For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రీజర్ ను శుభ్రపరచడానికి సులభ చిట్కాలు

|

వేసవి వచ్చేసింది..ఎండలు మండిపోతున్నాయి..చల్లచల్లగా ఏదైనా పానీయం సేవిస్తే ఉల్లాసంగా ఉంటుంది అనుకుంటాం. మనఇంట్లో ఫ్రిజ్ ఉంటే బాగుండు అనుకుంటాం. వేసవిలో ఫ్రిజ్ వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. రుచికరంగా ఉన్న కూర ఏదైనా మిగిలితే వెంటనే వచ్చే ఆలోచన దాన్ని ఫ్రిజ్‌ లో పెట్టి రేపు వేడి చేసుకు తిందామని. అలాగే పాలు, పెరుగు, పూలు, ఒకటేమిటి రకరకాల పదార్ధాలను నిల్వ ఉంచడానికి ఫ్రిజ్‌ ను ఉపయోగించడం సర్వసాధరణంగా మారిపోయింది.

అయితే దానిని ఎప్పటికప్పుడు శుభ్రపరచకపోతే మాత్రం పురుగులు చేరి మొదటికే మోసం వచ్చే అవకాశముంది. కనుక ఫ్రిజ్‌ లో చెత్తచేరిపోయిందనిపించిన వెంటనే శుభ్రం చేయడం మంచిది. ఫ్రిజ్‌ ను శుభ్రం చేయడం కాస్త ఓపికతో కూడుకున్న పనే. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే అది అవసరం.

Ways To Clean Your Freezer

ఫ్రిజ్ ను ప్రతి రోజూ శుభ్రం పరచడం అంటే కష్టమైన పనే. అందుకు ముందు జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే చెడు వాసనలు లేకుండా మీ పని సులభం అవుతుంది. అందుకు ఏం చేయాలి? అందుకు కొన్నిసలభమైన హోం ఇంప్ర్యూమెంట్ చిట్కాలు ఉన్నాయి.

మందుగా ఫ్రిజ్ మొత్తం కాలీ చేయాలి: ఫ్రిజ్‌ ను శుభ్రం చేయాలనుకున్నప్పుడు ముందుగా అందులో ఉన్న పదార్ధాలన్నీ తీసి బయటపెట్టాలి. చద్దివాసన కొట్టేవి, కుళ్ళిపోయినవి ఉంటే తీసి విసిరేయాలి. తర్వాత అందులో ఏమేం పెట్టాలో నిర్ణయించుకోవాలి. ఫ్రిజ్ లోపల కొంత తడి లేదా ఐస్ గడ్డకట్టి ఉంటుంది. కాబట్టి, క్లీన్ చేయడానికి ముందు ఫ్రీజర్ యొక్క ప్లగ్ స్విచ్ ఆఫ్ చేసి, ప్లగ్ పక్కన తీసి పెట్టి, కొద్ది సమయం అలాగే ఉండాలి. ఐస్ వదులైన తర్వాత కత్తితో తొలగించాలి. లేదంటే శుభ్రం చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది.

హెయిర్ డ్రయ్యర్: ఫ్రీజర్ శుభ్రం చేయడానికి హెయిర్ డ్రయ్యర్ ఎందుకు ? ఏం లేదు. డీఫ్రాస్టింగ్ ప్రొసెస్ త్వరగా చేయాంటే, హెయిర్ డ్రయ్యర్ తో ఫ్రిజ్ లోపల తడి పూర్తిగా తొలగించాలి. ఫ్రీజర్ లోప హెయిర్ డ్రయ్యర్ తో ఐస్ ను కరిగించవచ్చు. దాంతో ప్రీజర్ ను సులభంగా శుభ్రం చేయవచ్చు.

ఫ్రీజర్ ను ముందుగా తుడవాలి: డీఫ్రాస్ట్ చేసిన తర్వాత ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకొని, పైనా, క్రింద బాగంలో క్లీన్ గా తుడవాలి. ఫ్రిజ్ లో ఉన్న ఆహారంను బయటకు తీసివేసి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా తుడవాలి.

వెనిగర్: ఫ్రీజర్ ను శుభ్రం చేయడానికి వెనిగర్ ఒక అద్బుతమైన క్లీనింగ్ ఏజెంట్. మూడు భాగాలు నీళ్ళు ఒక భాగం వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి అందులో శుభ్రమైన వస్త్రాన్ని డిప్ చేసి తర్వాత ఫ్రీజర్ ను ఆ తడి బట్టతో తుడవాలి. తిరిగి మంచి నీటితో మరో సారి తుడవాల్సి ఉంటుంది.

బేకింగ్ సోడా: ముఖ్యంగా ఇంటి శుభ్రతలో మరీ ముఖ్యంగా మీ వంటగది విషయంలో బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా ఇది ఒక మ్యాజిక్ పౌడర్ ఇది అన్నివస్తువులను సులభంగా శుభ్రచేస్తుంది. ఫ్రిజ్ ను కూడా ఎటువంటి చెడు వాసనలు లేకుండా మిళమిళ తళతళలాడేలా చేస్తుంది. సన్నని రంద్రాలున్న చిన్న డబ్బాలో బేకింగ్ సోడాను నింపి ఫ్రిజ్ లో ఒక మూలలో పెట్టడం వల్ల చెడువాసనలు స్ర్పెడ్ కాకుండా ఉంటాయి.

ఫ్రీజర్ తడి ఆరనివ్వాలి: ఫ్రీజర్ ను శుభ్రం చేయడానికి మరో నేచురల్ క్లీనింగ్ పరిష్కారం, ఫ్రీజర్ మొత్తం శుభ్రం చేసిన తర్వాత అందులో వెంటనే పదార్థాలన్నింటిని నిల్వ చేయకుండా ఫ్రీజర్ డోర్ ను తెరచి పెట్టి పూర్తిగా తడి ఆరిపోనివ్వాలి.

ప్రీజర్ లో మంచి సువాసన కోసం: చాలా మందికి ప్రీజర్ నుండి మంచి సువాసన వస్తే చాలా ఇష్టం. అటువంటి వారు, కొద్దిగా నిమ్మరసంతో ఫ్రిజ్ ను తుడవాలి. లేదా వెనీలా కొన్ని చుక్కలను కూడా కాటన్ లో డిప్ చేసి ప్రీజర్ కార్నర్ లో పెట్టవచ్చు.

తిరిగి పనిచేసేలా : క్లీనింగ్ ప్రొసెస్ పూర్తి అయిన తర్వాత, మీ ఆహార పదార్థాలు తిరిగి నిల్వ చేసుకోవచ్చు. ఫ్రీజర్ లో మొత్త నింపేయకూడదు. అది లోపల గాలి ఇతర పదార్థాకలు సోకకుండా అడ్డుకుంటుంది. కాబట్టి, ఆహార పదార్థాల మద్య కొంచెం స్థలం ఉండేలా చూసుకోవాలి.

English summary

Ways To Clean Your Freezer

Refrigerator is an essential part of a lively and efficient kitchen. Then comes the question ‘how you care for your refrigerator’? Sure! You may be interested in attaching attractive or sometimes weird magnets on the refrigerator door.
Story first published: Tuesday, April 8, 2014, 17:49 [IST]
Desktop Bottom Promotion