పండ్లు, వెజిటేబుల్స్ మీద ఈగలు వాలకుండా కొన్ని ఇంటి చిట్కాలు..!

ఇంట్లో వాలే ఫ్రూట్ ఫ్లైస్ ను నివారించుకోవడానికి హోం ఇంగ్రీడియంట్స్ ను ఎందుకు ఉపయోగించకూడదు? ఈ హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి, హాని కలిగించవు. ఇటువంటి నేచురల్ పద్దతులను అనుసరించడం వల్ల ఎ

Subscribe to Boldsky

ఇంట్లో అన్నీ క్రమంగా ఉన్నాయి, ఎలాంటి సమస్యలా లేదనుకోవడం పొరబాటే.ఇంట్లో కీటకాలు, క్రిముల, పెట్స్ వాసనకొడుతుంటే, ఇంట్లో వారికి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది . కొన్ని చెడు వాసనలు, జీవితాన్నే అతలాకుతలం చేస్తుంది.

బొద్దింకలు, దోమలు, చీమలను, ఈగలు మొదలగునివి, వ్యాధులను త్వరగా వ్యాపింప చేస్తాయి.ఇక ఫ్రూట్ ఫ్లైస్ గురించి మీరు విన్నారా?ఇవి చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి. చెడు వాసనను కలిగిస్తాయి. ఇటువంటి ఈగలు పండ్లు, కూరగాయలను ఎక్కువగా ఆకర్షిస్తాయి.

ఇటువంటి ఫ్రూట్ ఫ్లైస్ ను నివారించుకోవడమంటే కొద్దిగా కష్టమే. అయితే వాటిని ఎప్పటికప్పుడు చంపేయడం సులభం. వీటిని నివారించుకోవడానికి కొంత మంది కొన్ని రసాయని ఉత్పత్తులను వినియోగిస్తుంటారు, అయితే వీటిలో ఉండే హానికరమైన రసాయనాలు ఇంట్లో వారికి కూడా హాని కలిగిస్తాయి. ముఖ్యంగా పిల్లల్లున్నవారు , వ్రుద్దులు, ఇతర పెంపుడు జంతులకు కెమికల్ ప్రొడక్ట్స్ హాని కలిగిస్తాయి.

Home Ingredients To Get Rid Of Fruit Flies

కాబట్టి, ఇంట్లో వాలే ఫ్రూట్ ఫ్లైస్ ను నివారించుకోవడానికి హోం ఇంగ్రీడియంట్స్ ను ఎందుకు ఉపయోగించకూడదు?

ఈ హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి, హాని కలిగించవు. ఇటువంటి నేచురల్ పద్దతులను అనుసరించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్లస్ ఇవి ఇంట్లోనే స్వయంగా అందుబాటులో ఉంటాయి. అందుకోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

ఇటువంటి ఫ్టూట్ ఫ్లైస్ కు దూరంగా ఉండాలనుకుంటే, ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించడం ఉత్తమం. మరి ఆ నేచురల్ రెమెడీస్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...

home improvement

1. యాపిల్ సైడర్ వెనిగర్ : ఫ్రూట్ ఫ్లైస్(పండ్ల మీద వాలే ఈగలు)నివారించుకోవడానికి యాపిల్స్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గిన్నెలో వేసి వేడి చేయాలి. ఇలా వేడి చేయడం వల్ల ఆ వాసనకు ఈగలు వెల్లిపోతాయి. వేడిగా ఉన్న యాపిల్ సైడర్ వెనిగర్ లో డిష్ వాష్ సోపును మిక్స్ చేసి, వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల ఫ్రూట్ ఫ్లైస్ నాశనం అవుతాయి. తర్వాత కొద్దిగా ఈ వాటర్ ను చల్లారిన తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్ లో సోసి సన్నగా రంద్రాలు పెట్టడం వల్ల ఈగలు దీనికి ఆకర్షింపబడి చనిపోతాయి.

home improvement

2.రోటెన్ ఫ్రూట్స్: బాగా పండిన లేదా చాల మెత్తగా పండిన పండ్లను తినడానికి వీలుపడవు. వీటిని ప్లై ట్రాప్స్ గా ఉపయోగించుకోవచ్చు. ఇలా చాలా మెత్తగా ఉన్న పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసి, ప్లాస్టిక్ వ్రాపర్ లో వేసి మడిచి, రంద్రాలు పెట్టి, ఒక పక్కన పెట్టడం వల్ల ఈగలన్నీ దీనికి చుట్టుకున్నప్పుడే ఈ ఫ్లైట్రాప్ తీసుకెళ్ళి సోప్ వాటర్ లో ముంచితే, చనిపోతాయి.

home improvement

3.పాలు, పంచదార, పెప్పర్ వాటర్: మిరియాల పొడి, పంచదార, పాలలో కలిపి, తక్కువ మంట మీద ఉడికించాలి. 10 నిముషాలు ఉడికిన తర్వాత ఎక్కువ ఈగలున్న ప్రదేశంలో ఉంచాలి. ఈ గిన్నె పెట్టిన వెంటనే ఈగలన్నీ గిన్నెకు వాలుతాయి, గిన్నె తీసుకెళ్లి సోప్ వాటర్ లో ముంచితే చనిపోతాయి.

home improvement

4. రెడ్ వైన్ : ఫ్లై ట్రాప్ ను రెడ్ వైన్ తో తయారుచేయాలి. యాపిల్ సైడర్ వెనిగర్ తయారుచేసిన పద్దతిని దీనికి కూడా అనుసరిస్తే త్వరగా నాశనం అవుతాయి. రెడ్ వైన్ ను కొద్దిగా నీటితో మిక్స్ చేసి, జార్ లో పోసి పక్కన పెట్టాలి. కొద్దిసేపటికి ఈగలు ఈ కంటైనర్ మీద వాలడం గమనిస్తారు, కొన్ని చనిపోతాయి కూడా, వెంటనే వీటిని ఎప్పటికప్పు క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత కంటైనర్ ను శుభ్రంగా కడిగిపక్కన పెట్టుకోవాలి.

home improvement

5. నిమ్మరసం, సువాన వచ్చే డిష్ సోప్: మరో సులభమైన హోం రెమెడీ.ఆరోమా వాసన వచ్చే డిష్ సోప్ ఫ్రూట్ ఫ్లైస్ ను చాలా త్వరగా ఆకర్షిస్తుంది. సోప్ వాటర్ ను తయారుచేసి, స్ప్రేబాటిల్లో పోసి ఇంట్లో కార్నర్స్ లో పోయాలి. ఎక్కడెక్కడ ఫ్రూట్ ఫ్లై ఉంటాయో అక్కడ స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

home improvement

6. వెజిటేబుల్ ఆయిల్: ఫ్రూట్ ఫైస్ వంటగదిలోకూడా విసిగిస్తుంటే విజిటేబుల్ ఆయిల్ ఉత్తమ మార్గం. అరకప్పు వెజిటేబుల్ ఆయిల్ ను ఒక కప్పులో తీసుకుని, పూర్తిగా కవర్ చేసి టేప్ చుట్టి పెట్టాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. ఈ టేస్ కు చిక్కుకుని చనిపోయిన ఈగలును మీరు గమనిస్తారు. అవసరమైతే తిరిగి ఈ పద్దతిని ఫాలో అవ్వడం.

English summary

Home Ingredients To Get Rid Of Fruit Flies

If you think you live all alone in your house, you are probably wrong. The small insects and pests are your co-dwellers and they can make your life miserable.Cockroaches, mosquitoes, ants, flies, etc., are there to spread diseases. Have you heard about fruit flies? These are the small black flies which are mainly attracted by the vegetables and fruits in your house.
Please Wait while comments are loading...
Subscribe Newsletter