For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిష్ వాష్ ను మరింత సులభతరం చేయడం ఎలా

|

డిన్నర్ చేసిన తర్వాత కిచెన్(వంటగది)కాస్త గందరగోళంగా ఉంటుంది. వంటలు వండిన పాత్రలు మరియు తిన్న గిన్నెలు, ఉపయోగించన గ్లాసులు, ప్లేట్స్ చిందరవందంగా వంటగది చూడటానికి కొంచెం ఇబ్బంది కరంగా ఉంటుంది. డిన్నర్ తర్వాత వంటగదిని శుభ్రం చేయడం కష్టంగా భావిస్తాము. కాబట్టి, డిన్నర్ తర్వాత డిష్ వాష్ చేయడం మరింత సులభతరం చేసుకొనేందకు కొన్ని చిట్కాలు మీకోసం ఇక్కడ కొన్ని తెలుపుతున్నాము.

భోజనం చేసిన తర్వాత కష్టమైన పనే అయినా, అనుకూల వైకరితో పనిచేస్తే డిష్ వాషింగ్ మరింత సులభతరం అవుతుంది. మరియు కొద్దిగా ఆసక్తికరంగా పనిచేసుకోవచ్చు.

వంటలను వండినవి, భోజనం చేసిన సామాగ్రిని ఎప్పటికప్పుడు వాష్ చేసుకొంటే మరుసటి రోజు ఉదయం సులభతరం అవుతుంది. అంతే కాదు, ఇలా ఎప్పటికప్పుడు పాత్రలు శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా ద్వారా ఏర్పడే ఆరోగ్య సమస్యలుండవు. ఇలాంటివన్నీ మీరు నివారించుకోవాలంటే, ఉపయోగించిన సామాగ్రిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుండాలి.

మరి డిష్ వాష్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మరియు ఈజీగా శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా...

డిష్ వాష్ ను మరింత సులభతరం చేసుకోవడానికి చిట్కాలు

డిష్ వాష్ ను మరింత సులభతరం చేసుకోవడానికి చిట్కాలు

డిష్ వాష్ ను మరింత సులభతరం చేసుకోవడానికి ఒక సాధారణ చిట్కా , మీరు ఉపయోగించిన వెంటనే దాన్ని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే షింక్ నిండుగా వేయకుండా ఏదైనా పాత్రలు కనబడిన వెంటనే వాటిని శుభ్రం చేసుకోవాలి.

టైమ్ సెట్ చేసుకోవాలి:

టైమ్ సెట్ చేసుకోవాలి:

షింక్ నుండుగా వేసేసి గంటలు తరబడి వాటి శుభ్రం చేయకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు శుభ్రం చేయడానికి తక్కువ సమయం పడుతుంది. దాంతో త్వరగా శుభ్రం చేయాలనే ఆలోచన కలుగుతుంది.

తిరిగి ఉపయోగించే పాత్రలు:

తిరిగి ఉపయోగించే పాత్రలు:

వంటలు వండుటకు ఎక్కువ పాత్రలు ఉపయోగించడం నివారించాలి . ఎక్కువ వెజల్స్ ను బయటకు తీయ్యడం వల్ల అవి వంటగదిని చిందరవందర చేసేస్తాయి. తిరిగి ఉపయోగించే పాత్రలను వెంట వెంటనే శుభ్రం చేసేసుకుంటుండాలి . అలా చేస్తుంటే క్రమంగా పాత్రలు తక్కువగా పడుతాయి. మీకు శ్రమ తగ్గుతుంది.

షింక్ కు కాస్త దూరంలో పాత్రలుంచాలి:

షింక్ కు కాస్త దూరంలో పాత్రలుంచాలి:

వాడిన వాటాని , వాడని పాత్రలన్నింటిని షింక్ దగ్గర్లో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల మొత్తం, కలిసిపోయి చిందరవందరగా కనబడుతాయి. మురికిపడ్డ పాత్రలన్నీ ఒక టబ్ లో వేసి తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల షింక్ అశుభ్రంగా కనబడకుండా ఉంటుంది.

మ్యూజిక్:

మ్యూజిక్:

పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ పని మొదలు పెడితే మీ పనిని మరింత సులభతరం చేస్తుంది . మీర ఏకాగ్రత పాత్రల శుభ్రం చేయడం కంటే మ్యూజిక్ మీద ఉండటం వల్ల పని భారంగా అగుపించదు. మరియు త్వరగా పని పూర్తి చేయగలుగుతారు.

మీ పనిని షేర్ చేసుకోవాలి:

మీ పనిని షేర్ చేసుకోవాలి:

పని ఎక్కువగా ఉన్నప్పుడు మీ పాట్నర్ యొక్క సహాయం తీసుకోవడంతో పని భారం మరింత తగ్గించుకోవచ్చు. శరీరానికి ఎక్కువ ఒత్తిడి కలగకుండా ఉంటుంది.

English summary

Tips To Make Dishwashing Easier : House Tips in Telugu

Kitchen after dinner is quite messy and doing the dishwashing is a great task. We usually tend to avoid doing it at the moment. This creates chaos in the kitchen. We are here to share some brilliant tips to make dishwashing easier.
Story first published: Monday, August 10, 2015, 17:44 [IST]
Desktop Bottom Promotion