For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇల్లు వర్షంలో తడవకుండా ఉండేందుకు మార్గాలు

By Super
|

వర్షాకాలంలో మీ బట్టలు, చెప్పుల తోపాటు మీ ఇంటికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. తేమ వలన మీ ఫర్నిచర్, కుర్చీలు, ఆభరణాలు అదేవిధంగా గాడ్జెట్లు ప్రతీదీ దెబ్బతినే అవకాశం ఉంది.

అయితే, కొద్దిపాటి జాగ్రత్తలు మీ వస్తువులు పాడవకుండా రక్షించడానికి సహాయపడతాయి. అవి ఇక్కడ ఇవ్వబడ్డాయి....

అలమర, బట్టలు

అలమర, బట్టలు

మీ బట్టలు పూర్తిగా పొడిగా ఉండడం ప్రతి ఇంట్లో ఉండే సాధారణ విషయం. బట్టలు తగినంత ఆరకపోతే, తరువాత అవి చెడు వాసన వస్తాయి, అవి మళ్ళీ ఉతికే దాకా ఆ వాసన పోదు. మీ బట్టల అర తేమగా లేకుండా ఉండాలంటే, కర్పూరం బిళ్ళలను ఉంచినట్లయితే అవి తేమను పీల్చుకుంటాయి. మీరు బట్టల అరను శుభ్రంగా ఉంచకపోతే, ఫంగస్ ఏర్పడి, చెడు వాసన రావడం మొదలౌతుంది. ఎప్పుడూ మంచి శుభ్రమైన వస్తువులతో మరకలను తొలగించండి. బట్టల అరలో తడిబట్టలను పెట్టకండి. నిర్ణీత కాలంలో మీ బట్టలను గాలికి ఆరబెట్టండి.

చెక్క ఫర్నిచర్

చెక్క ఫర్నిచర్

వర్షాకాలంలో కీటకాలు, చెదపురుగులు చాలా విసిగిస్తాయి. కర్పూరం బిళ్ళలు, లవంగాలు లేదా నిమ్మ ఆకులు వీటిని నివారించడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ కాలంలో మీరు కొత్త ఫర్నిచర్ ని కొనుగోలు చేసినట్లైతే, యాంటీ-ఫంగల్, చెదలు పట్టని వాటిని ఎంచుకోండి. అవసరమైతే, మీ ఫర్నిచర్ స్క్రూలను తిరిగి బిగి౦చుకోవచ్చు. మీరు కొన్ని వారాలపాటు ఇల్లు వదలి వెళ్ళాల్సి ఉంటె, మీ ఫర్నిచర్ ని ప్లాస్టిక్ కవర్ల తో కప్పిఉంచండి పొడిగా ఉంటాయి. మీ ఫర్నిచర్ శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. మీరు తేమ నుండి, వాతావరణంలోని మార్పుల నుండి రక్షించడానికి గ్లిసరిన్ లేదా కిరోసిన్ ను కూడా వాడవచ్చు. ఒకవేళ మీ కుర్చీ లేదా టేబుల్ పై చాలా మరకలు లేదా పాడైపోయి ఉంటె, ఎసిటోన్ ని వాడడానికి ప్రయత్నించండి, ఇది త్వరగా పొడి చేస్తుంది. తేమని, రంగుని, వేడి నుండి మీ టేబుల్ ని రక్షించడానికి టేబుల్ మాట్స్ లేదా హోల్డర్లను వాడండి. తేమను పోగొట్టడానికి మీ బట్టల అరలో సిలికా జెల్ ని ఉంచండి. మీరు చెక్క ఉపరితలాన్ని తుడవాలంటే పొడి గుడ్డను మాత్రమే వాడాలి.

షూ రాక్

షూ రాక్

నిర్ణీత సమయంలో మీ చెప్పుల అర ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. చెప్పులకు ఎక్కువ తేమను పీల్చుకునే తత్త్వం ఉంటుంది, వాటిని ధరించి నట్లైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. చెప్పుల అరలో ఒక తక్కువ ఒల్తేజ్ గల బల్బును ఉంచండి, ఈ ఉష్ణోగ్రత తేమను గ్రహిస్తుంది.

తివాచీలు, కర్టెన్లు

తివాచీలు, కర్టెన్లు

ఈ కాలంలో తివచీలను వాడకపోవడమే మంచిది. చుట్టి ఒక పక్కన పెట్టండి, అయితే, వాటిని వాడడం నిజంగా అవసరం అనుకుంటే, వాటిని పొడిగా ఉండేట్లు చూడడం చాలా అవసరం. మీరు తివాచీపై నడిచే ముందు మీ కాళ్ళను తుడుచుకోండి. మీ తివాచీ బాగా మురుకిపట్టినట్లితే, మీరు ముందు మురుకిని బ్రష్ తో తొలగించి, తరువాత ఉతకండి, ఎందుకంటే మీరు ఉతికేతపుడు ఆ మురికి అవతలివైపుకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. కిటికీ కర్తెన్లను మడిచి, పిన్ చేయండి, తడి కర్టెన్లు తేమను పట్టి ఉంచి, వాటినుండి వచ్చే వాసన అనారోగ్యానికి దారితీస్తుంది, దీనివల్ల తేమతో కూడిన గాలి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గాలిలో తేమ వల్ల మురికి కణాలు ఎక్కువగా నిలవుంటాయి కాబట్టి సమయాను కూలంగా కర్తెన్లను శుభ్రం చేయాలి. ఎండగా ఉన్నపుడు, తేమగా లేనిచోట రగ్గులను, కర్తెన్లను, తివాచీలను ఆరబెట్టండి.

లెదర్ సోఫా కవర్లు

లెదర్ సోఫా కవర్లు

మీరు ప్రతిరోజూ లేదర్నీ వాడేటట్లితే, మంచి నాణ్యమైన లెదర్ ని వాడండి. కనీసం 15 రోజుల కొకసారి లెదర్ ని శుభ్రం చేయండి. మృదువైన, పొడి బట్టతో దానిని తుడవండి. వాటిని శుభ్ర చేయడానికి మాయిశ్చరైజర్ ని ఉపయోగించండి, కాటన్ ముక్కను ఆ సొల్యూషన్ లో ముంచి, మొత్తం తుడవండి. ఫంగస్ నుండి లెదర్ కవర్లను రక్షించడానికి శుభ్రమైన నీరు, డెట్టాల్ ను ఉపయోగించండి.

డబ్బు, ఇతర విలువైన వస్తువులు

డబ్బు, ఇతర విలువైన వస్తువులు

డబ్బు, ఇతర విలువైన వస్తువులను కాటన్ లో చుట్టి, శుభ్రమైన ప్లాస్టిక్ సంచులలో నిల్వ ఉంచండి. వర్షాకాలంలో వెండి ఆభరణాలు త్వరగా రంగు మారతాయి; వాటిని రక్షించడానికి బటర్ పేపర్ ని వాడండి. తరువాత సానపెట్టే ద్రవాన్ని కూడా మీరు వాడవచ్చు.

గడ్జెట్లు, ఉపకరణాలు

గడ్జెట్లు, ఉపకరణాలు

కాపర్ ట్రాక్స్ కలిగిన, ప్రింట్ చేసే సర్క్యూట్ బోర్డ్ల నుండి మీ గాడ్జెట్ లను రక్షించండి. ఆ PCBs లో నీరు చేరినట్లైతే, అవి ఆగిపోతాయి, వినియోగదారుల ఆదేశాలకు సరిగా స్పందిన్చావు. గడ్జెట్లు ఎక్కువగా ‘ఆఫ్' చేసినప్పటి కంటే ‘ఆన్' చేసినపుడు ఎక్కువ ప్రభావ వంతంగా ఉంటాయి. మొబైల్ ఫోన్లు, కెమేరాలు, ఐ-పాడ్ లను ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించి భద్రపరచండి. మ్యూజిక్ సిస్టమ్స్/స్పీకర్లు లేదా కంప్యూటర్లను వాడిన తరువాత అతిపెద్ద ప్లాస్టిక్ షీట్లను ఉపయోగించి భద్రపరచండి. తడి చేతులతో స్విచులను ఆపరేట్ చేసినట్లైతే షాక్ కొడతాయి. మీరు వాడడం అయిపోయిన తరువాత, మీ ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నిటికీ ప్లగ్ లేకుండా చేయండి, స్విచ్ ఆఫ్ చేయండి. మీరు విద్యుత్ ఘటానికి గురికాకుండా ఉండాలంటే, మీ ఇంట్లో ని వైరింగ్ మొత్తాన్ని పరిశీలించు కొండి. ఇన్ఫెక్షన్లు రాకుండా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. కుండలు లేదా బిందెలు నీటితో నిమ్పిఉన్నట్లితే, ఆ నీటిని సమయాను కూలంగా మార్చి, తిరిగి శుభ్రమైన నీటితో నింపండి.

English summary

Ways to rainproof your home

Besides your clothes and footwear, your home, too, needs special care during this rainy season. Everything from your furniture, upholstery, jewellery as well as gadgets and appliances are at risk of getting damaged due to moisture.
Story first published: Thursday, August 28, 2014, 17:32 [IST]
Desktop Bottom Promotion