For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుస్తులు తెల్లగా మెరిసిపోవాలంటే: ఇంటి చిట్కాలు

By Super
|

సాధారణంగా ల్యాండ్రి (దుస్తులను)శుభ్రపరిచే విషయం మహిళలకు, ముఖ్యంగా గృహిణిలకు ఒక సవాలుతో కూడుకొన్నపని. ఎందుకంటే కలర్ దుస్తులు శుభ్రం చేయడం కంటే తెల్లని దుస్తులను శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. అందులోనూ ఇంట్లో పిల్లలుంటే వారి స్కూల్ యూనిఫార్మ్స్ శుభ్రంచేయడం ఒక పెద్ద పని. పిల్లలు తెల్లదుస్తుల మీద మరకలు పట్టించినప్పుడు, శ్రమ మరింత ఎక్కువ అవుతుంది. అందుకు మీరు చింతించాల్సిన అవసరం లేదు.

మీరు ఉప్పుతో పరిష్కరించగల 9 గృహ సంక్షోభాలు

మీ ఇంట్లో తెల్ల దుస్తులను మరింత ప్రకాశవంతంగా ఉంచడానికి ఇక్కడ కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలను మీరు తెల్లదుస్తులు శుభ్రంచేసేటప్పుడు వీటిని మీరు ఉపయోగించుకోవచ్చు. మీ ఇంట్లో తెల్ల దుస్తులను శుభ్రం చేయడం ఒక సాధరణ ఎంపిక. అయితే , ఆ తెల్లని దుస్తుల మీద కలర్ స్ట్రిప్స్ పడినప్పుడు, వాటిని తెల్లగా మార్చాలంటే?

కంట్లో నీళ్ళు రాకుండా ఉల్లిపాయలు తరగడం ఎలా

అందుకు కూడా మీరు బాధపడాల్సిన, ఎక్కువ శ్రమపడాల్సిన పనిలేదు. మీ తెల్లదుస్తులను శుభ్రపరచడానికి బ్లీచింగ్ కు బదులుగా తెల్లని దుస్తులు క్లీన్ గా మరియు బ్రైట్ గా చేయడానికి కొన్ని పద్దతులున్నాయి. ఆ నేచురల్ పద్దతులను పరిశీలించండి...

వెనిగర్ తో శుభ్రం చేయాలి:

వెనిగర్ తో శుభ్రం చేయాలి:

వెనిగర్ తెల్లని దుస్తులును మరింత ప్రకాశవంతంగా మరియు క్లీన్ గా ఉంచుతాయి. అందుకు మీరు చేయాల్సిందల్లా తెల్లదుస్తుల మీద పడ్డ మరకల మీద కొద్దిగా వెనిగర్ వేసి, రుద్ది తర్వాత చల్లటి నీటితో కొద్ది సమయం నానబెట్టుకోవాలి, తర్వాత సాధరణంగా మీరు శుభ్రం చేసి, వ్యత్యాసం చూడండి.

 బ్లీచింగ్ తో శుభ్రం చేయండి:

బ్లీచింగ్ తో శుభ్రం చేయండి:

ఎక్కువగా మురికి పడ్డ మరియు మరకలు పడ్డ తెల్ల దుస్తులను శుభ్రం చేయడానికి బ్లీచింగ్ మరియు డిటర్జెంట్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు పౌడర్లయొక్క మిశ్రం కలిపిన నీటిలో తెల్లని దుస్తులను 30నిముషాలు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత వేడినీటిలో వీటిని శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దుస్తులు శుభ్రంగా తయారవ్వడంతో పాటు ప్రకాశవంతంగా కనబడుతాయి.

వేడి నీళ్ళు

వేడి నీళ్ళు

తెల్ల దుస్తులను వేడి నీటిలో డిప్ చేయాలి . తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ మరియు వైట్ వెనిగర్ మిక్స్ చేయాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేస్తే దుస్తులు తెల్లగా తళతళ మెరుస్తుంటాయి.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

మీ తెల్లని దుస్తులను శుభ్రంగా మరియు క్లీన్ గా ఉంచడానికి మరో మార్గం బేకింగ్ పౌడర్. తెల్లని దుస్తులు నానబెట్టే నీటిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ ను వేసి నానబెట్టుకోవాలి. ఈ నీటిలోనే దుస్తులను శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతిని రెండు సార్లు అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసం మరో ఎఫెక్టివ్ మార్గం. ఎందుకంటే, మీ తెల్లని దుస్తులు తిరిగి తెల్లగా కొత్తవాటిలా మిళమిళ మెరవాలంటే నిమ్మరసం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . తెల్లని దుస్తుల మీద పడ్డ మరకల మీద నిమ్మరసంను చిలకరించి ఒక గంట పాటు అలాగే ఉండి తర్వాత శుభ్రమైన నీటిలో క్లీన్ చేయడం వల్ల ఫలితం మీకే తెలుస్తుంది.

 పొటాటో జ్యూస్:

పొటాటో జ్యూస్:

వైట్ కలర్ దుస్తులను మరింత ప్రకాశవంతంగా మెరిపించడానికి పొటాటో జ్యూస్ కూడా ఒకటి. ఫ్రెష్ గా ఉండే పొటాటో జ్యూస్ అప్లై చేయడం లేదా పొటాటో రసాన్ని మరకల మీద అప్లై చేసి రబ్ చేసి, డిటర్జెంట్ లో నానబెట్టి, 20 నిముషాల తర్వాత యథావిధిగా శుభ్రం చేయాలి

 డిటర్జెంట్స్

డిటర్జెంట్స్

నేచురల్ పదార్థాలను ఉపయోగించి ఈ సింపుల్ చిట్కాలను అనుసరించినట్లైతే తెల్లని దుస్తులు మరింత తెల్లగా మరియు ప్రకాశవంతంగా కనబడుతాయి. అలాగే ఎంపిక చేసుకొనే డిటర్జెంట్స్ కూడా ముఖ్యమే...

English summary

Tips To Brighten White Clothes Naturally At Home

Tips To Brighten White Clothes Naturally At Home,White clothes can easily stain and look limp over a period of time. It is, therefore, necessary for you to look after your white clothes with uttermost care. Washing them in hot or lukewarm water can help to remove the stains and dirt from the garment.
Story first published: Thursday, February 4, 2016, 13:33 [IST]
Desktop Bottom Promotion