For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాడిన గిన్నెలు -మరకలను తొలగించే సూపర్ టిప్స్

|

సాధారణంగా మనం ఇంట్లో వంటలు వండేటప్పుడు గిన్నెలు మాడిపోతుంటాయి. ముఖ్యంగా పాలగిన్నెలో, కూరగిన్నెలో అడుగుభాగంలో గిన్నెలకు అంటుకొని ఉండే ఆహార పదార్థాల వల్ల గిన్నెలు మాడిపోతుంటాయి. వాటిని వెంటనే శుభ్రం చేసి తొలగించవకపోతే అవి చివరకు మొండిమరకలుగా తయారై, చివరకు వాటిని పడేయాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే, మన వంటింటి వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలనుకుంటే, కొన్ని సున్నితమైన పద్దతులను ఉపయోగించాలి. తయారుచేసే ఆహారాలు పాత్రల అడుగు అంటకుండా, ముందుజాగ్రత్తలు తీసుకోవడం లేదా వాటిని వెంటనే శుభ్రం చేయడం చాలా సులభం వెంటనే జాగ్రత్త తీసుకోకపోతే గిన్నెలకు అంటిన మాడు, మరియు మొండిమరకలను తొలగించడం తలనొప్పిగా మారుతుంది.

అలా మరకలు పడ్డ వంటింటి వస్తువును శుభ్రం చేయడానికి కొన్ని నేచురల్ పద్దతులున్నాయి. గిన్నెలకు అంటిన మాడు లేదా మరకలను తొలగించడానికి ఈ నేచురల్ పద్దతుల చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మరి వంటగది పాత్రలకంటిన మరకలను తొలగించే ఆ నేచురల్ పద్దతులేంటో తెలుసుకుందాం...

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

సహజంగా బేకింగ్ సోడాను క్లీనింగ్ ఏజెంట్ గా పిలుస్తారు. ఇది చాలా ఎఫెక్టివ్ గా మరకలను తొలగిస్తుంది . మరి పాత్రల విషయంలో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం..

* ఒక చెంచా బేకింగ్ సోడాను మరకలు పడ్డ పాత్రల మీద చిలకరించాలి

* తర్వాత రెండు చెంచాల నిమ్మరసం చిలకరించి బాగా రుద్దాలి

* తర్వాత వేడినీళ్ళు పోసి కడగాలి. ఇలా చేయడం వల్ల మీ పాత్రలు క్లీన్ గా శుభ్రపడుతాయి.

నిమ్మరసం:

నిమ్మరసం:

మరో పవర్ ఫుల్ క్లీనింగ్ ఏజెంట్ నిమ్మరసం. నిమ్మరసంను ఇది వరకే మొదటిపద్దతిలో మనం ఉపయోగించాము. అయితే ఇక్కడ మరో పద్దతిలో..బేకింగ్ సోడా లేకుండానే కేవలం నిమ్మరసం ఉపయోగించి తేలికగా ఉన్న మరకలను తొలగించవచ్చు. అందుకు

* పచ్చిగా ఉన్న నిమ్మ తొక్కను తీసుకొని మరకలున్న గిన్నెలో రుద్దాలి.

* 3 కప్పుల నీటిని పోసి పాత్రలు తోమే బ్రష్ తో బాగా రుద్ది కడగడం వల్ల తక్షణం మార్పును మీరు గమనించవచ్చు.

ఉప్పు:

ఉప్పు:

బర్న్ అయిన గిన్నెల యొక్క మరకలను తొలగించడానికి ఉప్పు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మరి సాల్ట్ ఎలా ఉపయోగించాలో చూద్దాం..

* మాడిన గిన్నె స్టై మీద పెట్టి అందులో నీళ్ళు పోసం మరిగించాలి.

* నీరు మరగుతున్నప్పుడు, అందులో కొద్దిగా ఉప్పు వేసి, అది కరిగే వరకూ మరిగించాలి.

* మూడు నుండి నాలుగు నిముషాలు అలాగే మరిగించి తర్వాత క్రింది దించి బ్రష్ తో బాగా రుద్ది కడగాలి.

టమోటో జ్యూస్:

టమోటో జ్యూస్:

పాత్రలను శుభ్రపరచడంలో మరో ఎఫెక్టివ్ క్లీనింగ్ ఏజెంట్ టమోటో. టమోటోలో అసిడిక్ ఉండటం వల్ల ఇది పాత్రల మీద పడ్డ మరకలను తొలగించడంలో ఎఫెక్టివ్ గా పిచేస్తుంది. టమోటో జ్యూస్ ను మాడిన గిన్నెలో వేసి, గిన్నెను వేడి చేయాలి . వేడయ్యాక క్రిందికి దించి, బ్రష్ తో రుద్ది కడగాలి. మరి మెండిమరకైతే కొద్దిగా సాల్ట్ కూడా వేయవచ్చు.

చింతపులుసు:

చింతపులుసు:

అలాగా పాత్రలకు అంటిని బర్నింగ్ మరకలను చాలా ఎఫెక్టివ్ గా వదలిస్తుంది చింతపులుసు. దీన్ని కూడా ముందు పద్దతి టమోటో పద్దతిని అనుసరించి తొలగించాలి. ఫలితం రెండూ ఒకటిగానే ఉంటుంది.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

పాత్రలకంటిని మరకలను తొలగించడానికి ఉల్లిపాయను రెండు విధాలుగా ఉపయోగిస్తారు. అదేంటంటే...

* మొదటిది : బర్న్ అయిన గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిముషం వేడి చేయాలి.

* కొద్దిగా నీళ్ళు పోసి, అలాగే వేడి చేయాలి.

* మాడి గిన్నెకు అంటుకున్న ఆహారపదార్థాలు గిన్నె నుండి విడిపోతు గిన్నె అడుగు భాగంలో చేరడం మీరు గమనించవచ్చు.

* రెండవ పద్దతి: ఉల్లిపాయను కట్ చేసి బర్న్ అయిన గిన్నెకు లోపలి బాగంలో బాగా రుద్దాలి. . తర్వాత స్టౌమీద పెట్టి, వేడి చేయాలి.

* తర్వాత బ్రష్ తో రుద్ది కడగాలి.

అమ్మోనియా మరియు నీళ్ళు:

అమ్మోనియా మరియు నీళ్ళు:

అమ్మోనియం ద్రావకం మరియు నీల్ళు కొద్దిగా వేసి బ్రష్ చేయాలి. ముందుగా వీటిని పాత్రలో వేసి వేడి చేయాలి తర్వాత బ్రష్ చేసి, నీటితో కడగాలి. అంతే తక్షణ ఫలితంను మీరు వెంటనే చూడవచ్చు...

English summary

Superb Tips To Remove Burnt Leftovers From Utensils

A major problem that people are faced with in the kitchen is dealing with burnt leftovers in utensils. If not dealt with properly, your utensils may well get stained till you finally decide to dispose them off. As such, there are specific-tested and proven-methods that will help you effectively deal with burnt leftovers in utensils.
Story first published: Wednesday, October 29, 2014, 16:01 [IST]
Desktop Bottom Promotion