For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాత్ రూమ్ టైల్స్ ను శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు

|

సహజంగా బాత్ రూమ్ టైల్ చాలా త్వరగా మరకపడుతుంటాయి. రెగ్యులర్ గా జాగ్రత్తలు తీసుకోకపోతే, మరింత డర్టీగా తయారవుతుంది. ముఖంగా బాత్రూమ్ లోని కార్నర్స్ లో శుభ్రం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బాత్ రూమ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల వ్యక్తిగత శుభ్రత పాటించినవారవుతారు. అందుకు కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి.

వంటగది శుభ్రం చేసిన తర్వాత బాత్రూమ్ ఫ్లోర్ టైల్స్ ను శుభ్రం చేయడం రెండవ కష్టమైన పని. ఎందుకంటే, కొన్ని డిఫరెంట్ టైప్స్ సర్ఫేస్ తో రూపొందించ బడి ఉండటం వల్ల శుభ్రం చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఈ ప్రదేశంలో తరుచూ శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ ఇంట్లో కనుక పిల్లలున్నట్లైతే క్లీనింగ్ చేసే విధానం మరింత కష్టం అవుతుంది.

దాంతో బాత్రూమ్ ఫ్లోర్ మీదనే కాకుండా టైల్స్ మరియు షవర్ టైల్స్ మొత్తం మురికిపడుతుంది, మరకలు ఏర్పడుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. మరి బాత్రూమ్ ను శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం లేదు, మరియు కొన్ని చిట్కాలను ఉపయోగిస్తే, బాత్రూమ్ ను తళతళ మెరిపించవచ్చు.

మరి బాత్రూమ్ శుభ్రం చేయడానికి ఎలాంటి టిప్స్ఉపయోగించాలో, కొన్ని సింపుల్ టిప్స్ మీకోసం ఈ క్రింది విధంగా...

Clean Bathroom Tiles With These Easy Tips

1. సర్ఫేస్ ను ముందుగా డ్రై చేయాలి:
స్నానాల గది ఉపయోగించిన ప్రతి సారి బాత్రూమ్ సర్ఫేస్ మీద తడిలేకుండా చూడాలి.ఇలా చేయడం వల్ల అదనపు మురికి, పాచినితొలగించవచ్చు . ఇది ఒక ఎఫెక్టివ్ బాత్రూమ్ ఫ్లోర్ క్లీనింగ్ టిప్.
2. ఆ ప్రదేశంను టైల్ క్లీనర్ తో కవర్ చేయాలి:
ఫ్లోర్ మీద కానీ, టైల్స్ మీద కానీ రెగ్యులర్ గా ఉపయగించే క్లీనర్ ను వేసి, క్లీనర్ తో శుభ్రం చేస్తుండాలి. అయితే ఎక్కువగా ఉపయోగించకూడదు. బాత్రూమ్ క్లీనర్ ను సర్ఫేస్ మీద వేసినా అరగంట కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు.

Clean Bathroom Tiles With These Easy Tips

3. హార్డ్ బ్రష్ తో రుద్ది కడగాలి:
టైల్స్ ను హార్డ్ బ్రష్ ఉపయోగించి రుద్ది కడగాల్సి ఉంటుంది. అలాగే మీరు మీపాత బాత్రూమ్ బ్రష్ ను ఉపయోగించి కూడా టైల్స్ ను శుభ్రం చేసుకోవచ్చు . బాత్రూమ్ క్లీన్ చేయాడానికి ఇది ఒక ఉత్తమ పద్దతి.
4. వాటర్ తో శుభ్రంచేయాలి:
పాచి మరియు మురికిని క్లీనర్ మరియు హార్డ్ బ్రష్ తో తొలగించిన తర్వాత, నీరు ఉపయోగించి టైల్ క్లీనర్ ను కడిగేయాలి మరియు తడి ఆరనివ్వాలి.
వాష్ బేసిన్ చుట్టూ మరియు బాత్రూమ్ కిటికీల వద్ద శుభ్రం చేయడానికి ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి..

Clean Bathroom Tiles With These Easy Tips

5. వెనిగర్:
ఒక బాగం వెనిగర్కు 5 బాగాల నీళ్ళు మిక్స్ చేసి స్ప్రే భాటిల్లో లేదా బకెట్ లో పోసి, దాన్ని టైల్స్ మీద మరియు ఇతర బాత్రూమ్ సర్ఫేస్ మీద స్ప్రే చేసి, 15 నిముషాలు అలాగే వదిలేయాలి. దానివల్ల మురికి పాచిలోని సొల్యూషన్ ఇంకి, త్వరగా శుభ్రపరచడానికి సహాయపడుతుంది . తర్వాత స్ర్కబ్బర్ తో రుద్ది కడిగి, నీళ్ళు పోసి కడగాల్సి ఉంటుంది. ఈ ద్రవాన్ని ఉపయోగించి టైల్స్, కౌంటర్స్, క్యాబినెట్ ముందు, మరియు షవర్ వద్ద పడ్డసోప్ మరకలను తొలగించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు.

6. బేకింగ్ సోడా:
కొద్దిగా బేకింగ్ సోడా తీసుకొని, క్లాత్ మీద లేదా స్పాంజ్ మీద చిలకరించి, టైల్స్ మీద బాగా రుద్ది కడగాలి. మరకలు పడ్డ ప్రదేశాన్ని స్ర్కబ్ చేసి నీటితో శుభ్రం చేయాలి.లేదా బేకింగ్ సోడా పేస్ట్ ను ఉపయోగించి వాటర్ తో మిక్స్ చేసి షవర్ మరియు టబ్ ను శుభ్రం చేసుకోవచ్చు.

Story first published: Tuesday, January 13, 2015, 19:01 [IST]
Desktop Bottom Promotion