For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీమల బెడదను వదిలించుకోవడానికి సులభమైన చిట్కాలు

|

చీమలు.. ఇదివరకటి రోజుల్లో ఇంట్లో గచ్చు చేసో లేదా నాపరాళ్ళు పరచో ఉంటే ఆ గచ్చుపగిలిన చోటో లేద బండలమధ్యనో కొంత ప్లేస్ చేసుకొని చీమలు మనమీద దండయాత్ర చేసేవి. అలాంటపుడు వాటి ఆరిజిన్ కనిపెట్టి అక్కడ కాస్త గమేక్సి పౌడర్ నో లేదా మరేదైనా చీమలు రాకుండా ఉండుటకు ఏదో కొట్టేస్తే వాటి బెడద వదిలేది.

కానీ ఇపుడు అపార్ట్మెంట్స్ లోనూ... మామూలు ఇళ్ళలో కూడా ఆ సౌకర్యంలేదు, మార్బుల్ ఫ్లోర్ వెట్రిఫైడ్ టైల్స్ ఉన్నా ఎక్కడ నుండి వస్తాయో తెలీదు కానీ ఒకసారి దాడి మొదలెట్టాక స్వీటూ, హాటు, అన్నం, పప్పు, ఫర్నిచర్, లాప్ టాప్ అని తేడా లేకుండా ఎడతెరిపి లేకుండా ఎక్కాడపడితే అక్కడ తిరిగేస్తాయ్.

అయితే ఇప్పటి మోడ్రన్ యుగంలో మార్కెట్లో అందుబాటులో ఉండే పెస్టిసైడ్స్ వాడటం వల్ల మార్బల్స్ లేదా టైల్స్ దెబ్బతింటాయి. కాబట్టి, నేచురల్ మార్గాల్లో చీమలను వదిలించుకోవడానికి కొన్ని సులభ మార్గాలున్నాయి. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలుండవు. మరి ఆ చిట్కాలేంటో ఒక సారి చూద్దాం...

1. వెనిగర్:

1. వెనిగర్:

వెనిగర్ నేచురల్ చీమల నివారణ మందులు. వెనిగర్ ను కొద్దిగా స్ప్రే బాటిల్లో వేసి చీమలు తిరిగే ప్రదేశంలో స్ప్రే చేయాలి . ఇలా క్రమం తప్పకుండా రెండు మూడు రోజులు చేస్తే చీమలు తిరిగి చేరవు.

2. సోప్ వాటర్ :

2. సోప్ వాటర్ :

చీమను నివారించడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. మరియు చీలను వదిలించుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం . సోప్ వాటర్ లో కొద్దిగా హాట్ వాటర్ మీక్స్ చేసి వాటి మీద స్ప్రే చేయాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. చాక్ పీస్:

3. చాక్ పీస్:

చాక్ పీస్ తో గీసిన గీత దాటి అవి లోపలికి రాలేవు. అందుకు కారణం మాత్రం తెలియదు. ఇది ఒక అద్భుతమైన ఉపాయం. కాబట్టి, చీమలు ప్రవేశించే ప్రదేశం నుండి అవి తిరిగే ప్రదేశం వరకూ చాక్ పీస్ తో రౌండ్స్ లేదా గీతలు గీయండి. తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.

4. బేబీ పౌడర్:

4. బేబీ పౌడర్:

చీమలను నివారించడానికి ఇది ఒక సురక్షితమైన మరియు సులభమైన హోం రెమెడీ .కొద్దిగా బేబీ పౌడర్ ను చీమలున్న ప్రదేశంలో చిలకరించాలి. ఇలా చేయడం వల్ల ఇది చీమలు ఇంట్లోకు రాకుండా నివారిస్తుంది.

5. నిమ్మరసం:

5. నిమ్మరసం:

నిమ్మరసం ఉపయోగించి చీమలు ఇంట్లోకి రాకుండా నేచురల్ గా నివారించుకోవచ్చు. అంతే కాదు ఇది ఇంట్లో మంచి సువాసనను కలిగిస్తుంది . నిమ్మరసంలోని యాసిడ్ చీమలను ఇంట్లోకి రానివ్వకుండా చేస్తుంది . ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ.

6. కాఫీ గింజలు:

6. కాఫీ గింజలు:

చీమలకు కాఫీ వాసనంటే పడదు. కాబట్టి మీరు ఉపయోగించిన కాఫీ గింజలను లేదా కాఫీ పౌడర్ ను చిలకరించినా చాలు చీమలు రాకుండా నివారించుకోవచ్చు.

7. కార్న్ మీల్:

7. కార్న్ మీల్:

కార్న్ మీలు వేయడం వల్ల చీమలు వాటిని తినడం వల్ల జీర్ణించుకోలేక అవి నశింపబడుతాయి.

8. ఉప్పు:

8. ఉప్పు:

చీమలు ఉప్పును నాశనం చేయలేవు కానీ, సాల్ట్ వాటర్ ను డియోడరెంట్ గా ఉపయోగించడం వల్ల ఇంట్లోకి రాకుండా చేయవచ్చు లేదా అవి తిరిగే ప్రదేశంలో చల్లినా ఆ ప్రదేశంలో తిరగకుండా ఉంటాయి.

English summary

Home Remedies To Get Rid Of Ants Naturally And Cheaply

You can get rid of ants naturally by using ingredients that you may already have in your cupboard. These home remedies to kill ants in house are safe for the environment, cheap and easily available. There are thousands of species of ants in the world.
Story first published: Thursday, April 30, 2015, 17:24 [IST]
Desktop Bottom Promotion