For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కృష్ణాష్టమి 2019 : కృష్ణుడి రాసలీలల గూర్చి ఆశ్చర్యకరమైన అపోహలు: జన్మాష్టమి స్పెషల్

|

శ్రీకృష్ణుడు పుట్టినరోజున జన్మాష్టమి వేడుకను జరుపుకుంటారు. లార్డ్ కృష్ణ మథుర నగరంలో జన్మించాడు. యమునా నదికి అవతల వైపున గోకులం అనే ఒక చిన్న గ్రామం ఉంది. లార్డ్ కృష్ణ బృందావనం, గోకులం వంటి ప్రదేశాలలో ఆయన లీలలను చూపారు. బృందావనంలో అయన రాధ మరియు గోకులంలోని గోపికలతో రాసలీలలను ప్రదర్శించారు. ఇది ఆయనకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి.

భగవంతుడైన కృష్ణుడి యొక్క బృందావనాన్ని శ్రీ బ్యాంకే బిహారీ అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజు వరకు కూడా,శ్రీ బ్యాంకే బిహారీ ప్రదేశం దగ్గరకు కృష్ణుడు వచ్చి గోపికలతో రాసలీలలను ప్రదర్శిస్తారని నమ్ముతారు. బృందావనంలో ఒక చిన్నవనం ఉంది. దీనిని నిధివాన్ అని పిలుస్తారు. స్థానికులు లార్డ్ కృష్ణ ఈ ప్రదేశానికి ప్రతి రాత్రి వచ్చి అతని దివ్య వేణువును ఊదుతారని నమ్ముతారు. ఆ ట్యూన్ తో అక్కడ ఉన్న చెట్లు,తోటలు మానవులుగా మారి డాన్స్ చేస్తాయి. అవి తిరిగి ఉదయం మాములుగా మారిపోతాయి.

నిజానికి బృందావనం అంతా శ్రీకృష్ణుడి ఉనికి ఉంటుంది. దాని గురించి తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాకుండా నిధివాన్ కి వచ్చి ప్రార్థన చేసుకొని కోరికలు కోరుకుంటే కోరికలు నెరవేరతాయని నమ్మకం. కానీ కృష్ణుడు నిజంగా ప్రతి రాత్రి నిధివాన్ కి వస్తాడా? దానికి రుజువు ఏమిటి?

నిధివాన్ మరియు కృష్ణుడు యొక్క రాసలీలలు గురించి ఆశ్చర్యకరమైన రహస్యాలను కనుగొనేందుకు దీనిని చదవండి.

నిధివాన్: మిస్టరీ ఫారెస్ట్

నిధివాన్: మిస్టరీ ఫారెస్ట్

నిధివాన్ అనేది ఆకారంలో విచిత్రముగా ఉన్న చిన్న చిన్న ఆకుపచ్చని చెట్లతో నిండిన ఒక చిన్న వనము అని చెప్పవచ్చు. ఈ చెట్ల కొమ్మలు ఒకదానితో ఒకటి చిక్కుకొని ఉంటాయి. వాటిని దగ్గరగా పరిశీలిస్తే,అవి కూడా మానవ ఆకారంలో కనబడతాయి. సాయంత్రం 8 గంటల తర్వాత మానవులకు ఈ అటవీ ప్రాంతంలోకి ప్రవేశం లేదు. నిజానికి,జంతువులు కూడా సాయంత్రం తర్వాత ఈ అడవి సమీపంలోకి వెళ్ళవు. సూర్యాస్తమయం తర్వాత ఆ ప్రదేశానికి ఎవరైనా వెళ్ళితే వారు గుడ్డి,చెవిటి,మూగ లేదా చనిపోవటం జరుగుతుంది.

ఈ చెట్ల మిస్టరి

ఈ చెట్ల మిస్టరి

నిధివాన్ లో చెట్లు ఒక విచిత్రమైన లక్షణం కలిగి ఉంటాయి. చెట్లు అన్ని ఒకదానిని ఒకటి కౌగలించుకోవటం మరియు ఒకదానితో ఒకటి చిక్కుకొని ఉండటం గమనించవచ్చు. వాస్తవానికి ఈ చెట్లను సాయంత్రం తర్వాత ప్రాణం వచ్చిన గోపికలు లేదా కృష్ణుడి ఆడ స్నేహితులు అని నమ్ముతారు. వారు రాత్రంతా లార్డ్ తో నృత్యం మరియు ఆటలు ఆడుకుంటారు. మళ్ళీ ఉదయం, అవి చెట్లుగా మారిపోతాయి. చెట్లలో డ్యాన్స్ స్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రతి రోజు వాటి ఆకారాలు మారటం కనపడుతుంది.

కృష్ణుడి పిల్లనగ్రోవి

కృష్ణుడి పిల్లనగ్రోవి

ప్రసిద్ధ పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుని ప్రతి రాత్రి బృందావనం వచ్చి వేణువు ఊదుతారు. అక్కడి ప్రజలు అడవి నుండి వస్తున్న ఫ్లూటు యొక్క దివ్య ధ్వనిని విన్నామని చెప్పారు.

కృష్ణుని లీలలు

కృష్ణుని లీలలు

ప్రతి రోజూ సాయంత్రం పూజారులు రెండు టూత్ బ్రష్ లను ఉంచుతారు. నిధివాన్ లో ఒక గుడిసెలో ఒక కూజాలో పవిత్రమైన నీరు మరియు స్వీట్స్ పెడతారు. వారు సాయంత్రం హారతి తర్వాత పడుకుంటారు. వారు ఉదయం లేచిన తర్వాత చూస్తే ఆ వస్తువులను ఉపయోగించినట్లు కనిపిస్తుంది.

రాధా కృష్ణుల విశ్రాంతి స్థలం

రాధా కృష్ణుల విశ్రాంతి స్థలం

నిధివాన్ కి రాధా కృష్ణులు వారి రాస లీలల కోసం మరియు విశ్రాంతి కొరకు ప్రతి రోజు రాత్రి వస్తారని భావిస్తారు.

English summary

Janmashtami Special: Shocking Myths About Krishna's Raas Leela

The band of Lord Krishna is called Sri Banke Bihari. Even to this day, it is believed that Lord Krishna would come to the place of Sri Banke Bihari and show the rasali with gopis. There is a small boat in Vrindavan. This is called Nidhiwan. The locals believe that Lord Krishna would come to this place every night and blow his divine flute. With that tune, the trees and gardens in there become human and dance. They are back to normal in the morning.
Desktop Bottom Promotion