For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మతో ఇంటిని శుభ్రం చేసే టెక్నిక్స్

By Nutheti
|

మీ ఇంట్లో సింక్, తలుపులు, కిటికీలకు దుమ్ము పేరుకుపోయిందా ? ఎన్ని సార్లు శుభ్రం చేసినా వదలడం లేదా ? అయితే ఇప్పుడు మేం చెప్పే హోం రెమిడీస్ ట్రై చేసి చూడండి. ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా... మీ ఇంటికి కొత్త శోభ తీసుకొచ్చే సింపుల్ గా, ఈజీగా ఫాలో అయ్యే.. చిట్కాలు తెలుసుకోండి.

నిమ్మకాయ అందం.. ఆరోగ్యానికే కాదు.. ఇంటిని శుభ్ర పరచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే.. పులపుదనం.. ఎలాంటి మరకలనైనా.. క్లీన్ చేసేస్తుంది. నిమ్మ చెక్క చాలు ఇంట్లో పేరుకున్న దుమ్ము, దూళిని వదిలించడానికి. కాబట్టి కెమికల్స్ తో నిండిన క్లీనింగ్ ప్రొడక్ట్స్ ని పక్కన పెట్టేయండి. వాటి వల్ల చర్మానికి, ఊపిరితిత్తులకు ప్రమాదం కూడా.

కిటికీ

కిటికీ

నిమ్మతో శుభ్రం చేస్తే.. మీ ఇళ్లు తలతలా మెరిసిపోవాల్సిందే. గాలితో పాటు వచ్చిన.. దుమ్ము, ధూళి కిటీల చెక్కలకు అంటుకుపోయి ఉంటుంది. ఎన్నిసార్లు క్లీన్ చేసినా.. మళ్లీ మళ్లీ పేరుకుపోతుంది. కొన్ని సందర్బాల్లో ఎంత శుభ్రం చేసిన వదలదు. అలాంటప్పుడు.. నిమ్మకాయ రసం తీసి.. ఒక మగ్ నీళ్లలో కలపాలి. దానికి కాస్త బేకింగ్ సోడా కూడా కలుపుకోవాలి. ఈ నీటిలో కాటన్ వస్త్రాన్ని ముంచి.. కిటికీ చెక్కను తుడిస్తే.. దుమ్ము వదిలి కొత్తవాటిలా మెరుస్తాయి.

సింక్

సింక్

వంటగదిలో ఉండే సింక్ జిడ్డు పేరుకుపోయి ఉంటుంది. దానికి కెమికల్స్ తో నిండిన క్లీనింగ్ ప్రొడక్స్ వాడటం కంటే.. హోం రెమిడీస్ తెలుసుకోవడం మంచిది. రెండు నిమ్మ రెబ్బలు తీసుకుని.. సింక్ మొత్తం రసం పిండేయాలి. తర్వాత రాళ్ల ఉప్పు చల్లి... టూత్ బ్రష్ తో రుద్దుతూ.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరి.

టాయిలెట్ సీట్

టాయిలెట్ సీట్

కొంతకాలం గడిచేసరికి టాయిలెట్ సీట్లు.. పాతవాటిలా మారిపోతాయి. అలాంటప్పుడు నిమ్మ రసాన్ని సీటంతా చిలకరించాలి. తర్వాత బేకింగ్ సోడా.. చల్లి.. దూదితో తుడిచేయాలి. సింపుల్ అండ్ ఈజీ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.

పాత్రలకు

పాత్రలకు

నాన్ వెజ్ వండినప్పుడు ఇంట్లో పాత్రలన్నీ కాస్త జిడ్డుగా.. కొంచెం స్మెల్ వస్తుంటాయి. కాబట్టి.. పాత్రలన్నీ కడిగేశాక.. నిమ్మరసం.. వెనిగర్ కలిపిన నీటితో.. పాత్రలను రుద్దాలి. తర్వాత.. గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే.. మరకలతోపాటు.. వాసన కూడా మాయమవుతుంది.

ఫ్లోర్ క్లీనింగ్

ఫ్లోర్ క్లీనింగ్

ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు నిమ్మరసం వాడి చూడండి.. ఎంత మెరిసిపోతుందో. నిమ్మ రసాన్ని ఫ్లోర్ పై చల్లి.. తడి వస్త్రంతో తుడవండి. 10 నిమిషాల తర్వాత.. వెనిగర్, ఉప్పు కలిపిన నీళ్లతో శుభ్రం చేయండి. మీ ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఈ సింపుల్ అండ్.. ఈజీ టిప్స్ ఫాలో అవుతారు కదూ..

English summary

Tips To Clean Your Home With Lemon

One of the ingredients which is present in every home is lemon. This acidic fruit is one of the many bests you can use to clean your entire home. To get started, all you need to do is get rid of those chemically based products lying around in your home. These harmful products should not be used regularly as it contains properties which could harm your lungs and skin.
Desktop Bottom Promotion