For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంట్లో నీళ్ళు రాకుండా ఉల్లిపాయలు తరగడం ఎలా

|

ఉల్లిచేసే మేలు తల్లికూడా చేయదు అంటారు.. అందుకేకాబోలు ఉల్లిపాయ లేని కూరంటూ ఉండదు. పులుసు, ఇగురు, వేపుడు ఇలా ఏదైనా సరే అందులో ఉల్లిపాయ ఉండి తీరాల్సిందే. అయితే వేసుకున్నాక కూరకు ఎంత రుచి వస్తుందో దాని కట్ చేయడంలోనూ అంతే కష్టం ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయ తరిగేటప్పుడు కళ్లు మండి నీరు కారుతూ ఉంటాయి. వీటిని కట్ చేసినప్పుడు జరిగే రసాయనిక చర్యల కారణంగా విడుదలయ్యే సల్ఫర్ డై ఆక్పైడ్ కారణంగా కంటి నుంచి నీరు వస్తుంది. అయితే ఉల్లిపాయలను కోసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలా జరగకుండా చూసుకోవచ్చు... మరి ఆ జాగ్రత్తలేంటో ఒకసారి చూద్దాం...

చాకు పదునుగా ఉండాలి:
లావుగా, పదును లేకుండా ఉన్న చాకుతో కోస్తే ఉల్లిపాయ పొరల నుంచి సల్ఫర్ డై ఆక్సైడ్ ఎక్కువగా విడుదల అవుతుంది. దాంతో కళ్లు మండటంతో పాటు కళ్ల నుంచి నీరు కూడా కారుతుంది. అందుకే పలుచగా, పదునుగా ఉండే చాకుని ఉపయోగించాలి. దీనివల్ల ఉల్లి నుంచి వెలువడే రసాయనాల మోతాదు తగ్గడం వల్ల కళ్లు అంతగా మండవు.

Tips To Cut Onions Without Getting Tears!

నీళ్ళలో వేయాలి:
ఉల్లిపాయ పొట్టు తీసిన తర్వాత నీటిలో వేయడం అందరికీ తెలిసిందే. అయితే వీటిని సగానికి ముక్కలుగా కోసం తర్వాత నీటిలో వేయడం మంచిది. దీనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

Tips To Cut Onions Without Getting Tears!

గాలి ప్రసరించే చోట:
గాలి బాగా ప్రసరించే చోట మాత్రమే ఉల్లిపాయలను కోయాలి. అలాగని ఫ్యాక్ కింద కూర్చుని కోయడం కూడా మంచిది కాదు. కిచెన్ లో ఉల్లిపపాయలు కోస్తున్నప్పుడు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కి దగ్గరలో నిల్చుంటే కళ్లు ఎక్కువగా మండకుండా ఉంటాయి.

Tips To Cut Onions Without Getting Tears!

ఫ్రిజ్ లో :
కోసే ముందు ఉల్లిపాయలను కాసేపు ఫ్రిజ్ లో పెట్టడం ద్వారా కూడా కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల్లో ద్రవరూపంలో ఉన్న రసాయనాలు గడ్డకట్టడం వల్ల వాటిని కోసినప్పుడు అవి తక్కువగా విడుదలవుతాయి.

Tips To Cut Onions Without Getting Tears!

చాపింగ్ బోర్డ్:
సగానికి తరిగిన ఉల్లిపాయను చాపింగ్ బోర్డుపై బోర్లించడం ద్వారా కూడా రసాయనాల విడుదల తగ్గి కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది. చాలా మంది ఉల్లిపాయలను కోసిన వెంటనే గిన్నెలో వేసేస్తూ ఉంటారు. దీని వల్ల మరింతగా రసాయనాలు విడుదలవుతాయి. కాబట్టి చాపింగ్ బోర్డ్ మీద కోసినవి కోసినట్లుగా ఉంచి మొత్తం పూర్తయిన తర్వాత గిన్నెలో వేసుకోవాలి.

కొద్దిగా వేడిగా ఉండేలా:
ఉల్లిపాయలు కోసే ప్రదేశంలో ఒక కొవ్వొత్తిని వెలిగించినా కూడా కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది. మండుతున్న గ్యాస్ స్టౌవ్ కి దగ్గరగా ఉల్లిపాయల్ని కోసినా కళ్లు మండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరికెందుకు ఆలస్యం ఉల్లిపాయ కట్ చేసేప్పుడు ఈ చిట్కాలు పాటించండి..కన్నీళ్ళకు చెక్ పెట్టండి

English summary

Tips To Cut Onions Without Getting Tears!

Few people hate to chop onions as it burns the eyes and brings tears. Just to enjoy the flavour of onion in the dish, you are forced to cut onions. Many people put glasses to avoid getting tears while chopping onions but it is not that effective. Why do you get tears while cutting onions? The onion cell walls break and release enzymes, which generate a sulphurous gas.
Story first published: Thursday, May 28, 2015, 16:49 [IST]
Desktop Bottom Promotion