For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహా మృత్యుంజయ మంత్రం యొక్క ప్రాముఖ్యత

|

మహా మృత్యుంజయ మంత్రంను మరణం జయించే మంత్రం లేదా త్రయంబక మంత్రం అని అంటారు. మహా మృత్యుంజయ మంత్రంను నయం చేయుటలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు.

మహా మృత్యుంజయ మంత్రం లార్డ్ శివునికి అంకితం చేయబడింది. ఋషి మార్కండేయ ద్వారా సృష్టించబడిందని చెబుతారు. ఋషి మార్కండేయచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది. ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోయెను. అప్పుడు మార్కండేయడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడెను.

Importance Of Maha Mrityunjaya Mantra

మహా మృత్యుంజయ మంత్రం చదవండి
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్


మంత్రం యొక్క అర్ధం

అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు,సుగంద భరితుడు అయిన శివున్ని మేము పుజిస్తున్నాము. పండిన దోసకాయ తొడిమ నుండి వేరుపడినట్లుగానే మమ్మల్ని కూడా అమరత్వం కొరకు మృత్యువు నుండి విడుపించు కాకా అని అర్ధం.

మహా మృత్యుంజయ మంత్రం శివుని యొక్క రెండు అంశాలను వివరిస్తుంది. ఒక అంశం ఏమిటంటే మండే మూడు కనులతో ఉన్న దేవుడుని చూపిస్తుంది. ఇంకా రెండవది మరణ భావన ఉన్న సమయంలో రక్షిస్తాడని నమ్ముతారు. కాబట్టి, యముడు మానవుల మరణం తీసుకుని మరియు ప్రకృతి సంతులనంను పునరుద్ధరించడానికి భాద్యతను తీసుకొనెను.

ఈ కారణంగా మానవులకు భూమి మీద మరణం గురించి బాధ ఎక్కువైనది. అన్ని రకాల భయాలను శాంతింపజేయడానికి మానవ జాతికి శివుడు ఈ మంత్రమును ఉపదేశించెను. ఒత్తిడి, విచారం, అనారోగ్యం లేదా ఆకస్మిక మరణ భయం ఏర్పడినప్పుడు ఈ మంత్రం యొక్క శక్తి స్వస్థత చేకూర్చి కాపాడుతుంది.

మంత్ర జపం ఎలా చేయాలి?
మంత్రం జపించటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఈ మంత్రమును 108 సార్లు ఉచ్చారణ చేయవచ్చు.ఎందుకంటే మంచి గణాంక మరియు ఆధ్యాత్మిక విలువ కలిగి ఉంటుంది. అంతేకాక 12 మరియు 9 గుణకారం మొత్తం 108 అవుతుంది. ఇక్కడ 12 రాశిచక్రాలను,9 గ్రహాలను సూచిస్తుంది. మానవులు అన్ని గ్రహాలు మరియు రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు తగ్గి జీవితం సులభం మరియు ప్రశాంతంగా ఉండటానికి ఈ మంత్రాన్ని జపించాలి.

రెండవది,ఒక వ్యక్తి అసహజ మరణం లేదా తీవ్రమైన వ్యాధి బారిన పడినప్పుడు పూజారి ఈశ్వరునికి పూజ ఏర్పాట్లు మరియు ఈ మంత్రాన్ని పఠించును.

ఈ మంత్రం పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు. ఇది ఏకాగ్రతను మెరుగుపరచి మంచి నిద్రకు సహాయపడుతుంది.

మహా మృత్యుంజయ మంత్రం యొక్క ప్రాముఖ్యత

మహా మృత్యుంజయ మంత్రం జపించుట వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత మరియు ఆనందం తీసుకువచ్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది మనస్సు మరియు శరీరంనకు ఒక స్వస్థత బలంగా పనిచేస్తుంది.

మంత్రం ఒక వ్యక్తి యొక్క పునర్ యవ్వనమునకు సహాయపడుతుంది. ఇది దీర్ఘాయువు,ఆరోగ్యం మరియు ఒక వ్యక్తి బాగా ఉండటానికి ఒక ఆధారంగా ఉంటుంది. ఈ మంత్రం ఒక వ్యక్తి చుట్టూ మొత్తం ప్రతికూల శక్తిని ఉంచుతుంది. అంతేకాక దైవ కంపనాలను సృష్టిస్తుంది. అందువలన అతడు/ఆమె అన్ని భయాలను అధిగమించడానికి సహాయపడుతుంది.

Desktop Bottom Promotion