For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వండే ముందు వెజిటేబుల్స్ , తినేముందు ఫ్రూట్స్ ఎలా శుభ్రం చేయాలి

By Super
|

పండ్లు కానీ, కూరగాయలు కానీ ఏవైనా సరే, భూమిలో పండిచేవి, నీటి ద్వారా లేదా ఎరువు ద్వారా లేదా మట్టి ద్వారా కొంత బ్యాక్టీరియా పండ్లు, కూరగాయాలు, ఆకుకూరల మీద చేరుతుంది. ఈ హానీ కరమైన బ్యాక్టీరియాను నివారించడానికి వాటిని ఉపయోగించే ముందు శుభ్రంగా కడిగి తర్వాత వినియోగించుకోవాలి.

అలా నీటి ద్వారా లేదా ఎరువు ద్వారా వ్యాపించిన బ్యాక్టీరియాను శుభ్రంగా తొలగించకుడా వినియోగించినట్లైతే అది ఫుడ్ పాయిజన్ కు దారితీస్తుంది. మరియు ఇతర ఆహారాల మీద కూడా చేరే అవకాశం ఉంది. కాబట్టి, మార్కెట్ నుండి తెచ్చినవి ఏవైనా సరే శుభ్రంగా కడిగి తర్వాత వండుకోవాలని తప్పక గుర్తుంచుకోవల్సిన విషయం. హానికర బ్యాక్టీరియాను తొలగించడానికి ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ ను శుభ్రపరచడానికి కొన్ని సులభ చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

How To Clean Vegetables And Fruits Naturally

వెనిగర్: పండ్లు మరియు కూరగాయల మీద చేరిన క్రిములను మరియు బ్యాక్టీరియాను నాశనం చేసే వాటిలో వెనిగర్ ఒకటి. ఒక బకెట్ లో కొద్దిగా వాటర్ నింపి, అందులో వైట్ వెనిగర్ ఒక కప్పు వేసుకోవాలి. ఆనీటిలో 5నిముషాలు ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ వేయడం వల్ల బ్యాక్టీరియా మరియు క్రిములు నాశనం అవుతాయి.

బేకింగ్ సోడా : ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ మీద చేరిన పెస్టిసైడ్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గించడంలో బేకింగ్ సోడా గ్రేట్ గా సహాయపడుతుంది . ఒక బకెట్ లో వాటర్ నింపి, అందులో ఒక 4 చెంచాలా బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి. ఈ నీటిలో వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ వేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసి, తిరిగి మంచి నీటితో కడిగి ఉపయోగించుకోవాలి. తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడవాలి.

How To Clean Vegetables And Fruits Naturally

పసుపు: పసుపులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది కూరలు, పండ్లలోని క్రిములను చాలా ఎఫెక్టివ్ గా నానశనం చేస్తుంది . పంటలను పండించే వ్యవసాయధారులు క్రిమిసంహారక మందులను ఉపయోగించడం వల్ల, ఆ క్రిమిసంహారక ముందులు పండ్లు, కూరగాయల మీద అలాగే ఉండి పోతాయి. కాబట్టి వీటికి శుభ్రంగా కడిగి ఉపయోగించుకోవడం మంచిది.

సాల్ట్ : రాళ్ళ ఉప్పు ను లేదా సాల్ట్ నీటిలో వేసి అదులో ఫ్రూట్స్ మరియు వేజిటేబుల్స్ వేసి, 10 నిముషాల తర్వాత ఈ వెజిటేబుల్స్ ను తిరిగి మంచినీటితో శుభ్రం చేయడం వల్ల క్రిమిసంహారక మందులు, క్రిములు నాశనం అవుతాయి.

How To Clean Vegetables And Fruits Naturally

వడేటప్పుడు లేదా తినేటప్పుడు తొక్కను తొలగించడం మంచిది: ఇంట్లోనే పండ్లు మరియు కూరలు నేచురల్ గా క్లీన్ చేయడానికి పెస్టిసైడల్ రిమూవల్ చిట్కాలు గ్రేట్ గా సహాయపడుతాయి. అయితే అందుకు ఎప్పుడూ వెజిటేబుల్స్ కానీ, పండ్ల మీద కానీ ఉండే స్కిన్ తొలగించి వినియోగించుకోవడం వల్ల మరింత ఎక్కువ ఆరోగ్యకరం...

English summary

How To Clean Vegetables And Fruits Naturally

How To Clean Vegetables And Fruits Naturally,Believe it or not, pesticides are present in the fruits and vegetables that we consume on a day-to-day basis. Farmers use pesticides during the cultivation of crops and, in some cases, these dangerous pesticides remain as residues on the vegetables and fruits.
Story first published: Saturday, January 23, 2016, 17:29 [IST]
Desktop Bottom Promotion