For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాజు గ్లాసు లేదా గాజు వస్తువులు పగిలినప్పుడు ఎలా క్లీన్ చేయాలి

|

ఇంట్లో సహజంగా వస్తువులు జారవిడవడం, అవి పగలడం జరుగుతుంటుంది. అయితే స్టీలు, ప్లాస్టిక్, వస్తువులు క్రింద పడితే ఎటువంటి సమస్య ఉండదు. కానీ అదే గాజు వస్తువులు కానీ, గాజు గ్లాసు కానీ క్రింద పడినప్పుడు, అవి పెళుసుగా ఉండటం వల్ల వెంటనే పగులుతాయి.?ఫ్లోర్ మీద గాజు వస్తువులు పగిలినప్పుడు, ఆ ప్రదేశం మొత్తం చిందరవందరగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా వాటిని వెంటనే శుభ్రం చేయకపోతే, అప్పుడు అది ప్రమాధకరంగా మారతుంది. ఇంట్లో వారికి హాని కలగవచ్చు. మరియు కార్పెట్ మీద గ్లాస్ పగిలినప్పుడు, శుభ్రం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది.

ఎందుకంటే ఫ్లోర్ మీద గాజుముక్కలున్నట్లైతే, మీరు కేవలం బ్రూమ్ స్టిక్(గడ్డిపరక/చీపుర్ )తో ఊడ్చి ఆ ప్రదేశంలో శుభ్రం చేసేస్తుంటారు . అదే కార్పెట్ మీద గాజు గ్లాసు పగిలనప్పుడు, మీరు మరింత శ్రద్ద, ఓపికతో శుభ్రం చేయాల్సి ఉంటుంది. కార్పెట్ మీద గాజుముక్కలను తొలగించడం అంత సులభమైన పనికాదు. కార్పెట్ మీద పగిలిన గాజు ముక్కలను శుభ్రం చేయడానికి మీరు చాలా జాగ్రత్తగా, మీకు హాని కలగకుండా చూసుకోవాలి. కార్పెట్ మీద గాజు ముక్కలను ఏలా శుభ్రంచేయాలో మీరు కాస్త కన్ఫ్యూజ్ అయినట్లైతే, ఈ క్రింది కొన్ని ఉపాయాలున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం....

How To Clean Up Broken Glass On Carpet

కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు :
ఆప్రదేశం నుండి మీ పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి. ఆప్రదేశాన్ని శుభ్రం చేయడానికి ముందుగా కాళ్ళకు షులను ధరించాలి. పగిలిన గాజు ముక్కలను క్లీన్ చేయడానికి ముందు కొన్ని ముందు జాగ్రత్తలుతీసుకోవడం చాలా అవసరం.

చేతులకు హానికలగకుండా సురక్షితంగా ఉంచుకోవాలి.
కార్పెట్ మీద గాజు ముక్కలను శుభ్రంచేయడం ఎలా?చేతులకు గ్లౌజును ధరించాలి. తర్వాత నిదానంగా పగిలిన గాజు ముక్కలను నిధానంగా తొలగించాలి . ఒక వేళ గ్లౌజులు లేనట్లైతే , పక్కన ఐస్ క్యూబ్స్ దగ్గర పెట్టుకోవాలి. చేతికి రక్షణగా ఏవీ లేనప్పుడు, చిన్న చిన్న గాజు ముక్కల వల్ల ప్రమాధకరంఅవుతుంది. చేతికి కానీ, లేదా వేళ్లకుకానీ తెగే అవకాశం ఉంటుంది. ఇలా గాయం అవ్వడం ప్రమాదకరం కూడా.

How To Clean Up Broken Glass On Carpet

ఓల్డ్ న్యూస్ పేపర్
న్యూస్ పేపర్ మీద గాజు ముక్కలను వేసి, భద్రంగా చుట్టి, పడేయాలి. ఇలాపెద్ద పెద్ద గాజు ముక్కలనుతొలగించాలి. తర్వాత ఫ్యాబ్రిక్ కార్పెట్ మీద ఉండే గాజు ముక్కలను ఫ్యాబ్రిక్ లోకి పుష్ చేయకూడదు. చిన్న చిన్నగాజు ముక్కలు కార్పెట్ లోఇరుక్కోవడం వల్ల , అవి త్వరగా బయటకు రాలేవు. అవి అలా ఉండిపోయి, మనకు తెలియకుండా నడిచినప్పుడు, పాదాలకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది.

వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించాలి.
ఇప్పుడు, వాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించి, ఆ ప్రదేశంలో ఉపయోగించాలి. డస్టిబిన్ తీసుకొచ్చి , మీ వాక్యూమ్ క్లీనర్ ను శుభ్రం చేసుకోవాలి. వాక్యూమ్ ను కాలీ చేయాలి. ఒక వేళ అలా చేయకపోతే, మీ కుటుంబ సభ్యుల్లోమరే ఇతరులకైనా హాని కలగవచ్చు. తప్పకుండా వెంటనే వాక్యూమ్ ను క్లీన్ చేయాలి.

బ్రూమ్ స్టిక్ : గాజు పగలిన ప్రదేశంలో గాజు ముక్కలున్నట్లైతే, ఫర్నీచర్ క్రిందికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి, వాక్యూమ్ చేసిన వెంటనే గడ్డిపరకతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి . ఈ విధంగా జాగ్రత్తగా కార్పెట్ మీద గాజు ముక్కలను తొలగించుకోవాలి.

Story first published: Saturday, January 10, 2015, 18:34 [IST]
Desktop Bottom Promotion