For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేబుల్ సాల్ట్ ను వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు

కేవలం ఆహారాల వండటానికి మాత్రమే కాదు, టేబుల్ సాల్ట్ ను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఇందులో బ్యూటిని మెరుగుపరిచే గుణాలు కూడా ఉన్నాయన్నవిషయం మీకు తెలుసా? అంతేనా టేబుల్ సాల్ట్ లో క్లీనింగ్ ఏజెంట్.

By Lekhaka
|

మన లైఫ్ లో అవాయిడ్ చేయలేనది టేబుల్ సాల్ట్. మనకు నచ్చిన ఫేవరెట్ ఫుడ్ తినాలంటే పక్కన టేబుల్ సాల్ట్ ఉండాల్సింది. చౌకైనది, టేస్ట్ ను అందించే ఒక నిత్యవసర వస్తువు. అందుకే దీన్ని అనేక సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆహారాలు టేస్ట్ గా ఉంచడం కోసం మరియు ఆహారాలను నిల్వ చేయడం కోసం ఉపయోగిస్తుంటారు .

కేవలం ఆహారాల వండటానికి మాత్రమే కాదు, టేబుల్ సాల్ట్ ను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఇందులో బ్యూటిని మెరుగుపరిచే గుణాలు కూడా ఉన్నాయన్నవిషయం మీకు తెలుసా? అంతేనా టేబుల్ సాల్ట్ లో క్లీనింగ్ ఏజెంట్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? మీకు తెలియకపోతే ఖచ్చితంగా టేబుల్ సాల్ట్ లోని సర్ ప్రైజ్ చేసే గుణాల గురించి తెలుసుకోవాల్సిందే..

మన దినచర్యలో సాల్ట్ ఒక బాగం. టేబుల్ సాల్ట్ లోని ఇతన సర్ ప్రైజ్ చేసే ఉపయోగాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. మరి టేబుల్ సాల్ట్ ను వివిధ రకాలు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం

ఉల్లిపాయ వాసన రాకుండా:

ఉల్లిపాయ వాసన రాకుండా:

ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత, వెల్లుల్లి పొట్టును తీసిన తర్వాత చేతులు ఘాటైన వాసన కలిగి ఉంటాయి. కాబట్టి, చేతులను కొద్దిగా తేమ చేసి, ఉప్పువేసుకుని, రుద్ది , రన్నింగ్ వాటర్ లో కడిగే వాసన పోతుంది

మొటిమలను నివారిస్తుంది

మొటిమలను నివారిస్తుంది

మొటిమలను నివారించడానికి సాల్ట్ వాటర్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ సాల్ట్ వాటర్ వల్ల మొటిమలు ముడుచుకుపోతాయి ఈ సాల్ట్ వాటర్ వల్లచిన్న చిన్న నోటి పుడ్లు కూడా నయం అవుతాయి.

షు వాసనను నివారిస్తుంది:

షు వాసనను నివారిస్తుంది:

షుల నుండి వచ్చే వాసన చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. ఒక క్లాత్ లో సాల్ట్ నింపి, షులో చిలకరించాలి. రెండు మూడు గంటలు అలాగే ఉంచి తర్వాత తీసేయాలి. షు వాసన రాకుండా ఉంటుంది.

హోం మేడ్ పెయింట్స్ :

హోం మేడ్ పెయింట్స్ :

ఒక కప్పు పిండిలో, ఒక కప్పు సాల్ట్, నీళ్ళు కలపాలి. అందులోనే కొన్ని చుక్కుల ఫుడ్ కలర్ కూడా మిక్స్ చేయాలి. అంతే మీ హోం మేడ్ పెయింట్ రెడీ..

ఫ్రూట్ స్లైస్ ను ఫ్రెష్ గా ఉంచుతుంది:

ఫ్రూట్ స్లైస్ ను ఫ్రెష్ గా ఉంచుతుంది:

టేబుల్ సాల్ట్ వల్ల మరో బెస్ట్ బెనిఫిట్ పండ్ల ముక్కలను ఫ్రెష్ గా ఉంచుతుంది. కట్ చేసిన పండ్ల ముక్కల మీద కొద్దిగా టేబుల్ సాల్ట్ ను చిలకరించాలి. ఇలా చేయడం వల్ల పండ్ల ముక్కలు ఎలాంటి రంగు మారకుండా రిఫ్రెష్ గా ఉంచుతాయి.

నేచురల్ రూమ్ ఫ్రెష్నర్ :

నేచురల్ రూమ్ ఫ్రెష్నర్ :

అరకప్పు టేబుల్ సాల్ట్ తీసుకుని, అందులో గులాబీ రేకులను వేయాలి. వీటితో పాటు మీకు నచ్చిన ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. దీన్ని మరింత నేచురల్ గా మార్చడానికి సాల్ట్ ను ఆరెంజ్ మీద చిలకరించి ఒక మూలన పెట్టాలి.

షింక్ మెరవడానికి :

షింక్ మెరవడానికి :

ఖరీదైన క్లెన్సర్ జోలికి పోకుండా. షింక్ క్లీన్ గా , కొత్తగా మెరిపించడానికి టేబుల్ సాల్ట్ గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసంలో కొద్దిగా టేబుల్ సాల్ట్ వేసి షింక్ ను తుడవాలి. టేబుల్ సాల్ట్ షింక్ ను శుభ్రం చేయడంమాత్రమే కాదు, ఇది షింక్ కొత్తదానిలా మెరిపిస్తుంది.

ఫైయర్ ఎక్స్టింగ్విషర్ లా పనిచేస్తుంది :

ఫైయర్ ఎక్స్టింగ్విషర్ లా పనిచేస్తుంది :

అవును, ఉప్పు ఫైయర్ ఎస్టింగ్విషర్ లా పనిచేస్తుంది. వంట చేసేప్పుడు నూనె వల్ల ఏదైనా సెడెన్ గా మంట వస్తే వెంటనే ఉప్పు చిలకరిస్తే తగ్గిపోతుంది.

ఐరన్ బాక్స్ క్లీనింగ్ :

ఐరన్ బాక్స్ క్లీనింగ్ :

పాతబడిన చిలుంపట్టిన ఐరన్ బాక్స్ లను రీప్లే చేయడానికి ముందు టేబుల్ సాల్ట్ ను చిలకరించి బ్లౌన్ పేపర్ లేదా ఉడెన్ సర్ఫేస్ తో రుద్దితో త్రుప్పు వదిలిస్తుంది.

వెండి వస్తువులను మెరిపిస్తుంది:

వెండి వస్తువులను మెరిపిస్తుంది:

ఇంట్లో వెండి వస్తువులున్నట్లైతే వాటిని టేబుల్ సాల్ట్ తో రుద్దితే మెరుస్తుంటాయి. వెనిగర్, టేబుల్ సాల్ట్, మైదా మూడు మిక్స్ చేసి రుద్దాలి.

దోమల కుట్టడం నివారిస్తుంది

దోమల కుట్టడం నివారిస్తుంది

నీళ్లలో ఒక చిటికెడు టేబుల్ సాల్ట్ ను వేసి దోమలు కుట్టిన ప్రదేశంలో ఆ నీటితో తుడిచినా లేదా కడిగినా వేగంగా ఉపశమనం కలుగుతుంది.

డిప్ ప్రీ క్యాండిల్స్

డిప్ ప్రీ క్యాండిల్స్

నైట్ డిన్నర్ స్పెషల్ అట్రాక్షన్ ఉండాలంటే, క్యాండిల్స్ ను టేబుల్ సాల్ట్ సొల్యూషన్లో డ్రింప్ చేయాలి. అయితే ఇలా డిప్ చేసిన క్యాండిల్స్ వెలిగించానికి ముందు బాగా డ్రై చేయాలి. ఎండ బెట్టాలి.

English summary

12 Surprising Uses Of Table Salt That You Never Knew

Read to know what are the wonderful uses of table salt that can actually make your life much more easier.
Desktop Bottom Promotion