For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందూ దేవుళ్ళ వాహనాలు ఇవే...!

|

హిందు మతంలో కొన్ని జంతువులు మరియు పక్షలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. జంతువులు ఎలా ప్రాతినిధ్యం వహిస్తాయంటే గణేషుడు(ఏనుగు), హనుమంతునికి(కోతి)ఇలా ఉన్నాయి. అలాగే హిందువులు చాలా పవిత్రంగా చూసే గోమాత(ఆవు). ఆవు కూడా అథితి, అంటే అర్ధం‘దేవుళ్ళ కు తల్లి'గా భావిస్తారు. హిందుమతం యొక్క పురాణాల్లో, ఆవును అన్ని దేవుళ్ళకు తల్లిగా భావిస్తారు. దేవతలు లలితా సహస్రనామం స్తోత్రం చేసినపుడు అమ్మవారిని గోమాతగా సంబోధించారని పురాణాలు పేర్కొంటున్నాయి. మనకు తల్లి ఎంతో- గోమాత కూడా అంతే సమానంగా భావించాలి. గోవు తన బిడ్డలకే గాక మానవులకు సైతం పాలు ఇచ్చి మాతృత్వాన్ని చాటుతుంది. ఈ కారణంగానే గోవులను దానం చేసే ఆచారం ప్రారంభమైంది. గోదానం చేసేవారికే గాక, వాటిని స్వీకరించిన వారికి కూడా మేలు జరుగుతుంది. కుటుంబంలో ఏ ఒక్కరు గోదానం చేసినా ఆ కుటుంబంలో అందరికీ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతుంటారు.గోమాత శరీరంలో సకల దేవతలూ ఆవాహనై ఉంటారు.

దక్షిణ భారత ఆలయాల్లో మీద లేదా గోపురాలు దేవతలు లేదా జంతువులతో చెక్కబడ్డాయి. హిందుమత పురాణంలో జంతువులను ప్రత్యక్షంగాను లేదా దేవుళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పబడింది. సాధారణంగా కొన్ని రకాల జంతువులను కొందరు హిందూ దేవుళ్ళకు వాహనాలుగా పేర్కొన్నారు. చాలా మంది ఈ జంతువులను దేవుళ్ళకు వాహనాలగా మాత్రమే తెలుసు. కానీ వారు(ఆ జంతువులు)ఏదోఒక అపజయాన్ని ఎదుర్కోవడం వల్ల అలా మారాల్సి వచ్చిందని లేదా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని పురాణాలు చెబుతున్నాయి. దేవుళ్ళు మరియు దేవతల యొక్క వాహనాల ఎల్లప్పుడు మానవులకు సంబంధించినవిగా వర్ణించబడ్డాయి.

కొందరు దేవుళ్ళకు వాహనాలుగా బాగా ప్రసిద్దిచెందిన కొన్ని జంతువులు మరియు పక్షులను చూద్దాం....

దేవుళ్ళకూ వాహనాలుండేవి...!

ఎలుక: ఎలుక గణేషుని యొక్క వాహనం అని పిల్ల పెద్దలందలందరికి తెలిసిన విషయమే. ఎలుక వినాయకుని వాహనంగా పూజలందుకొనేది బహు తక్కువ. మానవులు ఎలుకను సహజంగా శత్రువుగా చూస్తారు. కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట, నష్టాలను అనుభవించుటవలన.

దేవుళ్ళకూ వాహనాలుండేవి...!

ఎద్దు లేదా బసవన్న(నంది): శివుడి యొక్క సంరక్షకుడు మరియు వాహనంగా ప్రసిద్ది. నంది శివుని వాహనము. శివాలయము నందు మరియు ప్రతి హిందూ దేవాలయము నందు దేవునికి అభిముఖముగ వున్న ఎద్దు ఆకారమే "నంది" నంది కొమ్ముల మద్య నుండి భగవంతుడి ని చూచిన భగవంతుని కృప కలుగునని ప్రతీతి.

దేవుళ్ళకూ వాహనాలుండేవి...!

పులి: హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత పార్వతి దేవి. పులి దుర్గా దేవికి వాహనం. కొన్ని సందర్బాల్లో సింహంగా కూడా చూపెడుతుంటారు.

దేవుళ్ళకూ వాహనాలుండేవి...!

నెమలి: హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. సరస్వతి హ౦స వాహన౦పై, మయూర వాహన౦పై కూర్చున్నట్లు కనిపిస్తు౦ది. జ్నాన ప్రధాన దేవతలను మయూర వాహన౦గా ఆరాధిస్తారు అని తెలుస్తున్నది. హ౦స శబ్ద శక్తికి, ప్రాణ శక్తికి స౦కేత౦. నెమలి యజ్నశక్తికి స౦కేత౦. యోగశాస్త్ర౦లో శ్వాసకు హ౦స అనే పేరు ఉన్నది.

దేవుళ్ళకూ వాహనాలుండేవి...!

గుడ్లగూబ: లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూబ. లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి.

దేవుళ్ళకూ వాహనాలుండేవి...!

హంస: బ్రహ్మ దేవుని యొక్క వాహనం హంస. ఈ పక్షికి పాలు మరియు నీరు వేరు చేయు అధికారం కలిగి ఉన్నదని ప్రసస్థి. ఈ పక్షి నిఘా మిరయు వివక్షతను సూచిస్తుంది.

దేవుళ్ళకూ వాహనాలుండేవి...!

గరుడ(గ్రద్ద): అన్నిపక్షులకు గరుడు అధిపతి. గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడినది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది. అవతారపురుషుడు, మోక్షాన్ని ప్రసాదించే విష్ణుమూర్తికి వాహనుడైన గరుడభగవానుడిని దర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.

దేవుళ్ళకూ వాహనాలుండేవి...!

ఏనుగు/ఐరావత: ఏనుగు ఇంద్రుని యొక్క వాహనం. సురుల ప్రభువైన ఆ మహేంద్రుని వాహనము ఏనుగు, దాని పేరు ఐరావతము. ఏనుగు విశ్వసనీయత, గౌరవం, అధికారం, రాయల్టీ మరియు ఫ్రైడ్ నుసూచిస్తుంది.

దేవుళ్ళకూ వాహనాలుండేవి...!

మొసలి: పచ్చని వర్ణంలో ఉండి, బంగారు కత్తి ధరించి పాముతో తయారయిన 'ఉచ్చు' లేదా 'పాశం' ఒక చేత పట్టుకుని, మొసలి మీద కూర్చుని స్వారీ చేస్తూ దర్శనమిస్తాడు. ఆయనే వరుణుడు. వేద కాలంలో వరుణుడిని ఆకాశానికి, నీటికి అధిపతిగా కొలిచేవారు. సృష్టికి నాశనం చేసే అంశాల కంటె అభివృద్ధి చేసే అంశాలే వరుణుడిలో ఎక్కువ. వేదాల ప్రకారం... వరుణుడు స్వర్గాన్ని, భూమిని, గాలిని సృష్టించాడు. వానలు కురవడానికి, నదులు ప్రవహించడానికి, గాలి వీచడానికి ఈయనే కారకుడు. మొసలి గౌరవం, శక్తి, వేగం, శక్తి, జిత్తులమారి మరియు ధైర్యాన్ని సూచిస్తుంది.

దేవుళ్ళకూ వాహనాలుండేవి...!

గుర్రము/అశ్వం: గుర్రం ఆది దేవుడు లేదా సూర్య దేవుని యొక్క వాహనం. ఈ అశ్వం ఏడు ఇంద్రధనుస్సుల రంగులను సూచిస్తుంది. ఆది దేవుడు ఏడు గుర్రాల మీద స్వారి చేస్తారు.

English summary

Animals n Birds: Hindu Deities Vehicle | దేవుళ్ళకూ వాహనాలుండేవి...!

Animals and birds play an important role in Hindu religion. The representation of animals are Lord Ganesha (Elephant God)and Hanuman, (Monkey God). Hindus are known to respect cow as it is considered to be extremely sacred. Cow is also known as Aditi, meaning 'Mother of Gods'. In Hindu mythology, the cow is considered the mother of all including Gods and humans. Every part of the cow holds religious symbolism; the horns symbolize the Gods, legs represent each of the Himalayan mountains and her face represents the sun and the moon.
Story first published: Wednesday, February 27, 2013, 16:27 [IST]
Desktop Bottom Promotion