For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో తేనెటీగలను వదిలించుకోవడానికి మంచి బెస్ట్ హోం రెమెడీస్

తేనె పట్టును తొలగించడం చాలా కష్టమైనపని. వాటిని తొలగించే ముందు, తేనెటీగలను తొలగించేటపుడు మీరు భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని తగినంత పరిశీలించాలి. మీరు తేనె పట్టును నాశనం చేయడం లేదా తొలగించడానిక

By Lekhaka
|

తేనెటీగలు చుట్టూ సందడి చేస్తూ, తేనెను పీలుస్తూ తిరుగుతూన్నపుడు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, ఈ చిన్ని కీటకాలు మనం నివసించే ప్రదేశంలో భవనం కట్టినపుడు, మరింత భయంగా ఉంటుంది. ఇక్కడ, మేము ఈ కీడును పరిష్కరించి సహాయం చేయడానికి తేనెటీగలను వదిలించుకోవడానికి కొన్ని గృహ వైద్య జాబితాను పొందుపరిచాము.

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో లేదా కొంతమంది ప్రకారం, ఇళ్ళలో తేనెపట్టు పెట్టడం అదృష్టంగా భావిస్తారు. ఇంట్లో తేనెటీగలు ఎగురుతుంటే, దానర్ధం అది ఒక మంచి వార్తను లేదా సంపదను తెస్తుందని అంటారు.

ఇంత మూఢనమ్మకాలూ వ్యాప్తి చెందినప్పటికీ, చాలామంది వాటి వల్ల సాధారణ జీవితానికి ఇబ్బంది కలుగుతుందని తేనెటీగలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు.

Best Home Remedies To Get Rid Of Honey Bees

ఇది చిన్న పిల్లలకు, అలర్జీ ధోరణి ఉన్న వారికి చాలా ప్రమాదం. తేనెటీగలు పర్యావరణ వ్యవస్థలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తాయి, వాటిని చంపక పోవడమే మంచిది. ఎలుకలు, దోమలు లా కాకుండా, తేనెటీగలు తక్కువ ప్రమాదకారి.

కానీ తేనె పట్టును తొలగించడం చాలా కష్టమైనపని. వాటిని తొలగించే ముందు, తేనెటీగలను తొలగించేటపుడు మీరు భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని తగినంత పరిశీలించాలి. మీరు తేనె పట్టును నాశనం చేయడం లేదా తొలగించడానికి ప్రయత్నించే టపుడు, మీరు తగు రక్షణను ఇచ్చే వస్త్రాలను, మాస్క్ లను ధరించడం మంచిది.

ఇక్కడ, ఈ ఆర్టికిల్ లో, మేము తేనెటీగలను వెళ్ళగొట్టే కొన్ని చిట్కాల జాబితాను ఇచ్చాము, వీటితో మీరు తేలికగా వాటిని వదిలిన్చుకోవడానికి సహాయడతాయని మేము ఆశిస్తున్నాము. అందువల్ల, వాటిని ఒకసారి గమనించండి.

సబ్బు నీళ్ళు:

సబ్బు నీళ్ళు:

సబ్బు నీళ్ళు తేనెటీగలను వదిలించుకోవడానికి ఉపయోగించే అద్భుతమైన గృహ వైద్యం. ఒక వంతు లిక్విడ్ సోపు, 4 వంతుల నీటిలో బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని చెట్లకు స్ప్రే చేసే సీసాలో పోయండి. దీనిని తేనె పట్టు మీద స్ప్రే చేసే ముందు మీ వంటిమీద దుస్తులు తప్పనిసరిగా ధరించండి.

వెనిగర్:

వెనిగర్:

తేనెపట్టును వదిలించుకోవడానికి అద్భుతంగా పనిచేసే మరో గృహ వైద్యం వెనిగర్. ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ను ముప్పావు వంతు నీటిలో కలిపి స్ప్రే బూటిల్ లో పోయండి. దాన్ని తేనెపట్టు మీద స్ప్రే చేయండి. ఈ చిట్కా వాటిని కదలకుండా బిగించేసి, ఆ వాసనకు ఊపిరాడకుండా చేస్తుంది.

మొత్ బాల్స్:

మొత్ బాల్స్:

అవును, ఎటువంటి నిపుణుడిని పిలవకుండానే ఈ మోత్ బాల్స్ ద్వారా తేనెపట్టు ను తొలగించ వచ్చు. మీ ఇంట్లో ఈ మోత్ బాల్స్ ని తేనెపట్టు వద్ద వేలాడ తీయండి. ఒక సాక్ లేదా పాత నైలాన్ బట్టలో ఈ మోత్ బాల్స్ ను ఉంచి తేనెపట్టు వద్ద వ్రేలాడ తీయండి.

సోడా పాప్:

సోడా పాప్:

మీకు ఒక సోడా సీసా, మౌంటెన్ డ్యూ లేదా స్ప్రైట్ వంటి సీట్ సోడా అవసరం. ముందు పాత సోడా సీసాను సగానికి కోయండి. తరువాత, దాన్ని స్వీట్ సోడాతో నింపి మీ కారిడార్ లో లేదా తోటలో ఉంచండి. ఈ స్వీట్ సోడా వాసన తేనెటీగలను ఆకర్షించి, అవి ఆ ద్రవంలో పడేట్టు చేస్తుంది.

జాపర్:

జాపర్:

మీరు ఎప్పుడైనా జాపర్ ని చూసారా? ఇది కీటకాలను చంపడానికి ఉపయోగించే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది సూపర్ మార్కెట్లలో, చివరికి కిరాణా కొట్లో కూడా దొరుకుతుంది. మీరు ఒక జాపర్ ను కొని, తేనెపట్టు దగ్గర ఉంచండి అదే మీరు చేయాల్సింది. తేనెటీగలు ఆ గట్టి మెటీరియల్ కి అంటుకుని, ఎగరడానికి వీలులేకుండా పోతుంది.

వెల్లుల్లి పొడి:

వెల్లుల్లి పొడి:

ముందే సూచించినట్టుగా, తేనెటీగలు సువసనకు ఆకర్షితు లౌతాయి. అవి గాఢమైన వాసనలను ప్రతిఘటించ గలుగుతాయి. తేనెటీగలను పోగొట్టడానికి వెల్లుల్లి పొడి మంచి చిట్కా. తేనెపట్టు దగ్గరగా వెల్లుల్లి పొడిని చల్లండి. అవి ఆ పొడిని పీల్చక నివాసానికి చేరలేవు ఎందుకంటే ఆ గాఢమైన వాసన మీ ఇంటి నుండి వాటి కాలనీకి మారిపోతుంది.

English summary

Best Home Remedies To Get Rid Of Honey Bees

Even though all these superstitious beliefs prevail, most of us try to get rid of honey bees when they are a threat to our normal living.
Desktop Bottom Promotion