For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టైల్స్ మద్య మురికిని తొలగించడానికి క్లీనింగ్ టిప్స్

|

ఫ్లోర్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నా ఫ్లోర్ కి అతికించిన టైల్స్ మధ్య మురికి ఎక్కువగా కనిపిస్తుంది, ఇంట్లో చేరిన దుమ్ముకి, తేమ తోడవ్వడంతో అది కాస్తా గట్టిపడిపోయిన శుభ్రం చేయడానికి కష్టం అవుతుంది. ఫలితంగా తరచూ ఫ్లోర్ శుభ్రం చేస్తున్నా..పెద్దగా ఫలితం కనిపిచందు దాంతో ఫ్లోర్ ని బ్రష్ తో రుద్ది మురికిని పోగొట్టే ప్రయత్నం చేస్తారు.

కానీ ఇది శ్రమతో కూడుకోవడంతో పాటు పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే టైల్స్ మధ్య చేరిన మురికిని తక్కువ శ్రమతో ఎలా తొలగించాలని ఆలోచిస్తున్నారా? అందుకోసం కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

వెనిగర్:

వెనిగర్:

వెనిగర్ ను గోరువెచ్చని నీటిలో కలిపి బాగా మిక్స్ చేసి స్ప్రేబాటిల్ లో పోసి టైల్స్ మధ్య మురికి పేరుకున్న చోట స్ప్రే చేయాలి. ఐదు నిముషాల తర్వాత బ్రష్ తో రుద్దితే మురికి వదలిపోయి ఫ్లోర్ శుభ్రంగా తయారవుతుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడాకు అరకప్పు లిక్విడ్ బ్లీచ్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసి దీన్ని టైల్స్ మధ్య రాసి 10 నిముషాల తర్వాత టూత్ బ్రష్ తో రుద్దితే మురికి వదిలిపోతుంది. తర్వాత తడిబట్టతో తుడిస్తే సరిపోతుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్:

హైడ్రోజన్ పెరాక్సైడ్:

దెబ్బలు తగినప్పుడు ఆ భాగాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్ సైతం టైల్స్ మధ్య చేరిన మురికిని పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. దీన్నే నేరుగా ఫ్లోర్ ని శుభ్రం చేయడానికి వాడుకోవచ్చు. లేదంటే దీనిలో బేకింగ్ సోడాను కలిపి చిక్కటి పేస్ట్ లా తయారుచేసి టైల్స్ మద్య రాసి ఆ తర్వాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బ్లీచ్ :

బ్లీచ్ :

కొన్ని సార్లు టైల్స్ మధ్య చేరిన మురికి పసుపు రంగులో కనబడుతుంది. దీన్ని పోగొట్టడానికి బ్లీచ్ తో తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆక్సిజనేటెడ్ బ్లీచింగ్ పౌడర్ ను రెండు కప్పుల వేడినీటిలో వేసి మిశ్రమంగా చేసుకుని దీనిలో పాత టూత్ బ్రష్ ని ముంచి మురికి ఉన్న చోట బాగా రుద్దితే వెంటనే అది వదిలిపోతుంది.

నిమ్మతో:

నిమ్మతో:

నిమ్మరసాన్ని నీటిలో కలిపి మురికిగా ఉన్న చోట స్ప్రే చేయాలి. ఆ తర్వాత స్ర్కబ్బర్ తో రుద్ది శుభ్రం చేస్తే మురికి వదిలిపోతుంది. అయితే నిమ్మరసం వల్ల టైల్స్ నునుపుదనం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి, కాస్త ఎక్కువ నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపితే సరిపోతుంది.

అమ్మోనియా:

అమ్మోనియా:

బకెట్ నీటిలో కొద్దిగా అమ్మోనియా, బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ , అమ్మోనియా లిక్విడ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి టైల్స్ మధ్య మురికిగా ఉన్న చోట స్ప్రే చేసుకోవాలి. 5 నిముసాల తర్వాత బ్రష్ తో రుద్ది తర్వాత తడి వస్త్రంతో లేదా మాప్ తో నేలను తుడిస్తే సరిపోతుంది.

English summary

Easy Remedies To Remove Rust Stains From Tiles

Easy Remedies To Remove Rust Stains From Tiles,If you have ceramic tiles in your home, this is one of the problems you might face in your kitchen. Gas cylinders create a thick rust formation on tiles which seems difficult to remove. However, with the help of these remedies to remove rust stains from tiles, y
Story first published: Wednesday, June 1, 2016, 18:06 [IST]
Desktop Bottom Promotion