For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కట్ చేసిన కూరగాయలను తాజాగా భద్రపరచడం ఎలా

|

ప్రస్తుత కాలంలో ఇంట్లో ఒకరున్నా, ఇద్దరున్నా, లేదా ఎక్కువ మంది ఉద్యోగస్తులుంటే ఇటు ఇంటి పని, అటు ఆఫీస్ పునులతో సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అదే క్రమంలో ప్రతి రోజూ ఉదయం వంట చేయడానికి ముందు కాయగూరలు కట్ చేయడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ముందే కట్ చేసి పెట్టుకోవడం అలవాటగా మార్చుకోవడం ఉద్యోగస్తులు, స్కూల్ , కాలేజ్ కి వెళ్ళే పిల్లలున్న ఇళ్లలో చూస్తూనే ఉంటాం.

అయితే అలా కట్ చేసిన కూగరాయలు కొన్ని రకాలు తాజాగానే ఉన్నా...మరికొన్ని మాత్రం పాడవుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుందో కొంత మంది తెలుసుకోలేరు. ఇలాంటి సందేషం చాలా మంది మహిళల్లో ఎదుర్యయ్యే సహజ సమస్య. అందుకే కట్ చేసిన కూరగాయలు ఏవిధంగా భద్రపరచుకోవాలో ఒకసారి ఈ క్రింది విధంగా తెలుసుకుందాం....

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరలు ఫ్రిజ్ లో భద్రపరచడానికి ముందే వాటిని ఆకులను కొమ్మలను నుంచి వేరుచేయాలి. ఈవిధంగా చేసిన ఆకుల్లో కూడా ఎండిపోయినవి, వాడిపోయినవి, కుళ్లినట్లు కనిపించే వాటిని వేరుచేసి పక్కకు తీసేయాలి. ఇప్పుడు మిగిలిన తాజా ఆకుల్ని ఫ్రిజ్ లో పెట్టొచ్చు. దీనికోసం ఒక పేపర్ టవల్ లేదా పలుచని కాటన్ వస్త్రం తీసుకుని అందులో ఈ ఆకులు వేసి చుట్టేసి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. అయితే ఈ ఆకుకూరలు సాధారణంగా రెండు రోజులు మాత్రమే తాజాగా ఉంటాయి.

క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ:

క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ:

క్యాబేజీ వంటి కాయగూరల్ని కట్ చేిసన వెంటనే ఒక ప్లాస్టిక్ కవర్ లో వేసి వెంటనే ఫ్రిజ్ లో భద్రపరచుకోవాలి. కాలీఫ్లవర్, బ్రొకోలి వంటి కూరగాయలు కట్ చేసినప్పటికీ వాటిలో తేమని అంత తొందరగా కోల్పోవు. అందుకే క్యాలీఫ్లవర్ గాలి తగలని వాటిలో వేిస భద్రపరుచుకోవాలి. బ్రొకోలిని ముక్కలుగా చేసి తర్వాత నెట్ తో ఉన్న కవర్స్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఎక్కువ సమయం తాజగా ఉంటాయి.

 ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు కోసిన వెంటనే వాటిని గాలి తగలని డబ్బాల్లో వేసి ఫ్రిజ్ లో ఉంచాలి. అయితే ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రోజు లోపల వినియోగించుకోవడం తప్పనిసరి. ఆ తర్వాత అవి వాటి తాజాదనాన్ని కోల్పోతాయి.

వంకాయలు:

వంకాయలు:

సాధారంగా వంకాయలు కట్ చేసిన కాసేపటికే రంగు మారిపోవడం మనం గమనిస్తుంటాం. అయితే వాటి మీద పసుపు, నిమ్మరసం కలిపిన నీటిని చల్లితే అవి రంగు మారకుండా తాజాగా ఉంటాయి. అలాగే కట్ చేసిన వంకాయల్ని ఫ్రిజ్ లో భద్రపరుచుకోవాలనుకుంటే వాటిని గుండ్రుంగా కట్ చేసుకుని, ఆ ముక్కల్ని పేపర్ టవల్స్ మద్య వేసి ఒక డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇలా చేస్తే వంకాయ ముక్కలు రెండు రోజుల పాటు తాజాగా ఉంటాయి.

దుంపలు:

దుంపలు:

బంగాళదుంప, ముల్లంగి, క్యారెట్లు...మొదలైనవి కట్ చేసి ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో భద్రపరచడం వల్ల అవి వాటి మ్రుదుత్వాన్ని కోల్పోతాయి. అలాగే వాటి రంగు కూడా మారిపోతుంది. దుంప జాతి కూరల్లో ఉండే తేమ శాతం త్వరగా తగ్గిపోవడం వల్ల వాటి రుచి కూడా తగ్గిపోతుంది. కాబట్టి, ఇలాంటివి కట్ చేసిన వెంటనే ఒక గిన్నెలో నీరు పోసి అందులో కట్ చేసిన కూరలు వేసి వదులైన మూత పెట్టి భద్రపరుచుకోవాలి. అయితే ఇవి కేవలం ఒక రోజు మాత్రమే ఉంటాయి. కాబట్టి వండుకోవడానికి ఒక రోజు ముందు మాత్రమే వాటిని కట్ చేసుకోవడం ఉత్తమం.

 కీరదోసకాయలు:

కీరదోసకాయలు:

కీరదోసకాయ ముక్కలు ఎక్కువ సమయం బయట ఉంచకూడదు. అందుకే గాలి తగలని బ్యాగ్స్ లేదా డబ్బాల్లో వేసి వీటిని భద్రపరుచుకోవాలి. ఇలా చేస్తే కీరదోస ముక్కలు 3రోజుల వరకూ తాజాగా ఉంటాయి.

.కట్ చేసి టమోటో ముక్కలు

.కట్ చేసి టమోటో ముక్కలు

.కట్ చేసి టమోటో ముక్కలు ఎక్కువ సమయం నిల్వ ఉండవు. అందుకే ఒక వేళ వాటిని భద్రపరచాలనుకుంటే ఒక గిన్నెలో వాటిని వేసి పైన వదులుగా మూత పెట్టాలి. అియతే ఇలా భద్రపరచినవి కేవలం 24గంమాత్రమే తాజాగా ఉండే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకూ కట్ చేసినా, చేయకపోయినా టమోటాలను ఫ్రిజ్ లో పెట్టకపోవడం మంచిది.

అల్లం వెల్లుల్లి:

అల్లం వెల్లుల్లి:

తొక్క తీసేసినవి కట్ చేసినవి విడివిడిగా గాలి తగలని బాక్స్ లో వేసి భద్రపరుచుకోవాలి. ఇవి దాదాపు 5రోజులకు వరకూ ఫ్రెష్ గా ఉంటాయి.

మిరకపకాయలు:

మిరకపకాయలు:

మిరపకాయలు చేట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా గాలి తగలకుండా భద్రపరుచుకోవాలి. వాటికి తడి తగిలితే జిగురుగా మారి తొందరగా పాడైపోతాయి..

కట్ చేసి వెజిటేబుల్స్ ను ఫ్రెష్ గా భద్రపరచడం ఎలా

కట్ చేసి వెజిటేబుల్స్ ను ఫ్రెష్ గా భద్రపరచడం ఎలా

ఇలా కట్ చేసి కూరల్ని ఎలా భద్రపరుచుకోవాలో చూశారుగా . మరి మీరు కూడా ఈచిన్న చిట్కాలను అనుసరించి సమయంను ఆదా చేసుకొని, తాజా..తాజా కూరలతో రుచికరమైన వంటలను వండుకోండి...

English summary

How to Keep Cut Vegetables Fresh!: Home improvement tips in Telugu

Storing cut vegetables can streamline your cooking in many ways. After chopping the vegetables, it’s easy to store them in the refrigerator, and these ready-to-go-veggies can make healthy meals and snacks a snap. Many cut vegetables also freeze well, which can help you preserve the bounty of seasons past and simply make your life easier by making your ingredients recipe-ready.
Story first published: Friday, June 19, 2015, 17:40 [IST]
Desktop Bottom Promotion