For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రావణ మాసం అంటే శివునికి ఎందుకు ఇష్టమైన నెల?

|

హిందూ మత క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన నెలలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో లార్డ్ శివ భూమికి దగ్గరగా వచ్చి పాపపరిహారాన్ని పరిశీలిస్తారు. అందువల్ల ఎవరైనా శివున్ని పూర్తి విశ్వాసంతో మరియు భక్తితో ప్రార్థన చేస్తారో వారికీ అయన దీవెనలు అందుతాయి. శ్రావణ సోమవారాలలో మహిళలు ముఖ్యంగా వారు మంచి జీవిత భాగస్వామిని పొందడానికి మరియు వారి కుటుంబం శ్రేయస్సు కోసం శివున్ని పూజిస్తారు.

శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా?:క్లిక్ చేయండి

శ్రావణ మాసం లార్డ్ శివుని యొక్క ఇష్టమైన మాసం. లార్డ్ శివుడు శ్రావణమాసంలోనే పార్వతి దేవిని తిరిగి కలిసారని నమ్ముతారు. అందువలన శ్రావణమాసంలో ఒక మంచి భర్త కోసం దేవునికి ప్రార్థన చేస్తే,ఆ స్త్రీలకు మంచి జీవితం మరియు మంచి భాగస్వామి లభిస్తాడని నమ్ముతున్నారు. మేము ఈ వ్యాసంలో శ్రావణ మాసం లార్డ్ శివకు ఎందుకు ఇష్టమైన నెలగా భావిస్తున్నారో కొన్ని ఇతర కారణాలను చర్చిస్తున్నాము.

శ్రావణమాసంలో ఎటువంటి ఆహారాలు తినకూడదు?:క్లిక్ చేయండి

కాబట్టి శ్రావణ మాసం లార్డ్ శివుని యొక్క ఇష్టమైన నెలగా ఉంది. దాని గురించి తెలుసుకోవాలని మీకు ఖచ్చితంగా ఆసక్తికరముగా ఉంటుంది. శివునికి శ్రావణమాసం ఇష్టమైన నెల ఎందుకో కారణాలు తెలుసుకుందాము.

పార్వతీదేవి తిరిగి కలవటం

పార్వతీదేవి తిరిగి కలవటం

పురాణములు ప్రకారం, సతీదేవి అగ్నిలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత, పార్వతీ దేవిగా పునర్జన్మ ఎత్తేను. ఆమె లార్డ్ శివుని వివాహం చేసుకోమని గొప్ప తపస్సు చేసెను. సుదీర్ఘ కాలం తపస్సు చేసిన తరువాత లార్డ్ శివుడు గర్వంగా పార్వతిని వివాహం చేసుకోవటానికి అంగీకరించేను. ఈ శ్రావణ మాసంలోనే పార్వతీదేవి, శివుడు మళ్లీ కలిసారని చెప్పుతారు. అందుకే శ్రావణమాసంనకు అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్నది.

శివుడు తన అత్తమామలను సందర్శించడం

శివుడు తన అత్తమామలను సందర్శించడం

పవిత్ర గ్రంధాల ప్రకారం లార్డ్ శివుడు శ్రావణ మాసం సందర్భంగా అత్తమామల ఇంటిని సందర్శించేను. అక్కడ అతను చాలా ప్రేమ మరియు ఆప్యాయతలను అందుకున్నారు. అందువలన శ్రావణమాసం ఆయన అభిమాన నెలగా పరిగణించబడుతుంది.

జలాభిషేకం

జలాభిషేకం

లార్డ్ శివుడు శ్రావణ మాసంలో తన అత్తమామలను సందర్శించిన తర్వాత, అయన గొప్ప అనురాగంను పొందారు. తన సందర్శనకు గుర్తుగా అయన జలాభిషేకం రూపంలో నీటితో స్నానం చేసెను. అందువలన ప్రజలు శివునికి లింగ రూపంలో నీరు, పాలు, పెరుగు మొదలైన వాటితో అభిషేకం చేస్తారు.

లార్డ్ ప్రాధాన్యత ఏర్పడింది

లార్డ్ ప్రాధాన్యత ఏర్పడింది

శ్రావణ మాసంలో శివుడు భూమి పై ఉన్న తన అత్తమామల సందర్శనకు వచ్చినప్పుడు భక్తులకు దగ్గరగా వచ్చాడని చెప్పుతారు. ఆ సమయంలో శివున్ని ప్రార్ధిస్తే, అయన ఆనందంతో ఆశీర్వదిస్తారని నమ్ముతారు.

 క్షీరసాగర మథనం

క్షీరసాగర మథనం

శ్రావణమాసంలో క్షీరసాగర మథనం అనేది మహాసముద్రం లేదా సముద్ర మథనంలో నిర్వహించారని పురాణాలలో ప్రస్తావించారు.

 శివుడు విషాన్ని త్రాగుట

శివుడు విషాన్ని త్రాగుట

శ్రావణమాసంలో జరిగిన క్షీరసాగర మథనంలో ఏర్పడిన చాలా ప్రమాదకరమైన విషాన్ని శివుడు త్రాగెను. విషాన్ని తీసుకున్న తర్వాత లార్డ్ అపస్మారక స్థితికి వెళ్లారు. ఆ తర్వాత లార్డ్ బ్రహ్మ యొక్క సలహా మీద దేవతలు శివునికి జలాభిషేకం మరియు వివిధ మూలికలతో చికిత్సను నిర్వహించారు. అప్పుడు శివునికి స్పృహ వచ్చింది. ఆ విధంగా అప్పటి నుంచి శివునికి జలాభిషేకం చేయటం సంప్రదాయంగా ప్రారంభించారు.

గొప్ప యోగి

గొప్ప యోగి

శివుడు ప్రపంచంలోనే గొప్ప యోగి. శివుడు సంవత్సరంలో ఈ శ్రావణమాస సమయంలో యోగ నిద్రలోకి వెళ్ళతారు. అందువల్ల, శ్రావణమాసం శివునికి అత్యంత విశిష్టమైనది.

Desktop Bottom Promotion