For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుస్తుల మీద పడ్డ వివిధ రకాల మరకలను తొలగించడానికి సులభ చిట్కాలు

By Super
|

శుచి, శుభ్రత మనకే కాదు బట్టలకు కూడా కావాలి.బట్టలపై మొండి మరకలను వదలగొట్టడానికి మార్కెట్‌లో రకరకాల స్టెయిన్‌ రిమూవర్‌ లిక్విడ్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే అవి ఖర్చుతో కూడినవి అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే

ఉంటుంది. బట్టలపై పడే మరకలను తొలగించడానికి ఎన్నో చిట్కాలు ఉపయోగిస్తుంటాం. ఒక్కోసారి కొన్ని మొండి మరకలు అంత త్వరగా వదలవు. సిరా, రక్తం, కాఫీ మరియు రస్ట్‌ మరకలు మొండి మరకలు. వీటిని తొలగించేటప్పుడు ఈ క్రింది చిట్కాలను పాటించి చూడండి. అయితే ఒకమరకపై పనిచేసిన చిట్కా మరొక రకమైన మరకపై పనిచేయక పోవచ్చు.

అంతే కాదు , ఇంట్లో పిల్లలుంటే , కార్పెట్స్, మ్యాట్స్, బెడ్ షీట్స్, గ్లిట్టర్, చాక్లెట్, ఐస్ క్రీమ్స్ , మట్టి, మురికి మరియు వివిధ రకాల మరకలను పట్టిస్తాయి . ఈ మొండిమరకలను తొలగించడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఈ హోం రెమెడీస్ ఉపయోగించిన తర్వాత మన్నికైన డిటర్జెంట్స్ తో దుస్తులను శుభ్రం చేయడం మంచిది . ఇలాంటి వాటిని మెషిన్ లో పెట్టడం కంటే హ్యాండ్ వాష్ చేయడం మంచిది . స్కబ్బింగ్ చేయడకంటే చేతి రుద్ది ఉతకడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా మరకలు తొలగిపోతాయి. దుస్తుల మీద పడ్డ వివిధ రకాల మరకలను ఎలా వదలగొట్టాలో చూద్దాం...

పెయింట్ మరకలు:

పెయింట్ మరకలు:

పెయింట్ మరకల మీద ఆల్కహాల్ లేదా హ్యాండ్ శాటిటైజర్ ను అప్లై చేసి 5నిముషాల తర్వాత రుద్దడం వల్ల పెయింట్ డిజాల్వ్ అయ్ త్వరగా మరకలు తొలగిపోతాయి.

ఇంక్ మరకలు:

ఇంక్ మరకలు:

ఇంక్ మరకలు తొలగించడానికి మరకల మీద హ్యాండ్ శానిటైజర్ ను అప్లై చేయాలి. తర్వాత టూత్ బ్రష్ తో బష్ చేసి , తర్వాత వెంటనే బేకింగ్ సోడా అప్లై చేసి 15నిముషాల తర్వాత , దుస్తులను వేడినీళ్ళలో డిప్ చేసి వాష్ చేయాలి.

మడ్ మరకలు:

మడ్ మరకలు:

మట్టి మరకలు మెండిగా మారిన మట్టిమరకలను తొలగించడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీ బ్లీచింగ్ పౌడర్. 2 టేబుల్ స్పూన్ల బ్లీచింగ్ పౌడర్ మరియు వాటర్ మిక్స్ చేసి మరకల మీద అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది .

కెచప్ :

కెచప్ :

దుస్తుల మీద పడ్డ కెచప్ మరకలను తొలగించడానికి వైట్ వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. మరకల మీద వైట్ వెనిగర్ ను పోసి, టూత్ బ్రష్ తో రుద్ది డిటర్జెంట్ పౌడర్ తో వాష్ చేయాలి.

చాక్లెట్స్:

చాక్లెట్స్:

దుస్తుల మీద పడ్డ చాక్లెట్ మరకలను నివారించడానికి అమ్మోనియం గ్రేట్ గా సహాయపడుతుంది. కొద్దిగా మెద్దుబారిన చాకుతో చాక్లెట్ మరకల మీద రుద్దితర్వాత నేరుగా అమ్మోనియం వేసి చేత్తో లేదా టూత్ బ్రష్ తో రుద్ది శుభ్రం చేయాలి.

జ్యూస్:

జ్యూస్:

దుస్తుల మీద ఏర్పడ్డ జ్యూస్ మరకలను నివారించడానికి అమ్మోనియం గ్రేట్ గా సహాయపడుతుంది . మొదట మరకలను నీటితో శుభ్రంగా కడిగి తర్వాత అమ్మోనియంను వేసి రుద్ది కడగాలి.

ఐస్ క్రీమ్:

ఐస్ క్రీమ్:

దుస్తుల మీద ఏర్పడ్డ ఐస్ క్రీమ్ మరకలను నివారించడంలో నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. మరకల మీద నేరుగా కొన్ని చుక్కల నిమ్మరసం వేసి చేత్తో రుద్ది తర్వాత సోప్ వాటర్ తో శుభ్రం చేయాలి.

వాంతులు:

వాంతులు:

డిటర్జెంట్ మరియు నిమ్మరసం రెండు చాలా ఎఫెక్టివ్ గా మరకలను తొలగిస్తాయి. వెంటనే మరకలను మాయం చేసే ది బెస్ట్ కాంబినేషన్

బ్లడ్ మరకలు:

బ్లడ్ మరకలు:

దుస్తుల మీద ఏర్పడ్డ బ్లడ్ మరకలను తొలగించడానికి సాల్ట్ గ్రేట్ గా సహాయపడుతుంది . దుస్తుల మీద రక్తం మరకలు పడిన వెంటనే ఆ దుస్తులను సాల్ట్ వాటర్లో డిప్ చేసి 15 నిముషాల తర్వాత వాష్ చేయాలి.

English summary

Home Remedies To Remove 9 Types Of Stains

Trying to remove stubborn stains on clothes is not an easy task, ask any mother.Though there are more than a handful of home remedies to remove various types of stains, it is only a few of them which actually work miracles in helping us get rid of the problem.To remove stains from delicate clothes, one must be careful not to tear the garment while using these remedies. Some of the ingredients to remove stains can be a little rough on the clothes, therefore, it is necessary to remove the stain gradually and over a period of time.
Desktop Bottom Promotion