For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాషింగ్ మెషీన్ ను శుభ్రపర్చటానికి 5 స్టెప్స్

|

మీరు చింతించాల్సింది ఉతికే బట్టల గురించి మాత్రమే కాదు. మీ వాషింగ్ మెషీన్ పరిస్థితి గురించి కూడా ఆలోచించండి. కొన్నప్పటి నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు దీన్ని శుభ్రపరిచారు?


మనలో చాలామంది అసలు మెషీన్లను శుభ్రపర్చటమే పట్టించుకోరు. క్రిములు మన వాషింగ్ మెషీన్ పై కూడా దాడి చేస్తాయని గుర్తుంచుకోండి.మీకు మీ మెషీన్ ఇంకొంతకాలం ఎక్కువ పనిచేయాలని ఉంటే, దాన్ని కూడా శుభ్రపరుస్తూ ఉండండి. మీ మెషిన్ ను సరైన ఆకారంలో ఉంచడానికి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి.

వాషింగ్ మెషీన్ ను శుభ్రపర్చటానికి 5 స్టెప్స్

డిటెర్జెంట్ పోసే పాత్ర – ఇదే మెషీన్ మొత్తంలో మురికైన ప్రదేశం. చాలాకేసుల్లో, ఇది మిగిలిపోయిన సర్ఫ్ పౌడర్ పేరుకుపోయి లేదా ఫంగస్ చేరి ఉంటుంది. మీకు వీలైతే, ట్రేను బయటకి తీసేయండి. పాత టూత్ బ్రష్ తో మరియు అంట్లుతోమే సబ్బుతో దాన్ని కూడా శుభ్రంగా కడగండి.
వాషింగ్ మెషీన్ ను శుభ్రపర్చటానికి 5 స్టెప్స్

ఫిల్టర్ – ఫిల్టర్ లను క్రమం తప్పకుండా ఖాళీ చేస్తూ ఉండాలి. ఇక్కడే మురికి మరియు మిగిలిపోయిన పదార్థాలు నిండివుంటాయి.

వాషింగ్ మెషీన్ ను శుభ్రపర్చటానికి 5 స్టెప్స్


డ్రమ్ – డ్రమ్ వాష్ మోడ్ లో మెషీన్ ను పెట్టి, మామూలు వేడి నీరు కానీ, వంటసోడాతో కానీ కడగండి. వేడి నీరు మెషిన్ అంచుల్లో, లోపల మధ్యలో ఎక్కడైనా ఇరుక్కున మురికిని తొలగిస్తుంది.

5 Steps to a Cleaner Washing Machine

వాసన – ప్రతిసారీ వాడిన తర్వాత మెషీన్ ను తెరచే ఉంచండి. గాలి ఫ్రీగా తిరుగుతుంటే, ఏ సూక్ష్మక్రిములు చేరకుండా ఉంటుంది. వాసనకూడా రాదు.

వాషింగ్ మెషీన్ ను శుభ్రపర్చటానికి 5 స్టెప్స్

సరైన డిటెర్జెంట్- ద్రవ రూపంలో ఉన్న డిటర్జెంట్లకి దూరంగా ఉండండి, ఎందుకంటే అవి ఎక్కువ నురగను, ఎక్కువ సబ్బును పేరుకునేలా చేస్తాయి. పౌడర్ రూపంలోని డిటర్జెంట్లు మంచివి. ఏవి ఎంత వాడాలో, ఏ మెషీన్ కి ఏ రకపు డిటర్జెంట్లు సరిపోతాయో తెలుసుకుని అవే వాడండి. ఉదాహరణకి చేత్తో వేసుకునే వాషింగ్ మెషీన్ కి మొత్తం ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ కి వాడాల్సిన పౌడర్ ను వాడకండి మరియు రివర్స్ గా కూడా చేయవద్దు.


క్రిములను వెతకాలంటే వాషింగ్ మెషీన్లు ఆఖరిప్రదేశాలు అని ఎవరన్నారో కానీ అది తప్పు. మా ఈ చిట్కాలతో మీ మెషీన్లో క్రిములను చంపేయండి.

English summary

5 Steps to a Cleaner Washing Machine

It’s not only washing clothes that you have to worry about. You also should worry about the state of your washing machine.How many times have you cleaned it since you bought it? Most of us don’t bother to clean our machines. Don’t forget that germs also infest our washing machines.If you want your machine to last a while and also spruce it up, here are a few steps that can get your machine back in shipshape
Desktop Bottom Promotion