For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటగదిలో చెక్క పాత్రలు శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు...

|

గతంలో వంటగదిలో ఒకే రకమైన వంటపాత్రలు కనబడేవి. అయితే కాలం మారేకొద్ది. మనుషుల్లో కూడా మార్పులు వస్తున్నాయి.. ట్రెండ్ ను బట్టి లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటున్నారు. అదే విధంగా ఇంట్లో కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కొత్తదనంతో పాటు, స్టైలిష్ గా..మోడ్రన్ గా కనబడే వస్తువులతో ఇంటిని అలంకరించుకుంటున్నారు.

ఒక్క లివింగ్ రూమ్, బెడ్ రూమ్, మరియు కిడ్స్ రూమ్ మాత్రమే కాదు, వంటగదిని కూడా వారికి నచ్చిన విధంగా అలంకరించుకుంటున్నారు. నచ్చిన వస్తువుల వాడకం ఎక్కువగా ఉన్నది. ప్రతి ఒక్కరి వంటగదిలో స్పూన్లు, ఫోర్క్ మరియు లాడెల్స్ ను ఉంటాయి? మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఉడెన్ స్పూన్ లేదా ఫోర్క్ ను వాసన చూశారా?అవి కర్రీ వాసన వస్తున్నాయా..? లేదా మరేదైనా చెడు వాసన వాస్తున్నాయా? లేదా అవి పాతబడిపోయి అసహ్యాంగా కనబడుతున్నాయా?

Tips To Clean Wooden Kitchen Utensils

అందుకు మీరు చింతించాల్సిన పనిలేదు వంటగదిలో ఉపయోగించే ఉడెన్ వస్తువులను, కొన్ని వంటగది పదార్థాలను ఉపయోగించి కొత్తవాటిలా మెరిపించవచ్చు. ఉదాహరణకు: నిమ్మరసం తో ఎలాంటి వాసననైనా తొలగించుకోవచ్చు. అదే విధంగా వెనిగర్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉడెన్ వస్తువులను శుభ్రం చేస్తుంది. వీటితో పాటు మరొకొన్ని ఎఫెక్టివ్ క్లీనింగ్ ఏజెంట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం...

నిమ్మరసం: నిమ్మరసం బెస్ట్ కిచెన్ క్లీనింగ్ ఏజెంట్ . నిమ్మరసంతో ఎప్పుడైనా..ఏ వస్తువైనా శుభ్రం చేసుకోవచ్చు . నిమ్మరసంను కొద్దిగా వేడి నీటిలో వేసి, ఆ నీటిలో వంటగదిలోని ఉడెన్ (చెక్కపాత్రలను లేదా వంటకు ఉపయోగించే చెక్క వంట వస్తులను)వేయాలి. ఈ లెమన్ వాటర్ లో 15 నిముషాలు డిప్ చేయాలి. నీరు చల్లబడిన తర్వాత తిరిగి వేడి నీళ్ళను జోడించి మరో 15 నిముషాల తర్వాత నీటిలో నుండి బయటకు తీసి పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచేసుకోవాలి . తర్వాత ఎండలో పెట్టి, పూర్తిగా డ్రై చేయాలి.

Tips To Clean Wooden Kitchen Utensils

వెనిగర్: ఒక గ్లాసు వెనిగర్ ఒక బౌల్లో వేసి అందులో ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కాటన్ బాల్ ను బౌల్లో డిప్ చేసి, ఎక్సెస్ వాటర్ పిండేసి, ఆ కాటన్ తో వంటగదిలోని వంటకు ఉపయోగించే చెక్క పాత్రలను తుడవాలి. పూర్తిగా తుడిచిన తర్వాత తిరిగి మరో సారి ఇలాగే చేయాలి.

సాల్ట్ : మరో బెస్ట్ క్లీనింగ్ ఏజెంట్ ఉప్పు ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు వేసి ఆ నీటితో చెక్క పాత్రలను శుభ్రం చేయాలి . సాల్ట్ వాటర్ లో శుభ్రం చేయాల్సిన వస్తువులు వేసి ఒక 5 నిముసాలు నీటితో మరిగించాలి. తర్వాత ఆ నీటిని వంపేసి, పొడి వస్త్రంతో తుడవాలి. తర్వాత ఎండలో కనీసం ఒక రోజంతా ఎండనివ్వాలి.

Tips To Clean Wooden Kitchen Utensils

సిట్రస్ ఫ్రూట్స్: వంటగదిలోని ఉడెన్ వస్తువులను శుభ్రం చేయడానికి సిట్రస్ ఫ్రూట్స్ ను ఉపయోగించుకోవచ్చు . అందుకు మీరు చేయాల్సిందల్లా నిమ్మరసానికి ఏదైతే ఉపయోగించామో అలాగే చేయాలి.

బేకింగ్ సోడ: బేకింగ్ సోడాకు కొద్దిగా నిమ్మరసం జోడించి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఉడెన్ పాత్రలకు అప్లై చేసి 15 నిముషాలు నానబెట్టి, ఆ తర్వాత మొదట వేడి నీళ్ళతోను, తర్వాత చల్లనీటితోనూ శుభ్రం చేసుకోవాలి.

గోరువెచ్చని నీళ్ళు: మరో బెస్ట్ అండ్ సింపుల్ రిసిపి, హాట్ వాటర్. వాటిని మీరు వంటగదిలో ఉపయోగించిన ప్రతి సారి వేడినీళ్ళతో శుభ్రం చేయాలి.

English summary

Tips To Clean Wooden Kitchen Utensils

Most of us use wooden spoons, forks and ladels at home right? Take a walk to your kitchen and smell your wooden spoon or fork. Does it smell of curry, does it smell stale and does it look old and yucky?
Story first published: Thursday, September 24, 2015, 17:32 [IST]
Desktop Bottom Promotion