For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాగి పాత్రలను తళతళ మెరిపించే సులభ చిట్కాలు

|

మన ఇండియన్ కిచెన్ లో చాలా విస్తృతంగా కాపర్ (రాగి)పాత్రలు ఉపయోగిస్తుంటారు. ఒకానొక సందర్భంలో ఈ రాగి వస్తువులను కానీ, పాత్రలను కానీ శుభ్రం చేయడానికి ఇబ్బంది పడి ఉంటారు. స్టీల్, అల్యూమినియం కంటే కాపర్ (రాగి)పాత్రలు చాలా కొద్దిరోజులకే నల్లగా మారిపోతాయి. వీటిని మనం ఉపయోగించకపోయినా సరే ఆటోమాటిక్ గా ఇవి నల్లగా మారుతాయి.

కాపర్ (రాగి)పాత్రలను శుభ్రం చేయడానికి వాటిని తళతళ మెరిపించడానికి మార్కెట్లో వివిధ రకాలా కమెర్షియల్ క్లీనర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, మన ఇండియన్ మహిళలు మాత్రం పూర్వకాలం నుండి మన వంటగదిలోని వస్తువులనే రాగిపాత్రలను శుభ్ర పరచడానికి, వాటిని తళతళ మెరిపించడానికి ఉపయోగిస్తున్నారు.

Tips To Clean Copper Vessels At Home

అయితే వంటగది వస్తువులే అయినా వాటి ఎంపిక చాలా అవసరం ఎందుకంటే, రాగిపాత్రలకు పూర్తిగా షైనింగ్ ను తొలగించే అవకాశం కూడా ఉంది. సరైన పద్దతిని, సరైన పదార్థాలను ఎంపిక చేసుకోవడం వల్ల బాగా పనిచేస్తాయి. కాబట్టి, మీ రాగి పాత్రలను కొత్తవాటిలా మెరిపించే కొన్ని వంటగది వస్తువులు, వాటి ఏవిధంగా ఉపయోగించాలో ఈ క్రింది విధంగా అంధివ్వడం జరిగింది.

1. వెనిగర్ మరియు సాల్ట్: కాపర్ వెజల్స్ ను శుభ్రం చేయడానికి వెనిగర్ చాలా బాగా సహాయపడుతుంది . కాపర్ పాత్రల మీద కొద్దిగా వెనిగర్ ఉప్పు చిలకరించి బాగా రుద్ది, తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2. నిమ్మరసం : నిమ్మతొక్క తీసుకొని కాపర్ వస్తువుల మీద బాగా రుద్దాలి. తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల రాగి వస్తువులు కొత్తవాటిలా మెరుస్తుంటాయి.

3. నిమ్మరసం మరియు ఉప్పు: మరో సారి రాగి వస్తువులను శుభ్రం చేసేప్పుడు నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ లా చేసి రాగి వస్తువులను పట్టించి పది నిముషాల తర్వాత బాగా రుద్ది కడగాలి. కడిగిన తర్వాత సున్నితంగా ఉండే పొడి వస్త్రంతో తుడవాలి.

4. వెనిగర్ మరియు పిండి: ఒక టేబుల్ స్పూప్ ఉప్పు, అందులో కొద్దిగా వెనిగర్ బాగా మిక్స్ చేసి దానికి కొద్దిగా పిండి మిక్స్ చేసి రాగి వస్తువల మీద వేసి బాగా రుద్ది 15నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

5. బేకింగ్ సోడ: బేకింగ్ సోడా చలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . కాపర్ వస్తువులను శుభ్రం చేయడానికి దీన్ని ఎప్పుడూ టాప్ లిస్ట్ లో ఎంపిక చేసుకోవాలి . మీరు నిమ్మరసం బేకింగ్ సోడా కాంబినేష్ ఎంపిక చేసుకోవచ్చు. లేదా నేరుగా బేకింగ్ సోడాను మాత్రమే ఎంపిక చేసుకొని రాగి వస్తువులను శుభ్రం చేయాలి.

English summary

Tips To Clean Copper Vessels At Home

Copper vessels are widely used in Indian kitchen. You might have experienced the difficulty in cleaning those copper vessels at least once in your life. Copper vessels darken over time with constant use or simply by the exposure to air.
Story first published: Wednesday, April 23, 2014, 17:21 [IST]
Desktop Bottom Promotion