మానవత్వాన్ని చాటుకొన్నసైనికులు

Posted By:
Subscribe to Boldsky

Fighters Of Humanity
సాధారణంగా ఈ జెన్ కథలలో చదవడానికి బోర్ అనిపించినా..వీటిలో అర్థం కొంతైనా ఉంటుంది. జెన్ కథలంటే గురు శిష్యులకు మధ్య జరిగే కథలు. శిష్యల అమాయకత్వాన్ని గురువులు ఏవిధంగా అధిగమించేలా చేస్తారో ఈ కథలను చదడం ద్వారా తెలుస్తుంది. జెన్ కథలు ఒక్క గురు శిష్యుల మధ్యనే కాకుండా..ఆ నాటి కాలంలో కొందరు వ్యక్తుల మధ్య సంభాషణలను ఈ విధంగా తెలయచేస్తున్నాయి.

ఒకసారి ఒక యుద్ధంలో పాల్గొన్న కొందరు జపనీస్ సైనికులు గసన్‌ ఆలయాన్ని తమ ప్రధాన కార్యాలయంగా మార్చుకోవాలనుకున్నారు. అందుకోసమే ఆ సైనికులు అక్కడ పనిచేయ దలచుకొన్నార్. అదే సమయంలో గసన్ తన వంటవాడికి ఇలా ఆర్డర్ వేశాడు "మనం తినే సాధారణ ఆహారాన్నే ఆ అధికారులకు కూడా వడ్డించు" అని. గసన్ మాటలు విన్న ఆ సైనికులు కోపంతో ఊగిపోయారు.

ఆ సైనికుల్లో ఒకరు గసన్‌తో ఇలా చెప్పారు: "మమ్మల్ని మీరేమనుకుంటున్నారు? మన దేశం కోసం మా ప్రాణాలను సైతం త్యాగం చేసే సైనికులం మేము. మమ్మల్ని మరింత మంచిగా ఎందుకో చూసుకోరు?"

అప్పుడు గసన్ వారితో ఇలా అన్నారు: "మీరు మమ్మల్ని ఏం అనుకుంటున్నారు? మేము కూడా సైనికులమే, అందరినీ రక్షించాలనే మానవత్వపు లక్ష్యంతో కూడుకున్న సైనికులం". అని ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

English summary

Fighters Of Humanity | మానవత్వాన్ని చాటుకొన్నసైనికులు

Once some Japanese soldiers who were engaged in a sham attack wanted to make Gasan's temple their headquarters. Gasan ordered his cook "Let the officers also have the simple food that we eat" Gasan's instructions infuriated the soldiers.
Please Wait while comments are loading...
Subscribe Newsletter