For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో చికాకు పెట్టించే చీమలు నివారించే సింపుల్ టిప్స్ ?

By Swathi
|

ఇంట్లో చీమలు ఉన్నాయంటే.. ఆడవాళ్లకు కంగారే. ఎక్కడ ఏది పెట్టినా.. చీమలు చుట్టుముడుతాయని ఆందోళనపడాల్సి వస్తుంది. స్వీటు, స్నాక్స్, హాట్ అని తేడా లేకుండా.. అన్నింటిపైనా దండెత్తేస్తాయి చీమలు. ఎంతో ఇష్టంగా వండుకున్న ఆహారపదార్థాలకైనా.. చక్కెరకైనా.. కొనుకొచ్చిన మిక్చర్ పొట్లానికైనా.. చీమలు పట్టాయంటే.. చాలా చికాకు పుడుతుంది.

ఇంట్లో ఎక్కడ చూసినా బొద్దింకల బెడద ఎక్కువైందా ?

అయితే వాటిని వదిలించడానికి మహిళలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎంత ట్రై చేసినా.. ఇల్లు వదలవంటాయి చీమలు. వంట గది నుంచి హాలు వరకు ఎక్కడ చూసినా చీమల బెడద ప్రతి ఇంట్లో కామన్. అయితే చీమలు నివారించడానికి మార్కెట్ లో దొరికే ఫెస్టిసైడ్స్ వల్ల మనుషులకు వాసన పడకపోవడం, మార్బుల్స్, టైల్స్ దెబ్బతినే అవకాశముంది. అదే చక్కటి హోం రెమిడీస్ ఫాలో అయితే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు.

home improvement

కాఫీ:
కాఫీ వాసన చీమలకు పడదని మీకు తెలుసా ? నిజమే అందుకే చీమల చిక్కు వదిలించుకోవడానికి ఇదో చక్కటి మార్గం. కాఫీ గింజలు లేదా కాఫీ పౌడర్ లేదా.. కాఫీ వడపోసిన తర్వాత వచ్చే పొడిని గానీ చీమలు ఉన్నచోట చల్లితే.. చీమలను ఈజీగా నివారించవచ్చు.

బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే సులభ చిట్కాలు..

home improvement

పుదినా
పుదినా వాసనకు చీమలు బెంబేలెత్తిపోతాయి. కాబట్టి.. కొన్ని పుదిన ఆకులు తీసుకుని.. కాస్త ఎండనివ్వాలి. ఎండిపోయిన తర్వాత నలిపి.. పొడిని చీమలు ఉన్న ప్రాంతంలో చల్లితే.. చీమలు మాయమవుతాయి. లేదా పుదినా టీ తాగే అలవాటు ఉంటే.. ఆ టీ బ్యాగ్ చీమలున్న దగ్గర పెట్టినా ఫలితం ఉంటుంది.

home improvement

మిరియాలు లేదా నిమ్మ
బారులు బారులుగా ఉండే చీమలపై ప్రతాపం చూపించాలంటే.. మిరియాలపొడి చక్కగా పనిచేస్తుంది. చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మిరియాలపొడి చల్లతే సరిపోతుంది. చీమలు రాకుండా నిమ్మ తొక్క బాగా పనిచేస్తుంది. నిమ్మ తొక్క లేదా దోసకాయ ముక్కను చీమలు ఉండే ప్రాంతంలో పెడితే.. వాటి వాసనకు చీమలు మైల్డ్ అయిపోతాయి.

బియ్యంతో ఎప్పుడూ ప్రయత్నించని 6 ఆశ్చర్యకమైన గృహ ప్రయోజనాలు

వెనిగర్
వెనిగర్ ను కొద్దిగా స్ప్రే బాటిల్లో వేసి చీమలు తిరిగే ప్రదేశంలో స్ప్రే చేయాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు మూడు రోజులు చేస్తే చీమలు రావు. లేదా కొన్ని వేడి నీళ్లలో ఉప్పు కలపాలి. ఈ నీటిని చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చల్లటం వల్ల వెంటనే చీమలు పారిపోతాయి.

English summary

Ways To Get Rid Of Ants In The House

Ways To Get Rid Of Ants In The House. Ants can be a real problem when they get into the home. While ant traps can be an effective solution, they are not to everyone’s tastes. Here are ten great natural ways of removing ants from your home quickly and efficiently.
Desktop Bottom Promotion