For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుస్తులపై కాఫీ మరకలను పోగొట్టే 8 సులభ చిట్కాలు

By Super
|

ఈ రోజుల్లో కాఫీ అంటే మక్కువలేనివారు చాలా తక్కువ మాత్రమే. కాఫీలో వివిధ రకాల ఫ్లేవర్స్ వచ్చిన తర్వాత కాఫీ ప్రియులు ఎక్కువైపోయారు. ఘుమఘులమాడే కాఫీని రుచిని ఆస్వాదిస్తూ సిప్ సిప్ కో గుటకేస్తూ , ఆహ్లాదంగా తాగేవారు చాలా మందే ఉన్నారు. కాఫీ తాగడం అటుంచితే, కాఫీ ఏ మాత్రం దుస్తుల మీద పడ్డా ఇక ఇబ్బంది. కాఫీ మరకలను తొలగించడం కొద్దిగా కష్టమైన పనే.

ఎందుకంటే ముదురు ఎరుపు రంగులో ఉండే కాఫీ మరక దుస్తులపై పడ్డాక మొండిమరకగా ఏర్పడుతుంది. ముఖ్యంగా తెల్ల దుస్తుల మీద పడితే వెంటనే తొలగించాలి.

చల్లగా ఉండే కాఫీ మరకలు దుస్తుల మీద ఏర్పడినప్పుడు, దాన్ని తొలగించడం కష్టంగా ఫీలవుతారు, కాబట్టి, దుస్తుల మీద ఏర్పడ్డ కాఫీ మరకను తొలగించుకోవడానికి సులభమైన పద్దతులను తెలుసుకొని ఉండాలి.

కాఫీ మరకలు పడిన వెంటనే శుభ్రం చేస్తే సులభంగా మరకలు వదిలిపోతాయి. కానీ కాఫీ మరకలు చాలా పాతబడిపోతే ,ఆ మెండి మరకలను తొలగించడం కష్టమవుతుంది. కాబట్టి, త్వరగా మరకలను వదించే సులభమైన చిట్కాలు , ప్రయోగపూర్వకంగా టెస్ట్ చేసిన సులభ చిట్కాలను క్రింది విధంగా అందివ్వడం జరిగింది. మరి అవేంటో చూద్దాం...

1. చల్లటి నీరు:

1. చల్లటి నీరు:

కాఫీ మరక ఏర్పడగానే వెంటనే దాని మీద చల్లనీరు పోసి కడిగేయాలి . కాఫీ పడిన వెంటనే టాప్ క్రింద క్లాత్ ను శుభ్రం చేసుకుంటే మరక సులభంగా వదిలిపోతుంది.

2. బీర్:

2. బీర్:

కాఫీ మరకను వదిలించుకోవడానికి మరో చిట్కా బీర్. బీర్ ను వేరొక క్లాత్ మీద పోసి ఆక్లాత్ తో కాఫీ మరక మీద రుద్ది కడగడం వల్ల మెండిగా మారిన కాఫీ మరక తొలగిపోతుంది.

3. వెనిగర్:

3. వెనిగర్:

వాటర్ సోలబుల్ మరకలను తొలగించడంలో వెనిగర్ బాగా పనిచేస్తుంది. కాఫీ మరక మీద నేరుగా కొద్దిగా వెనిగర్ చిలకరించి చేత్తో రుద్ది, రెగ్యులర్ వాష్ చేస్తే మెండిగా మారిన కాఫీ మరక తొలగిపోతుంది.

4. బేకింగ్ సోడా:

4. బేకింగ్ సోడా:

కాఫీ మరకలను వదిలించడంలో బేకింగ్ సోడా గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకు కొద్దిగా వేడి నీళ్ళను మరకల మీద పోసి , దాని మీద కొద్దిగా బేకింగ్ సోడా చిలకరించి , కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

5.గుడ్డు పచ్చసొన:

5.గుడ్డు పచ్చసొన:

ఆశ్చర్యం , మరకలను తొలగించడంలో గుడ్డు పచ్చ సొన అంటే మీకు నమ్మకం కుదరకపోవచ్చు, . కానీ ప్రయత్ని సిద్దంగా కొంత మంది ప్రయత్నించి మంచి ఫలితాలను పొందారు . టెర్రీ క్లాత్ తో గుడ్డులోని పచ్చసొనను బాగా గిలకొట్టాలి, తర్వాత అదే బట్టతో మరకల మీద మర్ధన చేయాలి. తర్వాత మంచి నీటితో శుభ్రం చేస్తే మరక మాయమవుతుంది.

6. క్లబ్ సోడా:

6. క్లబ్ సోడా:

కాఫీ మరకలను నివారించడంలో క్లబ్ సోడా గ్రేట్ అని చెప్పవచ్చు. కాఫీ పౌడర్ ను మొండిమరకల మీద వేసి, రుద్దడం వల్ల మరకలు పూర్తిగా కనబడకుండా పోతాయి.

7. డిటర్జెంట్:

7. డిటర్జెంట్:

లిక్విండ్ లాండ్రీ డిటర్జెంట్ మరకల మీద మర్దన చేయాలి . కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాతనీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫ్రెష్ స్టెయిన్ తొలగిపోవడానికి 5నిముషాలు మాత్రమే పడుతుంది . అయితే డిటర్జెంట్ ఎక్కువ సేపు దుస్తుల మీద ఉండి ఎండకుండా చూసుకోవాలి.

8. స్టెయిన్ రిమూవర్:

8. స్టెయిన్ రిమూవర్:

కాఫీ మరకలను సులభంగా తొలగించేవి స్టెయిన్ రిమూవర్స్ . స్టెయిన్ రిమూవర్ ను అప్లై చేసి 5నిముషాలు వదిలేసి మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

8 Easy Ways To Get Rid Of The Stubborn Coffee Stains

Every coffee lover has been at least once unable to avoid a drip of coffee on their clothes at some point or the other. Hence, they know how infuriating that stubborn light brown stain is to be removed, especially if it is present on a white shirt and dries out.
Story first published: Thursday, May 19, 2016, 17:52 [IST]
Desktop Bottom Promotion