For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం & వెండి ఆభరణాలను శుభ్రం చేయడానికి సులభమైన చిట్కాలు..!!

వాతావరణంలో ధూళి, కాలుష్యం కారణంగా బంగారం మరియు వెండి ఆభరణాలు మురికి పడతాయి. ఈ ఆభరణాలపై ఎక్కువ కాలం మురికి ఉంటే ఆభరణాలు మెరుపును కోల్పోతాయి. బంగారం మరియు వెండి ఆభరణాలను శుభ్రం చేయటానికి కొన్ని సులభమైన

By Super Admin
|

మీరు ఆభరణాల గురించి ఏ రోజైన ఆలోచించారా. నేడు అనేక ఆధునిక డిజైన్లలో బంగారం మరియు వెండి ఆభరణాలు ఉన్నాయి. ఇవి ఒక మహిళ యొక్క వేషధారణలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నాయి.

మనం మన శరీరాన్ని ఎలా సంరక్షిస్తూ ఉన్నామో అదే విధంగా బంగారం మరియు వెండి ఆభరణాలకు కూడా సంరక్షణ మరియు నిర్వహణ అవసరం.

వాతావరణంలో ధూళి, కాలుష్యం కారణంగా బంగారం మరియు వెండి ఆభరణాలు మురికి పడతాయి. ఈ ఆభరణాలపై ఎక్కువ కాలం మురికి ఉంటే ఆభరణాలు మెరుపును కోల్పోతాయి. బంగారం మరియు వెండి ఆభరణాలను శుభ్రం చేయటానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.

Easy Tips To Clean Gold & Silver Jewels

1. డిటర్జెంట్ పొడి లేదా లిక్విడ్
సాధారణంగా ప్రతి ఒక్కరు ఇంటిలో పాత్రలను తోమటానికి డిటర్జెంట్ పొడి లేదా లిక్విడ్ ని ఉపయోగిస్తారు. డిటర్జెంట్ పొడి బంగారు ఆభరణాలను శుభ్రం చేయటానికి ఒక ముఖ్యమైన మరియు శక్తివంతమైన ఏజెంట్ అని చెప్పవచ్చు. ఒక బౌల్ లో గోరువెచ్చని నీటిని తీసుకోని దానిలో డిటర్జెంట్ పొడి లేదా లిక్విడ్ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో బంగారు ఆభరణాలను వేసి కొంచెం సేపు ఉంచితే మురికి తొలగిపోతుంది. ఆభరణాల అంచులను టూత్ బ్రష్ సాయంతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత మంచి నీటిలో ఆభరణాలను కడిగి మెత్తని పొడి వస్త్రంతో తుడవాలి. ఇది బంగారు ఆభరణాలను శుభ్రం చేయటానికి చౌకైన మరియు సమర్ధవంతమైన విధానం అని చెప్పవచ్చు.

Easy Tips To Clean Gold & Silver Jewels

2. టూత్ పేస్టు
బంగారు ఆభరణాలను శుభ్రం చేయటానికి టూత్ పేస్టు చవకైన మరియు సమర్ధవంతమైన ఇంటి నివారిణిగా చెప్పవచ్చు. టూత్ పేస్టు ని కొంచెం తీసుకోని ఆభరణాలకు రాసి టూట్ బ్రష్ సాయంతో అంచులు మరియు మూలల్లో రుద్దాలి. తేలికపాటి టూత్ పేస్టు ను ఉపయోగిస్తే ఆభరణం కాంతి కోల్పోకుండా సులభంగా మలినాలను తొలగించవచ్చు. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో 10 నిముషాలు ఉంచి పొడి వస్త్రంతో తుడవాలి.

Easy Tips To Clean Gold & Silver Jewels

3. అమ్మోనియా
గోరువెచ్చని నీటిలో కొంచెం అమ్మోనియా పొడిని వేసి బాగా కలపాలి. ఈ ద్రావణంలో బంగారు ఆభరణాలను వేసి ఒక నిమిషం అయ్యాక టూట్ బ్రష్ సాయంతో అంచులు మరియు మూలల్లో రుద్దాలి. బంగారు ఆభరణాలను సులభంగా శుభ్రం చేయటానికి అమ్మోనియా సహాయాపడుతుంది. అయితే బంగారు ఆభరణాలలో ముత్యాలు,జేమ్స్ లేకుండా చూసుకోవాలి.

Easy Tips To Clean Gold & Silver Jewels

4. ఉప్పు స్నానం
వెండి ఆభరణాలను శుభ్రం చేయటానికి ఉప్పు స్నానం సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి, దానిలో వెండి ఆభరణాలను వేసి కొంచెం సేపు ఆలా ఉంచాలి. ఆ తర్వాత టూట్ బ్రష్ సాయంతో అంచులు మరియు మూలలను రుద్ది మంచి నీటితో కడగాలి. వెండి ఆభరణాలు శుభ్రం చేయడానికి చవకైన, వేగవంతమైన మరియు సున్నితమైన మార్గాలలో ఇది ఒకటి.

Easy Tips To Clean Gold & Silver Jewels

5. సిల్వర్ పోలిష్
వెండి ఆభరణాలను శుభ్రం చేసే పద్ధతుల్లో సిల్వర్ పోలిష్ అనేది ఒకటి. వెండి ఆభరణాలను శుభ్రం చేయటానికి సహాయపడే సిల్వర్ పోలిష్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. ఇది ఆభరణాల క్లిష్ట మరకలు తొలగించడానికి మరియు దుమ్మును సులభంగా తొలగించటానికి సహాయపడుతుంది. కొంచెం సిల్వర్ పోలిష్ ని తీసుకోని ఆభరణం మీద వేసి మెత్తని వస్త్రంతో రుద్దాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.

Easy Tips To Clean Gold & Silver Jewels

6. అల్యూమినియం ఫెయిల్
ఒక బౌల్ లో అల్యూమినియం ఫెయిల్ వేసి దానిలో వెండి ఆభరణాలు వేసి బేకింగ్ సోడాను జల్లాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని వెండి ఆభరణాల మీద పోయాలి. ఆభరణాల నుంచి వేడి నీటిని బదిలీ చేయటానికి ఫాయిల్ అనుమతిస్తుంది. ఈ విధంగా అనేక సార్లు చేస్తే ఆభరణాలు షైన్ కోల్పోకుండా శుభ్రం అవుతాయి. బంగారు మరియు వెండి ఆభరణాలను శుభ్రం చేయటానికి సులభమైన మరియు శీఘ్ర మార్గాలు అనేకం ఉన్నాయి.

English summary

Easy Tips To Clean Gold & Silver Jewels

Gone are the days when no one cared about your jewellery. Today, most of the modern designs are available in gold and silver jewellery which makes them an indivisible part of a woman’s attire. Just like how our body needs maintenance and care, even gold and silver ornaments require some maintenance.
Desktop Bottom Promotion