For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందు ధర్మంలో 'ఓం'ను భగవంతుని చిహ్నంగా ఎందుకు స్వీకరించారు?

|

"ఆన్ని మంత్రాలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం;'. దినినే ప్రణవమని అంటారు. మంత్రోచారణం జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. సనాతనమైన హిందూ ధర్మమునందు ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. సర్వశ్రేష్ఠుడైన భగవంతునికి ఆకార రూ పం(నామ) నాదరూపం ఓంకారము. ప్రణవ నాద ము, ప్రధమ నామము, ఏకాక్షరమైన ఓంకారము. ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకార ము నుంచే యావత్తు జగము ఉద్భవించింది.వేదముల యొక్క సారము ఓంకారము. ఓం' అంటే ప్రారంభాన్ని తెలుపునది కూడా. ఓకాక్షర మంత్రము, భగవంతుని ముఖ్యనామమైన ఓం'కు అనేక అర్థాలు కలవని రుషులు తెలియజేశారు. బ్రహ్మనాదము ఓంకారము. ఆత్మ ఓంకార మంత్ర స్వరూపము ప్రణవ నాదమే ప్రాణము. ప్రధమ నాదము ఓంకారము. అకార, ఉకార, మకారములను మూడు అక్షరముల కలయిక వలన ఓంకారము ఉద్భవించినది.

ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి.

Significance of OM (AUM) in Hinduism

అందులో అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.

శబ్దమే భగవంతుడని చెప్పబడింది. ప్రతిపదమునకు మూలాధారము గా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది. శబ్దోచ్చారణలో మనం కంఠంలోని స్వరపేటికను,అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాము.

ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందా? ఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారము.ఇందులో అ,ఉ,మ లు ఉన్నాయి.

నాలుకలోని, అంగిలిలోని ఏ భాగము కూడా ‘అ ‘కార ఉచ్చారణ కు తోడ్పడదు. ఇది ఓంకారానికి బీజం గా ఉంది .చివరిది ‘మ ‘కారము.పెదవులని మూసి దీన్ని ఉచ్చరిస్తారు .

నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయములో దొర్లుకుంటూ ఉంటుంది.ఇలా శబ్ద ఉచ్చారణా ప్రక్రియనంతా " ఓం " కారం తెలియజేస్తూంది. అందువలన " ఓం " కారాన్ని స్వీకరించడము జరిగింది.

English summary

Significance of OM (AUM) in Hinduism

The ancient syllable "OM" is the shortest of the Mantras and in Indian tradition it is a word suggestive of God.
 The scriptures tell us that "OM" is the planets primordial vibration from which the entire universe has arisen. All other sounds are contained within it.
Story first published: Tuesday, May 13, 2014, 17:38 [IST]
Desktop Bottom Promotion