For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కన్నీరు పెట్టడం ఓ వరం.. కన్నీటితో ఆరోగ్యం పొందడం మరో వరం..!

|

మానవ ఉద్వేగాలలో "కన్నీరు" ఒకటి. బాగోద్వేగాల కలబోత లో ఎప్పుడో ఒకసారి మనందరమూ కన్నీరు పెట్టుకొన్నవారిమే. దుఖం, దిగులు, బాధ, వేదన వంటి సందర్భాలలోనే కాదు ,పట్టలేని సంతోషమొచ్చినా కూడా మన కళ్ళ వెంట నీళ్ళొస్తాయి.(వాటిని మనము ఆనందబాష్పాలంటామని అందరికీ తెలిసిందే). కన్నీళ్ళు పెట్టుకోవడమూ ఒక గొప్ప వరమే. మన లోపల ఆర్ద్రత, ప్రేమ, దయ, ఉన్నాయని చెప్పడానికి కన్నీళ్ళే ఉదాహరణ. ఏందుకంటే కన్నీళ్ళు ఆరోగ్యకరమైన ఉద్వేగము. ఉదాహరణకు: సినిమాలో హీరోహిన్‌ పడుతున్న కష్టాలు చూస్తున్న ప్రేక్షకులు కంటతడి పెడతారు. అదే సినిమాలో హాస్యనటులు కడుపుబ్బ నవ్విస్తుంటే ఆ సమయములోనూ ప్రేక్షకులవెంట కన్నీరు కారుతుంది. విషాదానికి, ఆనందానికి కూడా కన్నీరు కారుతుంది. మనసులో కలిగే భావోద్వేగాలను కన్నీళ్లు ప్రతిబింబిస్తాయి. అయితే భావోద్వేగాలు మనుషులకే కాదు ఇతరజీవులకు ఉంటుంది... కాని వాటి కంటివెంట నీరు కారదు. కంటినీరు పెట్టడము అనేది మానవ లక్షణము. అదే జంతువుల్లో అయితే వాటి బాధను అరుపులతో తెలుపుతాయి.

కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి, వాటిని (lubricate చేసి) తడిగా ఉంచడానికి స్రవించే ద్రవాన్ని అశ్రువులు, కంటినీరు లేదా కన్నీరు అంటారు. ఇలా కన్నీరు స్రవించే ప్రక్రియను వైద్యశాస్త్రంలో లాక్రిమేషన్(lacrimation)అంటారు. సాధారణ పదజాలంగా "ఏడవటం" అనే చర్యను ఇది సూచిస్తుంది. దుఃఖం, సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినపుడు ఇది జరుగుతుంది.

Know Why Tears Are Beneficial

కన్నీరులో రకాలు:
కన్నీరు స్రవించే విధానం బట్టి వాటిని మూడు విధాలుగా విభజిస్తారు.

1. శుభ్రం చేసే కన్నీరు (Basal Tears): క్షీరదాలు తమ కంటి కార్నియాను తడిగా, శుభ్రంగా ఉంచడానికి, దుమ్మును నివారించానికి మరియు కొంత పోషక పదార్ధాలను అందించడానికి కన్నీటిని నిరంతరం స్రవిస్తాయి. ఈ కన్నీటిలో నీరు, మ్యుసిన్, లిపిడ్‌లు, లైసోజైములు, లాక్టోఫెర్రిన్, ఇమ్యునోగ్లోబిలిన్‌లు, గ్లూకోస్, యూరియా, సోడియం, పొటాషియం వంటి అనేక పదార్ధాలు ఉన్నాయి. కన్నీటిలో ఉన్న లవణాలు రక్తం ప్లాస్మాలో ఉన్న లవణాలకు ఇంచుమించు సరిమోతాదులో ఉన్నాయి. షుమారుగా 24 గంటలలో 0.75 నుండి 1.1 గ్రాముల వరకు స్రవిస్తాయి. వయసు పెరిగినకొద్దీ ఈ స్రావం తగ్గుతుంది.

2. కలక కన్నీరు (Reflex Tears): ఏదైనా ధూళి వంటివి తగిలి కంటికి irritation కలిగినపుడు (ఉదా. ఉల్లి, మిరియం పొడి, దుమ్ము వంటివి) కంటినుండి కన్నీరు స్రవిస్తుంది. ముక్కులో కలిగే వాసన వల్ల, తీవ్రమైన కాంతి వలన, నోటిలి ఘాటైన రుచి కలిగినపుడు కూడా ఇలావే జరుగుతుంది. ఇలా జరిగే అసంకల్పిత ప్రతీకార చర్య ద్వారా కంటికి కలిగిన ఇర్రిటేషన్ పదార్ధాలను తుడిచి వేయడానికి కన్నీరు స్రావం జరుగుతుంది.

3. ఏడవడం వలన కన్నీరు (Crying or Weeping (Psychic Tears)): బలమైన భావోద్వేగాలు, నొప్పి, తడబాటు వంటి వాటి కారణంగా కూడా కన్నీరు వెలువడుతుంది. మనుషులలో ఈ ప్రక్రియకు సమాంతరంగా ముఖం ఎర్రబడడం, గొంతులో గద్గదత, శరీరం కంపించడం కూడా జరుగుతాయి. పైన చెప్పిన రెండు విధాల కన్నీటిలో కంటె ఈ మూడవ తరహా కన్నీరులో ప్రోటీన్ సంబంధిత పదార్ధాలు, హార్మోనులు ఎక్కువగా ఉంటాయి. ఆ ఉద్వేగ సమయంలో నరాలలో జరిగే సంకేతాల కారణంగా ఇలా జరుగుతుంది.

కన్నీటి ఔషధ గుణాలు:
"ఏ నీళ్ళూ దొరకని ఎడారిలో కన్నీరైనా తాగి బ్రతకాలి" అన్నాడో కవి. కన్నీరు ఆరోగ్యానికి పన్నీరని, ఏడిస్తే అనారోగ్యం దూరం అవుతుందనీ, ప్రశాంతత చేకూరుతుందనీ పరిశోధనల్లో వెల్లడి అయ్యిందట. ఆరోగ్యంగా ఉండాలంటే మనస్ఫూర్తిగా కన్నీళ్లు పెట్టుకోండి. వెక్కివెక్కి ఏడ్వండి. ఉద్వేగాలను దాచుకుని బాధ పడటం కంటే ఏడిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కన్నీపెట్టుకొన్నాకు మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. కన్నీళ్లలో ప్రొటీన్లు, మాంగనీసు, పొటాషియం, హార్మోన్లు, ప్రొలాక్టిన్ ఉంటాయి. మాంగనీసు అత్యవసరమైన పోషక పదార్థం. రక్తం గడ్డ కట్టడానికి, చర్మ వ్యాధులను నయం చేయడానికి, కొలెస్ట్రాల్ (కొవ్వు)ను తగ్గించడానికి కొద్ది మోతాదు మాంగనీసు సరిపోతుంది. నరాలు పనిచేయడానికి, కండరాల నియంత్రించడానికి, బీపీని అదుపులో ఉంచడానికి పొటాషియం ఉపకరిస్తుంది. ఏడవటం వల్ల ఒత్తిడి నివారించడానికి, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, వివిధ అవయవాలను ప్రభావవంతంగా పనిచేయించడానికి ప్రొలాక్టిన్ హార్మోన్ ఉపకరిస్తుంది. మీ ప్రేమను ఇతరులకు తెలపడానికి వెయ్యి మాటల కంటే ఒక్క కన్నీటి చుక్క ఎంతో గ్రేట్.

English summary

Know Why Tears Are Beneficial | కన్నీరు చేసే మ్యాజిక్ గురించి తెలుసుకోండి...!

Holding an emotion is harder than bursting it out. Most of us are emotional beings and express happiness or sadness with tears. Does this means that those who don't cry are stronger than you? They might even consider you as a person with low mental or emotional control. But, the fact is, those who cry are the most emotionally healthy people as they are straight-forward enough to express what they feel.
Story first published: Thursday, March 28, 2013, 15:48 [IST]
Desktop Bottom Promotion