For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : మీ ఇంట్లో ఉండే ఈ వస్తువులకు ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా?

కొన్ని ఏళ్ళ తరబడి వాడుతున్న వస్తువు ఏదో ఒకటి ప్రతీ ఇంట్లో ఉండటం సహజం. రెగ్యులర్ గా వాడేవే అయినా, వాటిని ఎలా వాడాలని, ఎన్నిరోజులు వాడొచ్చు అని తెలుసుకోకుండా కళ్ళు మూసుకుని తెగ వాడేస్తుంటారు.

|

కొన్ని ఏళ్ళ తరబడి వాడుతున్న వస్తువు ఏదో ఒకటి ప్రతీ ఇంట్లో ఉండటం సహజం. రెగ్యులర్ గా వాడేవే అయినా, వాటిని ఎలా వాడాలని, ఎన్నిరోజులు వాడొచ్చు అని తెలుసుకోకుండా కళ్ళు మూసుకుని తెగ వాడేస్తుంటారు.

స్టీల్ గిన్నెలు, ఇత్తడి సామాన్లు కాకుండా సాధారణంగా అన్ని ఇళ్ళల్లో అభించే కొన్ని వస్తువులకి ఎక్స్ పైరీ డేట్ అనేది ఉంటుంది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ ఆ వస్తువులని తెగ వాడేస్తుంటారు. ఇప్పుడు మీరు ఊహించని కొన్ని వస్తువులకు ఎక్స్ పైరీ డేట్ ఎప్పుడు ఉంటుందో తెలుకుందాం...

పిల్లో :

పిల్లో :

సరైన తలగడ లేకపోతే మంచి నిద్రను కోల్పోతారు. కొన్ని సార్లు మెడ నొప్పులు కూడా వస్తాయి, కాబట్టి తలగడని ప్రతి రెండు సంవత్సరాలకి మార్చాలి.

 పాదరక్షలు:

పాదరక్షలు:

ఇంట్లో లేదా ఇంటి వద్ద ధరించే చెప్పులకు అధికం శాతంలో బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి, వీటిని రెగ్యులర్ గా వాఫ్ చేసినా సరే ప్రతి ఆరు నెలలకి వీటిని మార్చాలి.

తడి టవల్స్ :

తడి టవల్స్ :

తడిగా ఉన్న టవల్స్ మీద బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. కాబట్టి, టవల్స్ ను వీలైనంత త్వరగా ఆరబెట్టాలి. అలాగే ఒక టవల్ ని సంవత్సరం కన్నా ఎక్కువ వాడకూడదు.

టూత్ బ్రెష్ లు :

టూత్ బ్రెష్ లు :

మనం రోజూ వాడే టూత్ బ్రెష్ లు కనీసం మూడు నెలకొకసారి మార్చాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు .

లోదుస్తులు:

లోదుస్తులు:

లోదుస్తులు సంవత్సరానికొకసారైనా మార్చాల్సిందే..

జాగింగ్ షూస్ :

జాగింగ్ షూస్ :

రెగ్యులర్ గా వాడే జాగింగ్ షూస్ ని ఒక సంవత్సరం కన్నా ఎక్కువ వాడకూడదు. వాటిలో ఉన్న కుషనింగ్ తగ్గిపోతుంది. కాబట్టి, జాయింట్ పెయిన్స్ వస్తాయి.

 హ్యాండ్ సానిటైజర్ :

హ్యాండ్ సానిటైజర్ :

బాటిల్ ను ఒకసారి తెరిచిన తర్వాత మూడు నెలలకన్నా ఎక్కువ పనిచేయదు. దాని పవర్ తగ్గిపోతుంది.

ఫెర్ఫ్యూమ్ బాటిల్స్ :

ఫెర్ఫ్యూమ్ బాటిల్స్ :

ఫెర్ఫ్యూమ్ బాటిల్స్ ఓపెన్ చేసిన తర్వాత కేవలం ఒకటి లేదా రెండు సంవత్సరాలు మాత్రమే పనిచేస్తాయి.

దువ్వెనలు:

దువ్వెనలు:

దువ్వెను వారానికొకసారి కనీసం 15రోజులకొకసారి శుభ్రం చేసుకోవాలి. అలాగే దువ్వెనని ఒక సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు వాడకూడదు.

 బాడీ స్పాంజ్ లేదా షవర్ పఫ్:

బాడీ స్పాంజ్ లేదా షవర్ పఫ్:

బాడీ స్పాంజ్ లేదా షవర్ పఫ్ రోజూ వేడి నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలి. అలాగే వీటిని ఆరునెలలకన్నా ఎక్కువ రోజులు వాడకూడదు.

హైడ్రోజన్ పెరాక్సైడ్:

హైడ్రోజన్ పెరాక్సైడ్:

హైడ్రోజెన్ పెరాక్సైడ్ బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత 2 నెలలు మాత్రమే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తర్వాత వాటర్ గా మారిపోతుంది. దీన్ని ఒక సంవత్సరం కంటే ఎక్కువ స్టోర్ చేసి ఉండకూడదు.

మసాలా దినుసులు

మసాలా దినుసులు

కొన్ని రకాల చెక్క, లవంగాలు, యాలకలు వంటివి ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల వాటిలోని ఆరోమా వాసన తగ్గిపోతుంది. అలాగే రుచికూడా తగ్గుతుంది. కాబట్టి, 6 నెలలకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయకూడదు.

English summary

12 Household Items You Didn't Know Had an Expiry Date..!

We always remember to check the expiration date of milk, and we know how long we should keep our beauty products. Unfortunately, we don’t pay attention to items in our house that surround us longer than they actually should.
Story first published: Thursday, January 19, 2017, 12:25 [IST]
Desktop Bottom Promotion