For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే వారికోసం 5ముఖ్యమైన జాగ్రత్తలు

|

ప్రస్తుతం ఏ ఇంట్లో చూసిన గ్యాస్ పై వంట చేయడమే కనిపిస్తోంది. రోజు రోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో పాటే గ్యాస్ ధర కూడా పెరిగిపోతోంది. పట్టణాలు, నగరాలతో పాటు పల్లెల్లో కూడా గ్యాస్ వాడకం బాగా పెరిగిపోయింది. అయితే కొందరికి గ్యాస్ వాడకం తెలియదు. గ్యాస్ సిలిండర్ వినియోగం విషయంలో జాగ్రత్త తీసుకోకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఇంటి నుండి బయలుదేరామంటే గ్యాస్ ఆఫ్ చేశామా?లేదా? అన్న అనుమానం ప్రతిఒక్కరికీ వస్తుంది. గ్యాస్ స్టౌ కి వివిధ మార్గాల్లో పైప్స్ అమర్చడం, గ్యాస్ లీక్ అవ్వడానికి అనేక మార్గాలు కూడా ఉన్నాయి కాబట్టి, మామూలు కాలల్లో కంటే వేసవి కాలంలో గ్యాస్ వాడకం మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వాతారణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి, ఎన్ని పనులున్న గ్యాస్ మీద ఓ కన్నువేసి ఉంచడం మంచిది.

గ్యాస్ సిలిండర్ ను సంబంధిత డీలర్ వద్ద కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే సంబంధిత డీలర్ వద్ద కొనడం వల్ల ఆ సిలిండర్ మీద సీల్ ఉంటుంది. అంతే కాదు, సిలిండర్ మీద ఉన్న డేట్ ను కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిల్ ఏమాత్రం లేకున్నా లేదా డేట్ ఎక్సపైర్ అయినా, వెంటనే రిజక్ట్ చేయడానికి మనకు సహాయపడుతుంది. అంతే కాదు, మీరు తెలుసుకోవల్సిన మరికొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. మీకోసం కొన్ని ఈ క్రింది విధంగా...గ్యాస్ ను ఎలా హ్యాండిల్ చేయాలి:
గ్యాస్ ను అప్ రైట్ పొజిషన్ లో ఉంచాలి. సిలిండర్స్ క్రింద పడకుండా సురక్షితంగా నిలిచి ఉండేలా సౌకర్యవంతంగా ఉంచుకోవాలి . గ్యాస్ సిలిండర్ క్రింద పడకూడదు, రోల్ చేయడం లేదా డ్రాగ్ చేయకూడదు. గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చినప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్నది ఎంపిక చేసుకోవాలి.

5 Important Precautions When Using Gas Cylinders

ఎల్ పి జి ఉపయోగించడం:
ఎల్ పి జి గ్యాస్ సిలిండర్ సురక్షితమైన సూచనలు చేయకూడనివి మరియు చేయాల్సినవి ఇక లిస్ట్ ఉంటుంది . సిలిండర్ ఉపయోగించేప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వంటగదిలో చాలా గాలి, వెలుతురు బాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ సిలిండర్ కు దగ్గరగా ప్లాస్టిక్ వస్తువులను మరియు మంటలు త్వరగా వ్యాప్తి చెందే వస్తువులను ఉంచకూడదు. గ్యాస్ సిలిండర్ ఉపయోగించనప్పుడు రెగ్యులేటర్ నాబ్ ను ఎప్పుడూ ఆఫ్ లో ఉంచాలి.

గ్యాస్ సిలిండర్ ను ట్రాన్స్ పోర్ట్ చేయడం:
గ్యాస్ సిలిండర్ ను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ఒక సమయం అంటూ ఉంటుంది. కొన్ని రకాల సిలిండర్లను వినియోగించేటప్పుడు సురక్షితంగా ఏవిధంగా ఉపయోగించాలి, అందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి అని తెలుసుకోవాలి. గ్యాస్ సిలిండర్ ను తరలించేటప్పుడు నిలువుగా ఉంచాలి . సిలిండర్ ను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తరలించడానికి ముందు క్యాప్స్ మరియు కవర్స్ కరెక్ట్ గా ఫిట్ చేసి ఉండాలి . ఇలా చేయడం వల్ల ఏదైన దుమ్ము, ధూళి వాల్వ్ లోనికి ప్రవేశించకుండా ఉంటుంది.

5 Important Precautions When Using Gas Cylinders

నిల్వచేసే ప్రదేశం : గ్యాస్ సిలిండర్ ను అసరం ఉన్నప్పుడు మాత్రం నిల్వచేసుకోవడం చాలా ముఖ్యం. వాతావరణం పొడిగా మరియు సురక్షితంగా ఉండే ప్రదేశంలో సిలిండర్ ఉంచడం క్షేమకరం. ముఖ్యంగా గాలి వెలుతురు బాగా ప్రదేశించే స్థలంలో ఉండటం మంచిది. గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రదేశంలో ఎటువంటి వేడి వాతావరణం కలిగించకూడదు. అలాగే సిలిండర్ ఉన్న ప్రదేశంలో బయటి నుండి కూడా వేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా గ్యాస్ సిలిండర్ ఇంట్లో సురక్షితంగా నిల్వచేయడానికి సహాయపడే కొన్ని జాగ్రత్తలు. సూచనలు.

5 Important Precautions When Using Gas Cylinders

ట్యూబ్స్ మరియు రెగ్యులేటర్స్: అన్ని రకాల ట్యూబ్స్ మరియు రెగ్యులేటర్స్ సరిగా ఉన్నాయో లేదో అప్పుడప్పుడు గమనిస్తుండాలి . ఒక్కో సందర్భంలో లీక్ అవుతుంటాయి . సిలిండర్స్ వినియోగించేటప్పుడు పీరియాడిక్ మెయింటెనెన్స్ చాలా అవసరం మరియు మంచిది కూడా . మరో ముఖ్యమైన విషయం ట్యూబ్స్ ను తరచూ మార్చుతుండాలి. పాతబడిన లేక విరగిపోయిన గ్యాస్ పైప్ లను(రబ్బర్ ట్యూబ్ లను) వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు సంవత్సరాలకు మించి రబ్బర్ ట్యూబ్ ను వాడకూడదు

English summary

5 Important Precautions When Using Gas Cylinders

Liquefied petroleum gas is used in almost every household. It is the most important and dangerous part of cooking requirements. It is important to ensure that you are using gas cylinders safely. For this, you should know all the precautions of handling gas cylinders.
Story first published: Tuesday, January 27, 2015, 15:27 [IST]
Desktop Bottom Promotion