటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం...

Remove Mud Stains From White Clothes

డిటర్జెంట్ : ఇది ఒక బేసిక్ క్లీనింగ్ ఏజెంట్ మరియు ఇది ఎప్పుడూ మన ఇంట్లో నిల్వ ఉంటుంది . మట్టి మరకలను తొలగించుకోవడానికి డిటర్జెంట్ పౌడర్ లేదా లిక్విడ్ కానీ ఉపయోగించుకోవచ్చు.

డిష్ వాష్: సున్నితమైన దుస్తులను శుభ్రం చేయడానికి డిష్ వాష్ ఉపయోగించి చేతి రుద్ది శుభ్రం చేసుకోవాలి.

వెనిగర్: ఇది మల్టిపర్పస్ క్లీనర్ మరియు దుస్తులను శుభ్రపరచడంలో అద్భుతాలనే చేస్తుంది . అందుకు మీరు తెల్లటి డిస్టిల్ వెనిగర్ ను ఉపయోగించడమే. వెనిగర్ తెల్లని దుస్తులను మరింత తెల్లగా మర్చడంలోనూ, వర్షాకాలంలో దుస్తుల మీద పడ్డ మట్టి మరకలను వదిలించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బేకింగ్ సోడ: ఇది మరో క్లీనింగ్ ఏజెంట్ . దీనికి మరో కాంబినేషన్ వెనిగర్, ఈ రెండూ మిక్స్ చేసి దుస్తులకు ఉపయోగించినట్లైతే మొండి మరకలు సులభంగా తొలగిపోతాయి.

ఐడ్రాపర్: దుస్తుల మీద పడ్డ అతి చిన్న మరకలను ఐడ్రాపర్ వేసి రుద్దితే మరకలు తొలగిపోతాయి.

నిమ్మరసం: వర్షకాలంలో దుస్తుల మీద పడే మొండిమరకలను తొలగించడానికి నిమ్మరసంలోని అసిడ్ యాసిడ్ గ్రేట్ గా సహాయపడుతుంది. మరకల మీద నిమ్మతొక్కతో రుద్ది, వాష్ చేయాలి.

హైడ్రోజెన్ పెరాక్సైడ్: ఎటువంటి మరకలైనా చాలా తేలికగా మాయం చేస్తుంది. మీరు ఉపయోగించే ఏ క్లీనింగ్ ఏజెంట్ తో అయినా మిక్స్ చేసి ఉపయోగించవచ్చు.

చాకు లేదా స్పూన్: మడ్ స్టైన్స్ తొలగించడానికి డల్ నైఫ్ లేదా స్పూన్ తో రబ్ చేసి తొలగించవచ్చు.

మరకలు పడ్డ వెంటనే తీసుకోవల్సిన జాగ్రత్తలు: వర్షాకాలంలో దుస్తుల మీద ఏదైనా మరకలు పడ్డ వెంటనే వాటని డిటర్జెంట్ వాటర్ లో నానబెట్టి, వెంటనే వాష్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మరకలు పడ్డ వెంటనే వాష్ చేయడం వల్ల మరకలను తొలగించడం సులభం అవుతుంది.

English summary

Remove Mud Stains From White Clothes

While stepping out during the rains, we have to be prepared for the splashes of dirty water to stain our clothes. It would be useless to curse or crib over these stains. The best thing we can do is to be prepared.
Story first published: Friday, October 24, 2014, 18:27 [IST]
Desktop Bottom Promotion