For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వార్థపరుడు కంటే మార్గదర్శకుడు గొప్ప

|

ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒక ఎడారి ప్రయానిస్తూ...కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వారు ప్రయాణించాల్సిన మార్గాన్ని కోల్పోయారు అదే సమయంలో వారికి అధికంగా ఆకలి, దప్పిక ముంచుకొచ్చాయి. అయినా కూడా ఆ ఎడారిలోనే మార్గం కోసం వెతక సాగారు. ఆకలి, దప్పిక తీర్చుకోవడం ఎలా అని, అటూ..ఇటూగా వెతుకుతూ ముందుకు ప్రయాణించసాగారు. చివరకు వారికి ఎదురుగా ఓ గోడ కనిపించింది. అదిచూసిన వారు ఎటువెళ్ళాలో తోచక ఒక్క క్షణం నిలబడి శ్వాస పీల్చుకోవడం నిలిపేసారు.

అయితే ఆ నిశ్శబ్దంలోనే అటు వైపుగా జలపాతం పారే శబ్దాన్ని పసిగట్టారు. జలజలా రాలే నీటి శబ్దంతో పాటు కిలకిల... కిచకిచ పక్షుల ధ్వని కూడా వినిపించడం వారు గుర్తించారు. గోడకు అటువైపుగా ఉన్న ఒక పచ్చని చెట్టుకు పైబాగాన ఎక్కడో చివర్లో నోరూరించే... రుచికరమైన... పండ్లు కనిపించాయి. అంతే ఆకలిగా ఉన్నా ఆ ఇద్దరు ప్రయాణికుల్లో ఒకరు ఆ గోడ ఎక్కి ఆ పండ్లను కొయ్యడానికి, గోడ ఎక్కి, గోడకు అటుప్రక్కకు దూకాడుడానికి ప్రయత్నించాడు. అప్పుడే తెలుసుకొన్నాడు అటువైపుగా ఒయాసిస్(ఎడారిలో నీటి జలాశయం)ను కనుగొన్నాడు.

Guidance To Oasis-Zen Story

అయితే మొదటి ఎక్కిన ప్రయాణికుడు మాత్రం తన స్వార్థంతో గోడ ఎక్కి అటువైపు చేరుకోగలిగాడు. రెండో ప్రయాణికుడు మాత్రం ఎడారికి తిరుగు ప్రయాణం సాగించాడు. ఎందుకంటే తనలా ఇంకెదరు ప్రయాణికులు ఆకలితో.. దప్పికతో అలమటిస్తున్నారో వారికి దారి చూపడం కోసం...అంటే జలాశయానికి దారి చూపడానికి మార్గదర్శకత్వంగా నిలిచాడు రెండో ప్రాయాణికుడు. అంటే దీని అర్థం స్వార్థ పరుడు కంటే ఇతరుకు మార్గదర్శకత్వంగా నిలిచిన వాడు గొప్పవాడని ఈ జెన్ స్టోరి తెలియజేస్తోంది.

English summary

Guidance To Oasis-Zen Story | స్వార్థపరుడు కంటే మార్గదర్శకుడు గొప్ప


 Two people were lost while traversing a desert. Hunger and thirst took on to them. Ultimately they came face to face with a wall. To their relief they heard the sound of a waterfall and birds chirping.
Desktop Bottom Promotion