For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింక్ తళతళ కొత్తవాటిలా మెరవాలంటే? సింపుల్ టిప్స్

|

స్టెయిన్ లెస్ స్టీల్ అప్లియన్సెస్ మరియు స్టెయిన్ లెస్ స్టీల్ ఇంటీరియర్స్ వంటగదిలో చూడటానికి చాలా అందంగా ఉంటాయి . అయితే, వీటిని సరిగా ఉపయోగించుకోకపోయినా, లేదా సరిగా శుభ్రం చేయకపోయినా ప్రతికూల ప్రభావాలున్నాయి. ఎందుకంటే వీటి మీద హార్డ్ వాటర్ మార్క్స్(మరకలు)మరియు వేటిముద్రలు ఎక్కువగా కనబడుతాయి . కాబట్టి, మీ వంటగదిలోని స్టెయిన్ లెస్ స్టీల్ షింక్ కొత్తదాని వలే మెరిపించడానికి ఈ రోజు మీకోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాము.

మీరు మీ స్టెయిన్ లెస్ స్టీల్ సింక్ చూసినప్పుడు దాన్ని తళ తళ మెరిసేలా శుభ్రం చేయడం వల్ల ఆశ్చర్యం కలుగుతుంది. అయితే అలా నిత్యం సింక్ ను తళతళ కొత్తవాటిలా మెరిపించాలాంటే సులభమైన మార్గాలు మరియు చిట్కాలేవి? అలాంటి సుభమైన చిట్కాలు ఈ క్రింది లిస్ట్ లో తెలియచేయడం జరిగినది.

మురికి బడ్డ పాత్రలు, ఆయిల్ ఫుడ్స్ ఉన్న పాత్రలు సింక్ లో కడిగి అలాగే వారం తరబడి వదిలేయడం వల్ల సింక్ అడుగు బాగంలో జిడ్డుగా మారుతుంది. మరియు సింక్ కలర్ కూడా మారుతుంది. వాస వస్తుంటుంది . ఈ సమస్యలకు చెక్క పెట్టాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకొని వంటి గది పరిశుభ్రతను పాటించి, కుంటుంబం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

బేకింగ్ సోడా మరియు నీళ్ళు:

బేకింగ్ సోడా మరియు నీళ్ళు:

బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను సింక్ మొత్తం అప్లై చేయాలి. తర్వాత స్టీల్ ఊల్ తో సింక్ ను రబ్ చేసి శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల సింక్ అడుగు బాగంలో ఏర్పడ్డ మరకలు కూడా తొలగిపోతాయి . తర్వాత మంచి నీటితో బాగా కడిగి, కాటన్ క్లాత్ తో తడిలేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టెయిన్ లెస్ సింక్ ఎలాంటి మరకలు లేకండా కొత్తగా కనబడుతుంది.

 ఆల్కహాల్ ను వేసి రుద్దాలి:

ఆల్కహాల్ ను వేసి రుద్దాలి:

కొద్దిగా ఆల్కహాల్ తీసుకొని సింక్ అడుగు బాగంలో మరియు అంచుల్లో , సైడుల్లో వేసి రుద్దడం వల్ల త్రుప్పు తొలగిపోతుంది . తర్వాత మంచి నీరు పోసి కడగడం వల్ల సింక్ ను కొత్తదానివలే మెరిపిస్తుంది.

సోడ:

సోడ:

సోడా స్టెయిన్ లెస్ స్టీల్ మీద ఏర్పడ్డ మరకలను తొలగిస్తుంది . అలాగే త్రుప్పు పట్టింటే కూడా తొలగిస్తుంది. ఒక బాటిల్ సోడాను సింక్ లో మొత్తం పోసి తర్వాత స్క్రబ్బర్ తో బాగా రుద్ది , మంచినీళ్ళు పోసి శుభ్రంగా కడిగితే నీటి వల్ల ఏర్పడ్డ మరకలు కూడా తొలగిపోతాయి.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఇది చాలా సింపుల్ చిట్కా. మీ స్టెయిన్ లెస్ స్టీల్ సింక్ ను ఎలాంటి మరకలు లేకుండా స్క్రాచెస్ లేకుండా మెరిపిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా పేపర్ టవల్ మీద కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి సింక్ మొత్తం తుడవాలి . రెగ్యులర్ క్లీనింగ్ పూర్తి అయిన తర్వాత ఇలా ఆలివ్ ఆయిల్ తో తుడవడం వల్ల కొన్ని వారాల పాటు సింక్ కొత్తదానివలె మెరుస్తుంటుంది .

వెనిగర్:

వెనిగర్:

వెనిగర్ ఒక గొప్ప క్రిమిసంహారక క్లీనింగ్ ఏజెంట్ . దీన్ని ఉపయోగించి సింక్ శుభ్రం చేయడం వల్ల వాటర్ స్టెయిన్స్ తొలగిపోతాయి. కొద్దిగా వెనిగర్ ను క్లాత్ మీద వేసి సింక్ మొత్తం తుడవాలి. పాత్రలన్నీ శుభ్రం చేసి, సింక్ ను కడిగిన తర్వాత ఇలా చేయడం వల్ల సింక్ ఎప్పుడూ తళతళలాడుతుంటుంది . ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండం వల్ల వంటగదిలో సింక్ మెరవడం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన వాతావరణం కలిగి ఉంటారు.

English summary

Easy Tips For Shiny Sink: Cleaning Tips

Easy Tips For Shiny Sink, Stainless steel appliances and stainless steel interiors look great in the kitchen. But there is a drawback to it! It is more prone to hard water marks and fingerprints. Today we here to share ways to make your stainless steel sink shine and look all new.
Story first published: Thursday, August 20, 2015, 17:07 [IST]
Desktop Bottom Promotion