For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భగవంతుడైన రాముడు ఎలా పరమపదించాడు?

|

రాముని జీవన ప్రయాణమార్గంలో అనేకమైన అసంఖ్యాక అవరోధాలు మరియు పరీక్షలు ఉన్నప్పటికీ, బలమైన మరియు శక్తివంతమైన ధర్మమార్గాన్ని ఎంచుకున్నాడు.. దేనికి జంకని ధృఢ సంకల్పంతో ధర్మమార్గంలోనే నడిచాడు మరియు ఏ అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా మంచి మార్గాన్ని విడువక పోవటం అతన్ని సంపూర్ణ పురుషుడిగా చేశాయి. రాముడి జీవితంలో ఎదుర్కొన్న కఠినమైన పరీక్షల గురించి అందరికి తెలిసి ఉండవొచ్చు కాని , రాముడు ఏ విధంగా పరమపదించాడు అన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే ఉన్నది.

రాముడు, విష్ణువు అవతారమని హిందూయిజం వివరిస్తున్నది. విష్ణుఉ యొక్క అవతారాలు సాధారణ, నైతిక మార్గాల ద్వారా మరణము పొందరు. రాముడు స్వచ్ఛందంగా సరయు నది ప్రవేశించి వైకుంఠానికి వెళ్ళాడని కొంతమంది నమ్ముతారు. పద్మపురాణం, రాముడి మరణంగురించి వివరించటానికి ప్రయత్నించింది.. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే చదవండి.

How Did Lord Rama Die?

రాముడు 11,000 సంవత్సరాలు స్థిరమైన పాలన అందించాడు. అతని ఏకైక ఉద్దేశ్యం ధర్మాన్ని పునరుద్హరించటం లేదా ప్రజలు సుఖసంతోషాలతో జీవించటానికి మార్గాన్ని చేకూర్చటం. అతని పాలన తర్వాత, ఆయన కుమారులు, లవుడు మరియు కుశుడు వారి తండ్రిగారి మార్గంలోనే పరిపాలించారు. ఆయన పాలన శకం పూర్తిఅయిన తర్వాత, సీతా దేవి, రాముడు భార్య, ఆమె తల్లి అయిన భూదేవి దగ్గరికి తిరిగి వెళ్లిందని ఒక నమ్మకం.

ఇప్పుడు, ఇక్కడ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఉన్నది. ఒక రోజు ఒక యోగి వచ్చి రామునితో అంతరంగికంగా చాలా ముఖ్యమైన సంభాషణ జరపాలని కోరుకున్నాడు. రాముడు,మరియు యోగి గదిలోనికి ప్రవేశించి, లక్ష్మణుడికి ఎవరిని గదిలోనికి అనుమతించరాదని మరియు ద్వారం వొద్దనే కాపలాగా ఉండమని ఆజ్ఞాపించాడు.

ఆ యోగి ఎవరో కాదు 'కాలుడు', రాముడు మరియు ఆ యోగి రాముని యొక్క చివరిదశ గురించి సంభాషణ జరిపారని ఒక నమ్మకం. ఆ యోగి రామునితో, భూమిపై ఆయన చేపట్టిన కార్యం పూర్తి అయిందని మరియు తిరిగి వైకుంఠమ్ చేరుకునే సమయం ఆసన్నమయినదని చెప్పాడు. ఇంకా రాముడు దైవవంశానికి చెందినవాడని కూడా వెల్లడిచేశాడు.

ఈ సమయంలోనే, దుర్వాసముని, ఉద్రేక స్వభావంగల ఒక యోగి, రాముడిని కలవాలనుకున్నాడు. లక్ష్మణుడు నిరాకరించేసరికి, దుర్వాసుడు ఆగ్రహం చెంది, అయోధ్య నగరానికి శాపం ఇస్తానని హెచ్చరించాడు. లక్ష్మణుడు అయోధ్య నగరవాసుల రక్షణార్ధం, తన ప్రాణం అపాయంలో పడుతుందని తెలిసి కూడా దుర్వాసుడిని అనుమతించటానికి నిశ్చయించుకున్నాడు. అయోధ్య నగరాన్ని రక్షణార్థం తనకు కలిగే శిక్షను కూడా లెక్కచేయలేదు.

లక్ష్మణుడితో దుర్వాసముని, అతడిని 'కాలుడిగా' గదిలోకి వెళ్ళమన్నాడు. దుర్వాసుని ఆజ్ఞ ప్రకారం, లక్ష్మణుడు కాలుడి రూపంలో గదిలోనికి ప్రవేశించాడు. రాముడు తన సోదరుడు వొచ్చిన కారణం తెలుసుకుని సరయు నదిలోనికి అడుగు పెట్టటానికి నిశ్చయించుకున్నాడు మరియు అవతారం చాలించాడు.

Desktop Bottom Promotion