For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటికి తీసుకురావటానికి గణేశ విగ్రహాల రకాలు

|

గణేష్ చతుర్థి సమీపిస్తుంది. గణపతి బప్పా వేడుకను జరుపుకునేందుకు ఇప్పుడు పూర్తి స్వింగ్ లో ఉంది. ప్రతి సంవత్సరం,అనేక కుటుంబాలు గణేష్ చతుర్థి సమయంలో వినాయకుడు విగ్రహంను ఇంటికి తీసుకువస్తారు. అయితే కొన్ని కుటుంబాలు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన విగ్రహ రకాన్ని తెచ్చుకోనే సంప్రదాయాన్ని కలిగి ఉన్నారు. కొంత మంది కూర్చున్న వినాయకుడు అత్యంత శుభప్రదమైనది అని నమ్ముతారు. అలాగే కొంత మంది నృత్య వినాయకుడు అని నమ్ముతారు.

ఇక్కడ మీరు ఇంటికి తీసుకురావలని కోరుకొనే వినాయకుడి విగ్రహాల ప్రధాన రూపాలు ఉన్నాయి.

Types Of Ganesha Idols To Bring Home

కూర్చున్న వినాయకుడు
ఈ వినాయక విగ్రహం సాదారణ రకంగా ఉంటుంది. ఎక్కువ మంది ఇంటికి సింహాసనంపై కూర్చొని ఉన్న వినాయకుడిని తెచ్చుకుంటారు. కొన్ని సార్లు వినాయకుని యొక్క ఇద్దరు భార్యలు సిద్ది,బుద్ది అయన ఒడిలో కూర్చొని ఉండటం చూడవచ్చు. కొన్ని సృజనాత్మకంగా రూపొందించిన విగ్రహాలు కూడా ఉంటాయి. వినాయకుడు తనకు ఎంతో ఇష్టమైన ఎలుక వాహనం మీద కూర్చున్న విగ్రహాలు కూడా ఉంటాయి.


నిల్చున్న వినాయకుడు
సాధారణంగా వినాయకుడి విగ్రహం నిలబడి ఉంటే భారీగా మరియు గర్వంగా ఉంటుంది. నిల్చున్న వినాయకుడు విగ్రహాలలో అపరిమితమైన బొడ్డు స్థూలముగా కనపడుతుంది. కానీ వినాయకుడు పూర్తిగా నిలబడి ఉన్నప్పుడు, ప్రతిబింబం కేవలం ఉత్కంఠభరితముగా ఉంటుంది. నిల్చున్న వినాయకుడి విగ్రహం తరచుగా ఒక సింహాసనం మీద వాలి కనిపిస్తుంది.

నటరాజ్ వినాయకుడు
వినాయక విగ్రహం డాన్స్ భంగిమలో ఉంటుంది. ఈ వినాయకుడి యొక్క రూపం కొంతవరకు నటరాజ్ యొక్క నృత్యం భంగిమలో కనిపిస్తుంది. మాకు తెలిసినంత వరకు,నటరాజ్ డ్యాన్స్ భంగిమలో ఉన్న విగ్రహం విధ్వంస నాట్యంను సూచిస్తుంది. ఈ డ్యాన్స్ భంగిమ ఒక విధ్వంసక శక్తికి గుర్తు. వినాయకుడు అసురులను చంపినప్పుడు ఈ భంగిమ పెట్టారు. ఈ రకమైన వినాయకుడు ఇళ్ళల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే దీనిని కొన్నిసార్లు మండపాలు లేదా కమ్యూనిటీ పూజలు వద్ద పెడతారు.

అనుకుని ఉన్న వినాయకుడు
ఏనుగు దేవుడు చాలా రాచఠీవిని కలిగి ఉంటారు. కాబట్టి ఒక సోఫా మీద ఆనుకుని ఉన్న వినాయకుని భారీ ఫిగర్ చాలా మందిని ఆకట్టుకుంటుంది. సాధారణంగా,వినాయకుడు ఒక దిండు మీద ఆనుకుని మరియు ఒక చేతితో తనకు తానుగా సపోర్ట్ తీసుకుంటారు. ఈ రకమైన వినాయకుని విగ్రహం సృజనాత్మక కళా రూపాల్లో మరింత తరచుగా కనిపిస్తుంది. అయితే ఈ విగ్రహాన్ని పూజించరు.

5 తలల వినాయకుడు
ఒక పౌరాణిక వృత్తాంతంలో,వినాయకునికి 5 ఏనుగు తలలను ఇవ్వటం జరిగింది. ఆయనకు ఉత్తర,దక్షిణ, తూర్పు మరియు పశ్చిమ నాలుగు దిశల నుండి వస్తున్న సమస్యల నుండి భూమి రక్షించడానికి 4 తలలు ఇవ్వటం జరిగింది. అయన స్కైస్ నుండి కూడా భూమిని రక్షించడానికి ఐదవ తల ఆయనకి ఇవ్వబడింది. దేవతల కోపాన్ని తగ్గించటానికి స్వర్గం నుంచి మనల్ని రక్షిస్తారు.


ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన కొన్ని రకాల వినాయకుని విగ్రహాలు ఉన్నాయి. ఏది మీరు ఈ వినాయక చవితి నాడు మీ ఇంటికి తీసుకువెళ్ళుతున్నారు.

Desktop Bottom Promotion