For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిగిలిపోయిన పచ్చ సొనని ఉపయోగించడానికి 8 ఐడియాలు

By Super
|

గుడ్డులో పచ్చసొన ని ఎలా ఉపయోగించాలో బోలెడు ఐడియాలున్నాయి. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, పచ్చ సొన ని వెంటనే ఉపయోగించకుండా ఫ్రిజ్ లో పెడితే అది పొడిబారిపోతుందని ప్రసిద్ధి చెందిన బేకింగ్ బ్లాగర్ నికోల్ వెర్స్టన్ అంటారు.పచ్చ సొన ఓ రెండు మూడు రోజులపాటు ఫ్రిజ్ లో నిల్వ ఉండాలంటే సొన ని నీటిలో వేసి కావాలనుకున్నప్పుడు జాగ్రత్తగా నీటి లో నుండి బయటకి తీసి వాడుకోవచ్చు.

Leftover Egg Yolks: 8 Clever Ways to Use Them

1.పసుపచ్చటీ కేక్ విప్ చెయ్యడానికి:
రెండు పెద్ద పచ్చ సొనలతో కేక్లో విప్ ను తయారుచేసుకోవచ్చు ఇచ్చిన బటర్ క్రీం ఫ్రాస్టింగ్ జత చేసి రుచికరమైన కేక్ తయారు చేయంచ్చు.

2.భోజనం తరువాత వడ్డించడానికి పుడ్డింగ్
మీరు అప్పటికప్పుడూ తయారు చేసుకుని తినే ఇన్ స్తంట్ పదార్ధాలకి అలవాటు పడి ఉంటే కనుక చక్కగా ఒక పద్ధతిలో ఒక్కో మిశ్రమం కలుపుతూ చేసే పదార్ధం ఏదైనా మీకు ఆనందాన్ని కలుగచేస్తుంది.మార్థా స్టీవార్ట్ సూచించిన పద్ధతి ని అనుసరిస్తే మిగిలిపోయిన పచ్చసొనలతో చేసే మీ పుడ్డింగ్ తయరీ శ్రమ విఫలం కాదు.

Leftover Egg Yolks: 8 Clever Ways to Use Them

3.పాస్తా ఆల్ ఫ్రెడో
ఇటలీకి చెందిన ఈ పాస్తా తయారీ విధానం ఆరోగ్యకరమైనదిగా చెప్తారు.చీజ్ ఎక్కువ ఉండటం వల్ల అప్పుడప్పుడు మాత్రం దీనిని తినడం లో తప్పు లేదు.చీజ్ తో కలగలిసి క్రీమీ గా ఉండే ఈ ఆల్ ఫ్రెడో పాస్త తయారు చేస్తారు.

4.స్మూతీ
ఒమేగా-3,ప్రొటీన్ మరియు ఇతర పోషకాలు కలిగిన గుడ్లు మీ స్మూతీ కి చిక్కదనం కలిగించడమే కాకుండా క్రీమీ టెక్స్చర్ ని అందిస్తాయి.ఇల్లు, ఆరోగ్యం ,ఆనందం లాంటి విషయాలని పంచుకునే తన బ్లాగ్ లో కారా కోమినీ ఓ రెండు మూడు పచ్చ సొనలని తన పళ్ళ స్మూతీ లకి కలపడం ద్వారా ఆ స్మూతీ కి ఐస్ క్రీం రుచి ని తీసుకొస్తుంది.

Leftover Egg Yolks: 8 Clever Ways to Use Them

5.ఎగ్ నాగ్
ఎగ్ నాగ్ పాలు, గుడ్లు, విప్ క్రీం తో తయారయ్యే ఒక రకమైన కాక్ టైల్. ఎగ్ నాగ్ లేకుండా మీ హాలిడే పార్టీ నా?? రెసిపీ ప్రకారం ఒక్కో గ్లాసు లో ఒక్కో పచ్చ సొన వేసి రుచికరమైన ఎగ్ నాగ్ మిల్క్ షేక్ ని తయారు చెయ్యాలి.

6.పదార్ధాల మీద కి హాలండైజ్ సాస్
ఇది పసుపు పచ్చగా ఉండి గాఢం గా ఉండే ఒక రకమైన సాస్.దీనిని గ్రిల్ చేసిన సాల్మన్ చేప మీద లేదా ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు లేదా ఆస్పరాగస్ మీద కాస్త చిలకరించి చూడండి.

Leftover Egg Yolks: 8 Clever Ways to Use Them

7. చర్మ సంరక్షణ
గుడ్డు పచ్చ సొనలో ఉండే విటమిన్ ఏ వల్ల ఇది మంచి స్కిన్ మస్క్ గా పని చేసి వాడిన చర్మాన్ని బాగు చేసి యాక్నే ని తగ్గిస్తుంది.పచ్చసొన లోనే రక రకాల పండ్ల గుజ్జు, నూనె లని కలిపి మస్క్ గా ప్రయోగం చేసి చూడండి. ఫచ్చ సొన లో బాదం నూనె,అవకాడొ లేదా ముల్తానీ మట్టి లాంటివి కలపచ్చు.అమెరికన్ జాతికి చెందిన పసు పచ్చని పూలతో ఉండే విచ్ హేజిల్ తో పచ్చ సొన ని కలిపి టోనర్ గా వాడవచ్చు.ఈ హౌ డాట్ కాం లో మీ అంతట మీరు మిగిలిపోయిన పచ్చసొనని ఉపయోగించి చేసుకునే అనేక రకాల ఫేషియల్స్ ఉన్నాయి.

8.జుట్టు కి మాయిశ్చరైజర్ గా
మీ కొత్త ఫేవరెట్ కండీషనర్ స్థానం మీ ఫ్రిజ్ లోనే.ప్రోటీన్లు,కొవ్వు అధికం గా కలిగిన పచ్చ సొన జుట్టు కి సహజమైన పోషణనీ, మృదుత్వాన్నీ అందించి జుట్టు చిట్లడాన్ని అరికడుతుంది.దాదాపు అరకప్పు(6-

పచ్చ సొనలు తీసుకుని బాగా గిలక్కొట్టాలి. దీనిని పరిశుభ్రం గా ఉండి కాస్త తడి గా ఉన్న మీ జుట్టు కి పట్టించండి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి.నెలకొకసారి ఈ కండీషనర్ ని ఉపయోగిస్తే మెరిసే జుట్టు మీ సొంతం.

English summary

Leftover Egg Yolks: 8 Clever Ways to Use Them

Lots of ideas! But note: If you don’t plan to use your leftover egg yolks right away, note that they don’t freeze too well and can dry out after a day in the fridge alone, says blogger Nicole Weston on the popular site Baking Bites.
Story first published: Thursday, October 22, 2015, 16:59 [IST]
Desktop Bottom Promotion