For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంకష్టి చతుర్థి యొక్క విశిష్టత

|

సంకష్టి చతుర్థి; గణేశుడిని ప్రత్యేక పూజలతో ఆరాధించే పవిత్రమైన రోజు. దీన్ని ప్రతి పౌర్ణమికి నాలుగో రోజు లేదా హిందూ మతక్యాలెండర్ ప్రకారం కృష్ణ పక్షాన జరుపుకుంటారు. మహిళలు వారివారి కుటుంబక్షేమం కోసం చేసే పూజలలో సంకష్టి చతుర్థి చాలా వేగవంతంగా ప్రసిద్ధి చెందింది.

సంకష్టి అంటే కష్టకాలం నుండి విమోచన కలగటం. అందువలన, ఈ వ్రతం ఆచరించటం వలన భగవాన్ గణేష్ ఒక వ్యక్తి జీవితంలో అన్ని సమస్యలు మరియు అన్ని అడ్డంకులను నిర్మూలిస్తాడని నమ్ముతారు. సంకష్టి చతుర్థి రోజున పగలంతా కఠినమైన ఉపవాసముండి, రాత్రి చంద్రుని చూసిన తరువాత ఉపవాస దీక్ష విరమిస్తారు.

సంకష్టి చతుర్థిని ప్రతి నెల జరుపుకుంటారు. ప్రతి నెలలో, గణేషుడిని వేరువేరు పేరున మరియు పీఠం (లోటస్ పుష్ప రేక)ను పూజిస్తుంటారు. ప్రతి నెల జరుపుకునే సంకష్టి చతుర్థిన భగవాన్ గణేశుడికి పూజలు జరిపిన తరువాత కథాశ్రవణం కూడా చేస్తారు. భగవాన్ గణేశుడికే కాకుండా ,మహాదేవుడు అయిన శివునికి కూడా పూజలు. జరుపుతారు.

సంకష్టి చతుర్థి యొక్క పురాణము మరియు ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం రండి:

సంకష్టి చతుర్థి పురాణ గాథ

సంకష్టి చతుర్థి పురాణ గాథ

గణేశుడి కథ మనందరికీ తెలిసిందే! దేవతామూర్తి అయిన పార్వతిదేవి అభ్యంగన స్నానం ఆచరించే ముందు ఆమె శరీరానికి పట్టించిన నలుగుపిండితో గణేశుడిని సృష్టించింది. అప్పుడే ఆమె ఆ బాలుని కొడుకుగా స్వీకరించింది. ఒక రోజున ఆమె స్నానం ఆచరించటానికి వెళుతూ ఆ బాలుని ద్వారం వొద్ద కాపలాగా ఉంచింది. అదే సమయంలో శివుడు తన గణాలతో ఇంటిలోనికి ప్రవేశించాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నానికి గణేశుడు అడ్డుపడి వెళ్ళనివ్వలేదు.

సంకష్టి చతుర్థి పురాణ గాథ

సంకష్టి చతుర్థి పురాణ గాథ

ఆ బాలుడు తమ కుమారుడే అని గుర్తించని శివుడు, తనకు కలిగిన అవరోదానికి ఆగ్రహించి ఆ బాలుని సంహరించమని తన గణాలను ఆదేశించాడు. ఆ పోరాటంలో, తల్లి ఆజ్ఞ పాటిస్తున్న ఆ ఘటనలో గణేశుడి తలను నరికేశారు.

సంకష్టి చతుర్థి పురాణ గాథ

సంకష్టి చతుర్థి పురాణ గాథ

పార్వతి విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఆదిశక్తిగా మారింది. విశ్వమంతా నాశనం చేయటానికి సిద్ధపడింది. అప్పుడు శివుడు విషయం తెలుసుకుని తన భార్య ఆగ్రహావేశాలను చూసి, ఆ బాలుని తలకు బదులుగా, ఒక ఏనుగు తలను అతికించి జీవం పోశాడు. ఆ బాలుని విశ్వమంతా బుద్ధి,జ్ఞానం మరియు శ్రేయస్సుకు అధిపతిగా పూజిస్తారని శివుడు వరమిచ్చాడు.

సంకష్టి చతుర్థి పురాణ గాథ

సంకష్టి చతుర్థి పురాణ గాథ

అప్పటి నుండి వినాయకుడు ఏ వేడుకలో అయినా మొదటి పూజ అందుకుంటున్నాడు మరియు అతను అన్ని అడ్డంకులు తొలగించే దైవం అని ప్రజలు నమ్ముతారు. ఈ వరం శివుడు సంకష్టి చతుర్థి రోజున భగవాన్ గణేశుడికి ప్రసాదించాడని ఒక నమ్మకం. అందువలన, ప్రజలు వారి జీవితాల్లో అన్ని అడ్డంకులను వదిలించుకోవటం కోసం సంకతారా లేదా విఘ్నహర్తుడిని పూజిస్తారు.

సంకష్టి చతుర్థి పురాణ గాథ

సంకష్టి చతుర్థి పురాణ గాథ

సంకష్టి చతుర్థి గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పూజను కుటుంబం యొక్క సౌభాగ్యం మరియు శ్రేయస్సు కోసం నిర్వహిస్తారు. ఈ సంకష్టి చతుర్థి పూజ సాయంత్రం చంద్రుని వీక్షించిన తర్వాత నిర్వహిస్తారు. మొదటగా వినాయకుని విగ్రహం స్వచ్ఛమైన వేదిక మీద ఉంచుతారు. పూలు మరియు గడ్డితో పూజిస్తారు. ఉండ్రాళ్ళు మరియు కుడుములు వంటి పిండివంటలు గణేశుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.

సంకష్టి చతుర్థి పురాణ గాథ

సంకష్టి చతుర్థి పురాణ గాథ

చంద్రుని చూసిన తరువాత ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారు. పూజ అయిన తరువాత వ్రతకథా శ్రవణం జరుపుతారు. ఈ పూజను సాధారణంగా దంపతులు తమ కుటుంబం వృద్ధి చెందాలని జరుపుకుంటారు.

Story first published: Tuesday, June 24, 2014, 18:15 [IST]
Desktop Bottom Promotion