దుస్తులకు అంటిన చూయింగ్ గమ్ ను వదిలించుకోవడానికి సులభమైన చిట్కాలు

బట్టల నుండి చూయింగ్ గమ్ ని తొలగించడానికి కొన్ని సరళమైన పద్ధతులు ఉన్నాయి. వీటిని అమలు చేయటానికి ఫ్యాన్సీ ద్రవాలు మరియు గాడ్జెట్ల అవసరం లేదు. ఇంటిలో మనకు అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించి సులభంగా చూ

Subscribe to Boldsky

మీ బట్టలకు చూయింగ్ గమ్ అంటుకున్నప్పుడు విసుగు మరియు అసంతృప్తి భావన కలుగుతుంది. అదే మీకు ఇష్టమైన బట్టలకు చూయింగ్ గమ్ అంటుకుంటే చాలా బాధ కలుగుతుంది.

బట్టలకు అంటిన చూయింగ్ గమ్ ను వదిలించటానికి పరిష్కారాలు ఉన్నాయి. దాని గురించి దిగులు చెందవలసిన అవసరం లేదు. బట్టలకు అంటిన చూయింగ్ గమ్ ను ఎలా వదిలించుకోవాలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే చిన్న ప్రాంతంలో అంటుకున్న గమ్ ని తొలగించటం కష్టమైన పని.

ఈ సమస్య అనేక సంవత్సరాల బట్టి ఉన్నా, ఇప్పుడు దీనికి పరిష్కారం చూపుతున్నాం. కాబట్టి ఇక్కడ బట్టలకు అంటిన చూయింగ్ గమ్ ని సులభంగా వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

బట్టల నుండి చూయింగ్ గమ్ ని తొలగించడానికి కొన్ని సరళమైన పద్ధతులు ఉన్నాయి. వీటిని అమలు చేయటానికి ఫ్యాన్సీ ద్రవాలు మరియు గాడ్జెట్ల అవసరం లేదు. ఇంటిలో మనకు అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించి సులభంగా చూయింగ్ గమ్ ని వదిలించుకోవచ్చు.

Tips On How To Get Chewing Gum Off Clothes Easily

1. ఫ్రీజర్
బహుశా ఇది బట్టలకు అంటిన చూయింగ్ గమ్ ని వదిలించుకోవడానికి అతి సులభమైన చిట్కా చెప్పవచ్చు. బట్టలకు అంటిన గమ్ పైకి కన్పించేలా జిప్ ఉన్న సంచిలో పెట్టాలి. గమ్ సంచికి అంటుకోవటం లేదని నిర్ధారణకు రావాలి. రెండు గంటల పాటూ ఫ్రిజ్ లో పెడితే గమ్ గట్టిగా మారుతుంది. అప్పుడు సులభంగా తీసేయవచ్చు.

Tips On How To Get Chewing Gum Off Clothes Easily

2. వేడి వెనిగర్
మీ వంటింటిలో తెల్ల వెనిగర్ ఉందా ? అయితే దానిని వంటల్లోనే కాకూండా శుభ్రం చేయటానికి కూడా ఉపయోగించవచ్చు. బట్టలకు అంటిన చూయింగ్ గమ్ ని తొలగించటానికి బాగా సహాయపడుతుంది. ఒక గిన్నెలో వెనిగర్ వేసి మైక్రోవేవ్ లో ఒక్క నిమిషం ఉంచాలి. ఈ వేడి వెనిగర్ లో గమ్ అంటిన వస్త్రాన్ని ముంచి 5 నిముషాలు ఆలా ఉంచాలి. వేడి వెనిగర్ గమ్ ని విచ్ఛిన్నం చేస్తుంది. ఒక టూట్ బ్రష్ సాయంతో గమ్ ని తొలగించవచ్చు.

Tips On How To Get Chewing Gum Off Clothes Easily

3. హాట్ ఇస్త్రీ
చూయింగ్ గమ్ వదిలిచుకోవటానికి ఇది ఒక మంచి పద్దతి. మీ ఇస్త్రీ బోర్డు మీద ఒక కార్డ్బోర్డ్ ఉంచండి. కార్డ్బోర్డ్ మీద వస్త్రం గమ్ వైపు త్యజించి ఒక రుమాలు లేదా వస్త్రం యొక్క మరొక భాగంతో కవర్ చేయాలి. గమ్ ప్రాంతంలో ఇస్త్రీ చేయాలి. వేడి తగిలి ఆ గమ్ కార్డ్బోర్డ్ కి అంటుకుంటుంది. ఈ విధంగా రెండు సార్లు చేస్తే బట్టల నుండి గమ్ తొలగిపోతుంది.

Tips On How To Get Chewing Gum Off Clothes Easily

4. లాండ్రీ సోప్
బట్టలకు అంటిన గమ్ ను లాండ్రీ సోప్ మరియు బ్రష్ సాయంతో తొలగించవచ్చు. ఈ విధంగా గమ్ ని వదిలించటానికి సుమారుగా అరగంట సమయం పడుతుంది. గమ్ ని సడలించడానికి ఎక్కువగా బ్రషింగ్ చేయవలసి ఉంది.

Tips On How To Get Chewing Gum Off Clothes Easily

5. హెయిర్ స్ప్రే
బట్టలకు అంటిన చూయింగ్ గమ్ ని వదిలించుకోవడానికి హెయిర్ స్ప్రే బాగా సహాయపడుతుంది. హెయిర్ స్ప్రే తో గమ్ ప్రభావిత ప్రాంతంలో స్ప్రే చేయాలి. స్ప్రే తక్షణమే గమ్ ని చల్లబరిచి గట్టిపడేలా చేస్తుంది. దాంతో గమ్ సులభంగా తొలగిపోతుంది. గమ్ తొలగే వరకు ఈ విధంగా చేస్తూ ఉండాలి.

6. హెయిర్ డ్రయర్
హెయిర్ డ్రయర్ నుంచి వచ్చే వేడిగాలి గమ్ ని తొలగించటంలో సహాయపడుతుంది. గమ్ మీద పడేలా వేడి గాలిని బ్లో చేయాలి. వేడి ఎక్కువైతే బట్టలు దెబ్బతింటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ పద్దతిని అనుసరించినప్పుడు చేతులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్రక్రియలో గమ్ బాగా వేడెక్కి మీ వ్రేళ్ళు బర్న్ కావచ్చు. అందువల్ల చేతులకు రక్షణ కవచమును ధరించి ఒక మొద్దుబారిన కత్తి సాయంతో గమ్ ని తొలగించాలి.

Tips On How To Get Chewing Gum Off Clothes Easily

7. ఐస్ ప్యాక్
మీకు ఫ్రీజర్ లో బట్టలను పెట్టటానికి తగినంత ఖాళీ లేనప్పుడు ఈ పద్దతిని ఫాలో అవ్వవచ్చు. ఐస్ ప్యాక్ పద్ధతిని ఉపయోగించి బట్టలకు అంటిన గమ్ ని సులభంగా తొలగించవచ్చు. ప్లాస్టిక్ రెండు పొరల మధ్య గమ్ అంటిన వస్త్రాన్ని ఉంచి, దాని పైన ఐస్ ప్యాక్ ఉంచాలి. ఈ చల్లదనం కారణంగా గమ్ గట్టిగా మారుతుంది. గమ్ గట్టిగా మారాక సులభంగా తొలగించవచ్చు.

బట్టలకు అంటిన చూయింగ్ గమ్ ని తొలగించటానికి WD-40 వంటి స్ప్రేలు కూడా అందుబాటులో ఉన్నాయి. చూయింగ్ గమ్ అంటిన ప్రాంతంలో WD-40 ని స్ప్రే చేసి కొంచెం సేపు అయ్యాక బ్రష్ సాయంతో గమ్ ని తొలగించవచ్చు. WD-40 వాసన బట్టలకు రాకుండా ఉండాలంటే వెనిగర్ వేసిన నీటిలో ముంచాలి.

English summary

7 Tips On How To Get Chewing Gum Off Clothes Easily

Got gum on your clothes? Yikes! That could be a disgusting and disappointing feeling. And if it is on one of your favorite dresses, it might even break your heart. If you are a mother to children who end up having gum on their clothes time and again, there would be no end to your frustration. "How in the world do you get these sticky pesky things off clothes?"
Please Wait while comments are loading...
Subscribe Newsletter