For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జన్మాష్టమి స్పెషల్: కృష్ణుడు ఎలా మరణించారో తెలుసా?

|

హిందూ మత పురాణంలో అనేక రహస్య కథలు ఉన్నాయి. వాటి గురించి మనకు కొంత మాత్రమే తెలుసు. లార్డ్ కృష్ణుడు యొక్క మరణం గురించి అనేక కధలు ఉన్నాయి. కృష్ణుడు ఎలా జన్మించారో మనందరికీ తెలుసు. కానీ కృష్ణుడు మరణం గురించి మీకు తెలుసా? దాని గురించి తెలుసుకోవటానికి ఈ వ్యాసాన్ని చదవండి.

మహాభారతం యుద్ధం తరువాత, చివరగా దుర్యోధనుడు చనిపోయిన తర్వాత,అతని తల్లి గాంధారి పూర్తిగా వినాశనంను చూసేను. ఆమె మిగిలిన కుమారులను ఓదార్చటానికి యుద్ధభూమికి వెళ్ళెను. ఆ సమయంలో లార్డ్ కృష్ణ మరియు పాండవులు కూడా వచ్చెను. ఆమె కుమారులు చనిపోయిన శోకంను అధిగమించడానికి గాంధారి 36 సంవత్సరాల తర్వాత నీవు చనిపోతావని కృష్ణున్ని నిందించెను. తనకు శాపం పెట్టినందుకు కృష్ణుడు నవ్వెను. సరిగ్గా 36 సంవత్సరాల తర్వాత ఒక వేటగాడి చేతిలో ముగింపు ఉంటుంది. శ్రీకృష్ణుని యొక్క యాదవ వంశం మొత్తం నెమ్మదిగా కనుమరుగవుతుంది. ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. లార్డ్ కృష్ణుడు యొక్క మరణం యొక్క విషాదకరమైన కథను పరిశీలించండి.

Janmasthami Special: How Did Lord Krishna Die?

గాంధారి యొక్క శాపం
ఆమె 100 కుమారుల మరణ శోకంను అధిగమించడానికి,గాంధారి మొత్తం రక్తపాతంనకు కారణం నీవే అని కృష్ణున్ని నిందించేను. ఆమె కృష్ణునితొ నీవు దేవుడవు నీకు యుద్ధం ఆపే శక్తి ఉందని అనెను. కానీ అతను తన కుమారులందరినీ చనిపోయేలా చేసెను. అందువలన,గాంధారి యాదవ వంశం కూడా కురు వంశం వలే నాశనం కావాలని కృష్ణున్ని నిందించేను. కృష్ణ రాజ్యంలో అన్నతమ్ములు ఒకరికొకరు చంపుకొంటారని అనెను. అంతేకాక కృష్ణునికి ఒంటరి మరణం వస్తుందని నిందించేను. ద్వారక సముద్రంలో మునిగిపోతుందని అనెను. కృష్ణుడు నవ్వి మరియు గాంధారి తన ప్రచండ భక్తుడు మీద శాపం పెట్టిందని చెప్పెను.

యాదవ వంశం ముగింపు
శ్రీకృష్ణుని పాలనలో యాదవ వంశం విరాజిల్లుతున్నది. అయితే ఒక సమయం తరువాత అధికారం మరియు ధనవంతుల మనసులు విషపూరితంగా మారాయి. యాదవుల సహోదరులలో జారత్వం మరియు తగాదాలు మరియు అన్ని రకాల తీవ్ర వివాదాలు చెలరేగాయి. దీని ఫలితంగా పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగాయి. చివరికి యాదవులు యుద్ధభూమిలో ప్రతి ఒక్కరు ఇతరులను చంపెను. ఈ యుద్దంలో కృష్ణుడు యొక్క కుమారుడు అయిన ప్రద్యుమ్నుడు కూడా మరణించెను. ఈ విధ్వంసంను చూసిన లార్డ్ ద్వారకను వదిలి అడవులకు వెళ్ళాలని నిర్ణయించుకొనెను.

ద్వారక మునిగిపోవుట
కృష్ణుడు ద్వారకను వదిలి వెళ్ళిన తర్వాత,ద్వారక నగరం మొత్తం సముద్రంలో కొట్టుకొని పోయి చివరకు అది నీటిలో మునిగిపోయిందని చెప్పబడింది. ద్వారక యొక్క నిజమైన నగరం అరేబియా సముద్రం కింద ఉంది.

కృష్ణుడు యొక్క మరణం
కృష్ణుని యొక్క పెద్ద సోదరుడు బలరాముడు మరణించిన కొంత సమయానికి కృష్ణుడు అడవిలోకి వెళ్ళెను. ఈ శోకాన్ని అదికమించటానికి ఒక రోజు లార్డ్ కృష్ణ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక వేటగాడు లార్డ్ యొక్క అడుగులను లోటస్ గుర్తుతో చూసి జంతువు అని పొరపాటు పడెను. వేటగాడు లార్డ్ యొక్క పాదాలను బాణంతో కొట్టెను. తన తప్పు తెలుసుకోవడంతో,వేటగాడు కృష్ణుని వద్దకు వచ్చి క్షమించమని కోరేను. ఈ విధంగా నా గమ్యం నిర్దేశం జరిగినది అని చెప్పెను. అందువలన, కృష్ణుడు ద్వారక యుగ అంతంనకు గుర్తుగా భూలోకం వదిలి వెళ్ళెను.

వేటగాడు నిజ స్వరూపం
పవిత్రగ్రందాల ప్రకారం కృష్ణున్ని చంపిన వేటగాడు,గత జన్మలో వానర రాజు అయిన వాలి, ఈ పునర్జన్మలో వేటగాడుగా జన్మించెను. కృష్ణుడు తన గత జన్మలో రాముని అవతారంలో సరైన కారణం లేకుండా పొదల చాటు నుండి వాలిని చంపెను. కాబట్టి అతను వేటగాడి చేతిలో మరణం ఉందని ఉద్దేశించబడింది. అందువలన దేవుడు కూడా కర్మల బారి నుండి తప్పించుకొనుట సాధ్యం కాదని స్పష్టంగా చెప్పవచ్చు.

Story first published: Thursday, August 14, 2014, 16:07 [IST]
Desktop Bottom Promotion